నేను పద్యాలు చదవడం చూసి మా అమ్మాయి శ్రీవాణి (ఒకటో క్లాసు చదువుతోంది) తను కూడా చదువుతానంది. తన పద్యాలు కూడా ఇంటర్నెట్లో పెట్టమంది. తనకి వచ్చిన కొన్ని పద్యాలు చదివి వింపించింది. మీరూ వినండి. మీ పిల్లలకి కూడా వినిపించండి.
ఉప్పుకప్పురంబు...
అల్పుడెపుడు పలుకు...
అనగననగ రాగ...
మేడిపండు జూడ...
అక్కరకు రాని చుట్టము...
ఉపకారికి ఉపకారము...
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో...
బాగుంది.సార్థక నామధేయురాలు.
ReplyDeleteచాలా బాగా చెప్పింది పద్యాలు. ముఖ్యంగా "అక్కరకు రాని చుట్టము..." కందం చదివిన తీరు, "శ్రీవాణీ గిరిజా..." క్లిష్టమైన సంస్కృత సమాసాలను అలవోకగా విరిచి అందంగా పాడిన విధం, భేష్! ఎంతైనా మీ కుమార్తె కదా :) . మీ చిన్నారికి అభినందనలు తెలియజేయండి.
ReplyDeleteమీ అమ్మాయికి కంచుగంట అని బిరుదిస్తున్నాము ఈ సందర్భంగా. ఎంత స్పష్టంగా పలికిందో! చాలా చాలా సంతోషం.
ReplyDeleteఊ...
ReplyDeleteఅయి...
వావావా..
ఆ తర్వాత ఏదో నొక్కబడింది. విహరిణులు ఓ పాతిక సెషన్లు ఓపన్ కాబడ్డాయ్.....
మీ పిల్లలకు వినిపించమన్నారుగా. వినిపిస్తే అదీ మా 11 నెలల గుండమ్మ రియాక్షను. వినిపించడానికి ముందు చిన్న సైజు ఫయిటు జరిగింది లెండి.
నా రియాక్షను :
:-) మీరు చదివిన పద్యంకన్నాబావుంది. :-) వాణమ్మా ఓ వంద చప్పట్లు!
చింతచెట్టుకు వేపకాయలు పూస్తాయా :)
ReplyDeleteఅద్భుతం!!
బంగారుతల్లిలా చదివిందండీ మా మేనకోడలు, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగును :)
ReplyDeleteశ్రీవాణీ శ్లోకంలో చివరకి రాగం తీయడం అద్భుతం. చిన్నారికి ఆశీస్సులు.
ReplyDeleteమా పాపని అభినందించి ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు. పాప తరఫునుండి నమస్కృతులు.
ReplyDeleteరవిగారు, వినిపించమన్నాను కాని కంప్యూటరు అందుబాటులో ఉంచి మరీ వినిపించమన్నానా. మంచి రియేక్షనే ఇచ్చింది మీ పాప :-)
'ఈ బ్లాగును ఇంతకాలం చూడలేదేం?' అనిపించింది. పాప చక్కగా పాడింది. మీ బ్లాగూ బాగుంది! మొత్తం చదవలేదింకా.. ఖండ ఖండాలుగా చదువుతున్నాను నిన్నటినుండీ. అన్ని చోట్లా వ్యాఖ్యలు రాయాలనిపించినా, సూర్యుడికి దీపం అవసరం ఏముంటుందని రాయట్లేదు. మీ బ్లాగును చూస్తే మా చిన్నప్పటి తెలుగు అయ్యవార్లు- అశ్వత్థనారాయణగారు, రావి శ్రీమన్నారాయణగారు గుర్తుకొచ్చారు. జ్ఞాన వృద్ధులైన మీకు నమస్కారాలు చెప్పకుండా ఉండలేక ఈమాత్రం రాస్తున్నాను.
ReplyDeleteఎంత హాయిగా ఉందండీ మీ పాప గొంతులో శ్లోకాలు వింటుంటే. చక్కని స్వరం. సంగీత స్వరాలూ నేర్పిస్తే, ఒక గొప్ప గాయని కావోచ్చునేమో. పాపకి నా మనః పూర్వక శుభాశీస్సులు.
ReplyDeleteఒకేసారి 10 విండోస్ ఓపెన్ అయ్యి, అన్నీ పద్యాలు ఒకే సారి పలికి , నానా హడావిడి అయ్యాక, అన్ని ఆపి, ఒక్కోటి విన్నానండీ.పోస్ట్ తెరుచుకోగానే, ప్లే కాకుండా ఏమైనా ఫీచర్ ఉందేమో చూడగలరా ?
"పోస్ట్ తెరుచుకోగానే, ప్లే కాకుండా ఏమైనా ఫీచర్ ఉందేమో చూడగలరా ? "
ReplyDeleteభైరవభట్లగారు, ఒకసారి http://fileden.com ను ఉపయోగించి చూడండి. అక్కడ అప్లోడ్ చేసినవి సులభంగా ఎక్కడైనా ఎంబెడ్ చేయవచ్చు. ఉదాహరణకు క్రింది బ్లాగులోని పోస్టులను చూడండి.
http://indianraga.blogspot.com/
కామేశ్వర రావు గారూ, ఈ పోస్టు మొదటి సారి చూసినప్పటినుంచీ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నా, నాకసలు ఓపెనే కావడంలేదు. ఇంతవరకూ పాప పద్యాలు, శ్లోకాలు వినలేకపోయాను!
ReplyDeleteభైరవభట్ల గారికి
ReplyDeleteచాలా చక్కగా పాడిందండీ పద్యాలు. మీ అమ్మాయికి నా ముద్దులు, చప్పట్లు.
ఎంతైనా మీ అమ్మాయి ఇంగువ కట్టిన గుడ్డ కదా. ఈ గుభాళింపుకు నేను ఆశ్చర్యపోవటం లేదు. (నా దిష్టే తగలొచ్చని)
బొల్లోజు బాబా
నారాయణగారు, అనానిమస్ గారు, బాబాగారు,
ReplyDeleteధన్యవాదాలు.
అనానిమస్ గారు, మీకు అన్నీ ఒకసారి ఎందుకు ఓపెన్ అయ్యాయో తెలీడం లేదు. I have put auto start as false!
కాలనేమిగారు, నేను పైల్సు పెట్టింది filedenలోనే నండీ.
సుజాతగారు,
అయ్యో! మీరే బ్రౌసరు వాడుతున్నారు? నేను IE, Firefox latest versionsలో చూసాను. వినగలుగుతున్నాను. అయినా ఇప్పుడు నేరుగా లంకెలుకూడా ఇచ్చాను. ప్రతి పద్యం మీద క్లిక్ చేస్తే విడిగా Windows media player తెరుచుకొని పద్యం వినిపిస్తుంది. అలా ప్రయత్నించి చూడండి.
ఒకేసారి 10 విండోస్ ఓపెన్ అయ్యి, అన్నీ పద్యాలు ఒకే సారి పలికి , నానా హడావిడి అయ్యాక, అన్ని ఆపి, ఒక్కోటి విన్నానండీ.పోస్ట్ తెరుచుకోగానే, ప్లే కాకుండా ఏమైనా ఫీచర్ ఉందేమో చూడగలరా ? ;చాలా బాగా చదివింది. మీ పాపకి నా ముద్దులు మరియు తప్పట్లు.
ReplyDeleteoff post comment :
ReplyDeleteఇక్కడ కొందరు ప్రస్తావించిన సమస్యకి బ్లాగర్లు & వ్యాఖ్యాతలు ఫైరుఫాక్సు
బ్రౌజరుని - నోస్క్రిప్టు & ఏడ్ బ్లాక్ ప్లస్ ఎక్స్టెన్షనులతో ఉపయోగిస్తే చాలా
అనుకూలంగా ఉంటుంది . అనవసరమైన వాటిని తేలికగా నివారించవచ్చు
ముఖ్యంగా విశ్వదాభిరామ లోని 'భి'ని, గుఱ్ఱము లోని 'ఱ్ఱ'ను పలికినతీరు సెహబాసు. :-)
ReplyDeleteచక్కగా పడింది. శ్రీవాణికి నా ఆశీస్సులు!
ReplyDeleteశ్రీ కామేశ్వర రావు గారూ,
ReplyDeleteమీ అమ్మాయి పేరు తెలిసిన తరువాత లింక్ క్లిక్ చేశాను. అయితే పద్యాలు వినటానికి అవటం లేదు. ఫైల్ డెన్ను ఇఫ్ఫీ గావుంది. Windows Media player లో ప్లే అయ్యేట్లుగా లింక్ ఇవ్వగలరు. నేను మీ ఇంటికి వచ్చినపుడు direct గానే వింటానుగానీ, ఇప్పుడే వినాలని ఉత్సాహం గావుంది.
మీ,
చంద్రశేఖర్