మాగంటి వంశీగారు మొదలుపెట్టిన ఆడియో పుస్తకాల ప్రయత్నంతో నాలో నాటుకున్న ఆలోచన, మొన్న కొత్తపాళీ, రవిగార్ల ప్రయత్నాలు చూసి మొలకెత్తి, భాస్కర రామిరెడ్డిగారు మొన్నటి టపాలో పెట్టిన కామెంటుతో చిగురించి, ఇదిగో ఇప్పుడిలా ఫలించింది.
నాకు సంగీతం రాదు, నేను రాగయుక్తంగా పద్యాలని పాడలేను. కాబట్టి అవి "వినసొంపు"గా అయితే ఉండవు. అసలందుకే వీటిని వినిపించడం ఎందుకని ఊరుకున్నాను. కాని భాస్కర్ గారు అన్నట్టు కనీసం పదాల సమాసాల ఉచ్చారణ, ఆసక్తి ఉన్నవాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందని ఇప్పుడిలా సాహసం చేస్తున్నాను. ధైర్యం ఉన్నవాళ్ళు వినవచ్చు :-)
ప్రస్తుతం మనం విరాటపర్వంలో ఉన్నాం కదా. ద్రౌపది తనకు కీచకునివల్ల కలిగిన అవమానాన్ని భీముడికి వివరించి, తన బాధని అతనికి చెప్పుకుంటున్న సన్నివేశం. ఎలాంటి పాండవులు ఎలా అయిపోయారు అని దుఃఖపడుతోంది ద్రౌపది. ధర్మరాజు గొప్పతనం గంభీరంగా వర్ణించింది. అలాంటి అతను ఇప్పుడిలా పరుల పంచన చేరాడే అని వాపోయింది. భీముని బలపరాక్రమాలు సొగసుగా వర్ణించింది. అలాంటివాడు గరిటపట్టుకున్నాడే అని బాధపడింది. ఇప్పుడు అర్జునుడి వంతు.
waiting for video అంటున్నదండి... లంకె లేదు. ఒక్కసారి సరి చూస్తారా?
ReplyDeletemaa akkaya gariki compititiona eeeyyy
ReplyDeletebagundandi post
ధన్యవాదములు
ReplyDeleteరెండో దానిలో, వాక్రుచ్చిన పద్యానికి, రాతకెక్కిన పదానికి మొదటి పంక్తిలో తేడా ఉన్నది. అదన్నా సరిచెయ్యండి. ఇదన్నా సరిచెయ్యండి. క్లూ కావాలంటే, మళ్ళీ చూడటానికి వచ్చినప్పుడు సరికాకపోతే చూసి చెప్తా.
ReplyDeleteకామేశ్వరరావు గారూ ముందుగా నా మనవి ఆలకించినందుకు ధన్యవాదాలు.... మాలాంటి సోమరిపోతులకు చాలా పెద్దపని తప్పించారు.. ఇప్పుడు ఆఫీసులో కూడా ఎవరికీ తెలియకుండా పద్యాలు వినవచ్చు. సందర్భోచితంగా బాగానే పాడారండి.మరి తరువాత టపా ఎప్పుడు?
ReplyDelete@Namelessగారు, సరిగానే పనిచేస్తోందండీ. IE, Firefox రెండిటిలోనూ చూసాను. Firefoxలో అయితే Windows media player plug-inని install చేసుకోవాలి. ఇక్కడ కామెంట్లు చూస్తే కొందరికి వినిపించినట్టే ఉంది.
ReplyDelete@Anonymous-1గారు, మీ మొదటి వాక్యం బోధపడలేదు. రెండో వాక్యానికి ధన్యవాదాలు.
@కొత్తపాళీగారు, సురేష్ గారు, నెనరులు.
@Anonymous-2గారు, తప్పు సవరించానండీ. చూపించినందుకు ధన్యవాదాలు.
@భాస్కర్ గారు, నెనరులు. ఎందుకైనా మంచిదని మొదటి రెండు పద్యాలు మామూలుగా చదివాను. మూడో పద్యం చిన్న కూనిరాగం పెట్టాను (తేడా తెలీకపోవచ్చు! :-).
విన్న అందరికీ చిన్న మనవి. కూనిరాగంతో బాగుందా, లేకుండా బాగుందా, అసలు బాగుందా లేదా నిస్సంకోచంగా తెలియజెయ్యండి.
నాకు గాత్ర దానం చెయ్యడానికి ఎవరైనా సమర్థులు ముందుకొస్తే మరీ సంతోషం!
చాలా బాగుందండీ! మీ వివరణ చదివాక పద్యం మరోసారి చదివితే, ఇందులో ఇంత కావ్య ప్రతిభ దాగి ఉందా అనిపించింది. గైడ్ సహాయంతో హళెబీడు శిల్పాలను చూసినప్పుడు కలిగే అనుభూతి!
ReplyDeleteమొదటి రెండు పద్యాలు వచనంలా చెప్పేశారు. అంత బాగాలేదు. మూడో పద్యం పాడిన విధానం అదుర్స్ !! వీలైతే మొదటి పద్యాన్ని మళ్ళీ పాడండి, రాగయుక్తంగా.
మాములుగా చదివిన మొదటి రెండు పద్యాల కంటే, చివరి పద్యమే భావ యుక్తంగా ధ్వనించింది. మీకు వేరొకరి గాత్ర దానం అవసరం లేదు.
ReplyDeleteఈ నాటి సినిమా వీరో,వీరోఇన్ల లాగా గాత్రదానాలు ఎందుకండి.. రంగస్థల నటులుగా స్థిరపడిపోండి. కూనిరాగ పద్యమే బాగుందండి.గాత్రం స్థిరంగా ( హెచ్చు తగ్గులు/ వణుకుడు లాంటివిలేకుండా ) ఉంది.
ReplyDeleteకడప రేడియోలో నాగసిద్ధారెడ్డి మొదలైనవాళ్లు మహాభారతం గొప్పగా చదివేవాళ్లు. మీ గొంతు, వ్యాఖ్యానం ఇంచుమించు అట్లే వుంది మాస్టారూ.
ReplyDeleteపాడిన మూడవ పద్యం చాలా చక్కగా ఉందండీ. మొదటి రెండు పద్యాలని కూడా పాడడానికే ప్రయత్నించలేకపోయారా? :)
ReplyDelete