చాన్నాళ్ళ కిందట ఛందస్సు యాహూ గ్రూపులో ఒక చిన్న సమస్య ఇచ్చాను. తెలుగు భాషలో అన్నిటికన్నా అందమైనవని మీకనిపించే పది పదాలు తీసుకొని వాటితో పద్యం రాయమని. అప్పుడు నేను రాసిన పద్యం, యీ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గుర్తుకువచ్చింది:
అలకలు నటియించి అటువైపు తిరిగిన
చెలి మోములోనున్న చిలిపిదనము
బుజ్జి పాపాయిని పొత్తిళ్ళ లాలించు
అమ్మదనములోని కమ్మదనము
ఏరువాకల నాళ్ళ నిగురొత్తు వరిచాళ్ళ
జనపదమ్ములోని జానుదనము
వేసవి నడిరేయి వెన్నెల చిలికించు
నెలవంక నవ్వులో చలువదనము
కన్నె సరిగంచు పరికిణీ కలికిదనము
ఎంకిపాట పల్లవిలోని పెంకిదనము
కలిపి వడపోత పోసిన తెలుగుదనము!
తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!
ఇప్పుడు మళ్ళీ యీ పద్యాన్ని చదివితే యిందులో యిష్టమైన ఆ పదిపదాలనీ గుర్తించడం కష్టమవుతోంది. అన్ని పదాలూ అందంగానే కనిపిస్తున్నాయి మరి!
తెలుగువాడిగా తెలుగుభాషని నరనరాన యింకించుకున్న భాగ్యం కన్నా యీ జన్మకి ఇంకేం కావాలి!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Saturday, August 29, 2009
తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!
Subscribe to:
Post Comments (Atom)
చాలా బాగుంది.
ReplyDeleteచాలా బాగుంది మీ పూరణ.
ReplyDeleteఈ పద్యం అనే కాదండి మీ బ్లాగే సూపర్
ReplyDeleteచాలా బావుంది.
ReplyDeleteచాలా రిథమిక్‌గా ఉంది.
ReplyDelete"తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!" అంటే అర్థమేంటండి? ముఖ్యంగా నలువ అంటే?
"తెలుగువాడిగా తెలుగుభాషని నరనరాన యింకించుకున్న భాగ్యం కన్నా యీ జన్మకి ఇంకేం కావాలి!"
ReplyDeleteనిజమండి.బాగా రాసారు.
"తెలుగు తెలియుట" తెలియగ నలువ వరమె :)
ReplyDeleteఎంకి పెంకిదనము... అప్రయత్నంగా [మాగంటి వంశీగారి బ్లాగులోననుకుంటానండీ] చదివిన 'టెంకి పాట' గుర్తొచ్చిందండీ :)
కమెంటిన అందరికి నెనరులు.
ReplyDeleteసూర్యుడుగారు, నలువ అంటే బ్రహ్మ.
అయ్యా, ఈ బ్లాగులోని అక్షరాలు ముక్కలైనట్లుగా కనిపిస్తున్నాయి. అర్థం కావడం లేదు. మిగిలిన బ్లాగులతో ఈ సమస్య లెదు. కాస్త పరిష్కారం సూచిస్తారా?
ReplyDeleteమధుర మధురమౌ తెలుగు నా మాతృ భాష :)
ReplyDeleteపది మంచి పదాలతో పోటీని ప్రక్కన పెడితే, మొత్తం పద్యమంతా నాకు చాల బాగా నచ్చింది. అలాగే జేమ్స్ వ్రాసిన కామెంట్ "మదుర మదురమౌ తెనుగు న మాతృ బాష" అనే లైన్ కూడా నచ్చింది.
ReplyDelete@James గారు, పద్యపాదం బావుంది. పూర్తి పద్యాన్ని ప్రయత్నించండి.
ReplyDelete@రాజేష్ గారు, ధన్యవాదాలు.
Kameswararao garu,
ReplyDeleteIt is nice to see this sense of 'deja vu'.
I noted about your blog in Racchabanda.
I thought it is worthwhile to cross-post the original thread I started in Racchabanda "Chamdassu - The Mathematical Texture"
As I wished in my original post, some genius one-day will unravel 'nadaka' and facilitate many to appreciate/ write padyamas. The original Racchabanda post follows:
>>>
Messages In This Digest (1 Message)
1.
ChaMdassu - The Mathematical Texture From: Saradhi Motamarri
1. ChaMdassu - The Mathematical Texture
Posted by: "Saradhi Motamarri" msaradhi@yahoo.com msaradhi
Tue Oct 27, 2009 7:04 am (PDT)
Through many of complimenting postings on JKRMgaru, I learned a bit of his contributions to Telugu.
I am impressed with his works, whatever a little I read about.
I used to wonder how our kavis tell 'padyams' extempore, and it appealed to me that they do not have much options to do the 'ganavibhajana' before telling the 'padyams.' It is only to the lay man to divide the padyam in understanding what type of 'padyam' or 'meter' is it, based on the 'ChaMdassu.'
We learnt the hard way only the technicality of deciding a meter, for example, ChampakamAla' :
najabhajaraljarepal padanonditanuCha mpakambagu
This is an interesting padam, as it gives the technicality of meter, ChampakamAla. But hardly it tells anything else.
So, I used to think that 'kavis' typically won't resort to this type of ganavibhajana to tell a poem spontaneously, rather they have grasped something beyond our comprehension that they visualize 'pattern' (could be sound, 'nadaka') for each meter, that guides them to complete a padyam in the chosen meter.
It appeal to me that there could a Mathematical Basis or 'Pattern' for each of our 'meters'. Though I have not much discussed this with many, I mentioned to SriJonnavithulagaru on this last year. I am really impressed to read that JKRMgaru had linked 'Chamdassu' to Fibonacci Series.
In my later year, I have come across 'Fractals', and am sure if anyone had taken a look at some of the wonderful pictorial outcomes of simple fractal equations, would be amazed at the Mathematical properties of beauty. I also recall some wonderful words of Archimedes:
"...everything that surrounds, everything that exists proves that there are infinite laws behind it. It is mathematical in its precision."
This is an imprecise idea/post and hope one day a wise soul may unravel, and I may understand.
With best regards and thanks... Saradhi.
Saradhi Motamarri, PMP®
Email: msaradhi@yahoo. com H: (61)-2-88 194 357 M: (61) 430 022 130.
"The mark of leadership is the inability to differentiate the Art and Science."
>>>