తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, January 4, 2009

బెంగుళూరులో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి అష్టావధానం


వచ్చే శనివారం (అంటే పదో తారీఖు) బెంగుళూరులో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి అష్టావధానం జరగబోతోంది. ఇది తెలుగు సాంస్కృతిక సంస్థ - భారతీయ విజ్ఞాన సంస్థ(IISc) ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనికి అందరూ ఆహ్వానితులే.
గరికిపాటివారి ధార, ధారణ, వాక్చాతుర్యం అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఆసక్తి, వీలు ఉన్నవాళ్ళందరూ వచ్చి ఆనందించవచ్చు.
ఇందులో నేను కూడా ఒక పృఛ్చకునిగా పాల్గొంటున్నాను. నా అంశం ఛందస్సంభాషణం. అంటే ఆవధానిగారితో పద్యాలలో సంభాషించడమన్న మాట. కొంచెం సాహసమే!
ఈ సందర్భంగా బెంగుళూరులో ఉన్న బ్లాగ్మిత్రులని కలుసుకొనే అవకాశం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను.
ఇది సాయంకాలం నాలుగున్నరకి మొదలవుతుంది. వివరాలకి ఇక్కడున్న ఆహ్వానపత్రిక చూడండి.

23 comments:

  1. అవధానానంతరం బ్లాగ్మిత్రుల కొరకు ఆ కార్యక్రమాన్ని మీ బ్లాగులో ఉంచగలరని ఆశపడుతున్నాను.

    ReplyDelete
  2. మేస్టారు కామేశ్వరరావుగారూ, చిన్న విన్నపం. వీలుంటే మొత్తం కార్యక్రమం ఆడియో రికార్డు చేయండి. ప్లీజ్ :)

    ReplyDelete
  3. అభినందనలు మరియూ శుభాకాంక్షలు

    ReplyDelete
  4. మంచి శుభవార్త చెప్పేరు. అదే రోజు IISC వైపు పనుంది కూడాను. తప్పక కలుద్దాం అయితే. మారత హళ్ళీవైపునుంచీ ఎవర్నైనా తోలుకుపోవాలంటే నాకో మైలు కొట్టండి.
    --నాగరాజు

    ReplyDelete
  5. మిమ్మల్ని కలవాలని ఆసక్తి ఉంది కానీ కుదరదు.... సంక్రాంతికి పల్లెకు వెళ్ళాలి... అంతకుముందు ఆఫీసులో అన్నీ సరి చూసుకోవాలి :(

    మీరు గానీ అ-భాగ్యనగరికి ఎప్పుడన్న వస్తే చెప్పండి.. It would really be a honor to meet you.

    ReplyDelete
  6. 11 వ తేదీ మా పాప నామకరణోత్సవం. అంచేత ఊరికెళ్ళి తీరాలి. bad luck అండీ :-(. Anyway, అభినందనలు.

    ReplyDelete
  7. నరసింహగారు, రాఘవగారు,
    తప్పకుండా మీరు చెప్పిన వాటిని ప్రయత్నిస్తాను.
    కొత్తపాళిగారు, నెనరులు.
    నాగరాజుగారు, తప్పకుండా కలుసుకుందామండి.
    యోగిగారు, హైదరాబాదొచ్చే వీలే ఉంటే మొన్న పుస్తకప్రదర్శనకే వచ్చే వాణ్ణి కదా :-) ఏదైనా పనిపడి వస్తే తప్పకుండా చెప్తాను, కలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
    రవిగారు, అయ్యో. మిమ్మల్ని తప్పక కలుసుకోవచ్చనుకున్నాను! మీ పాప నామకరణోత్సవానికి నా శుభాకాంక్షలు. అదయ్యాక మీ పాప పేరు ఏమిటి పెట్టారో చెప్పండి. నేనూహిస్తున్న పేరో కాదో చూస్తాను :-)

    ReplyDelete
  8. అరెరె, బెంగళూరులో లేకపోతిమే!

    ReplyDelete
  9. అభినందలు! ఇంకా మీ పృచ్ఛకత్వం బాగా జరగాలని శుభాకాంక్షలు! మీరు ఆదివారం కూడా బెంగుళూరులో ఉంటారా?

    ReplyDelete
  10. అభినందనలు మరియూ శుభాకాంక్షలు.

    మీరు కొంచం ముందు చెప్పిఉంటే చదువరి గారిని ఎదోవిధంగా ఒప్పించి రెండు టిక్కెట్లు కొనిపించేవాడిని. ( ఆయన గరికపాటి వారికి పెద్ద పంఖా మరి)
    కన్నడ శతావధాని శ్రీ గనేశ్ గారు కూడా సభ లో ఉంటారా?
    మీకు అవధానులను ఇరుకున పెట్టటం అలవాటేగా, కానివ్వండి,
    మళ్లీ మాకు కాస్త వినోదం. కాస్త విఙ్ఞానం

    ReplyDelete
  11. అబ్బో, పద్యాల్లో మాట్టాడతారా!! తప్పక వినాల్సిందే, రికార్డు చెయ్యాల్సిందే మీరు.
    "కొంచెం సాహసమే!" - అవునుమరి, గురజాడకు, శ్రీశ్రీకే బుద్ధులు నేర్పించేవారితోటి జాగ్రత్తగానే ఉండాలి.

    ఊదంగారూ, పంఖా గరికిపాటికీ గాలి మీకా! :)

    ReplyDelete
  12. కామేశ్వరరావు మేస్టారూ, ఎందుకో ఇది చెప్పాలనిపించింది...

    భైరవభట్లకీ గరికపాటికిఁ బద్యపు భాషణా? భలే!
    గౌరవమండి బ్లాగరుల కందరికిన్ మరి సంబరంబు గా
    దా? రసమొప్పగం దమరు ధారణబ్రహ్మకిఁ బ్లాగు గూర్చి ఓ
    మారు కవిత్వ నేవమునఁ మైవడిఁ వీలును చూసి చెప్పరూ?

    శుభం భూయాత్

    ReplyDelete
  13. చంద్రమోహన్ గారు,
    ఆదివారం కూడా ఉంటాను కానీ ఆ రోజంతా బహుశా జంతువుల మధ్యే తిరుగుతానండీ :-) మీరు బెంగుళూరులోనే ఉంటున్నట్టయితే అవధానానికి వచ్చే ప్రయత్నం చెయ్యండి.
    ఊదం గారు,
    అయ్యో! ఆహ్వాన పత్రిక అందగానే బ్లాగులో రాసానండి. పోనీ భాగ్యనగరంలో మరో అవధానంలో పాల్గొనే భాగ్యం కలుగుతుందేమో చూద్దాం :-) అవును గణేశ్ గారు నిషిద్ధాక్షరి చేస్తారు.
    గరికిపాటివారి నిరుకున పెట్టేంత
    పాటివాడినా? అభాసుపాలు
    కాక భాషణంబు గావించగల్గిన
    అదియె మేలు నాకు పదియువేలు!

    చదువరిగారు, రికార్డు చెయ్యగలిగే వీలుంటే తప్పక చేసి అందరితో పంచుకుంటానండీ.

    రాఘవగారు,
    నెనరులు రాఘవా! తమరి నెయ్యపు పద్య సుహృద్య వ్యాఖ్యకున్
    మనసుననున్న నా తలపు మాటల చెప్పిరి మీరు, తప్పకన్
    మన ఘన బ్లాగులోకపు సమంచిత తెల్గు మమత్వభావ మా
    తనికిని తెల్పు యత్నమును తప్పక చేసెదనండి ఆ సభన్

    ReplyDelete
  14. ఇంతమంది బ్లాగ్మిత్రులకి దొరకని అవకాశం నాకు దొరికిందండీ. కామేశ్వరరావుగారు, చ్చందస్సంభాషణ అందంగా చేశారు, అభినందనలు. మీ పరిచయం ఆనందదాయకం.

    ReplyDelete
  15. I respect you and your knowledge. Why are you wasting your time on writing comments on deeptidhaara. It is an useless criticism on Viswanatha which cbrao is carrying on his shoulders.

    ReplyDelete
  16. పార్వతిగారు,
    నెనరులు. త్వరలో అవధానం వివరాలు అందరితో పంచుకుంటాను.

    అనానిమస్ గారు,
    నేనా చర్చ పూర్తిగా నిరుపయోగం అనుకోటం లేదండి. విమర్శ అంటూ వచ్చినప్పుడు, అదెంత అర్థంలేనిదయినా, దాన్ని తప్పని నిరూపించాల్సిన అవసరం ఉంది కదా.

    ReplyDelete
  17. భరవభట్ల గారూ, నేను పుస్తకం.నెట్ సైటులో మీకోసం ఒక వ్యాఖ్య వదిలాను. e-మెయిలు నోటిఫికేషను లేనందువల్ల మీరు చదవలేదేమో అని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా... ఒకవేళ మీరు ఇంతకుముందే చూసి ఉంటే ignore చెయ్యండి :)

    "కామేశ్వర రావు గారు

    మీరు ఇచ్చిన లంకె లోని స్క్రిప్టును లేఖిని సహాయంతో తెలుగు అక్షరాలలోకి మార్చడం చాలా సులభం. మీరు ఇలా పద్యాలు, పుస్తక రివ్యూలు మొదలగునవి రాసిన లంకెలన్నీ నాకు ఇవ్వగలిగితే వాటన్నింటినీ తెలుగు అక్షరాల్లోకి మార్చి ఒక చోట అందరూ సులభం గా చదివే లాగా ఉంచాలని ఉన్నది. అదీ మీకు అభ్యంతరం లేకపోతే. my mail id jnanakhadga at gmail

    నాకెందుకీ ఆసక్తి అంటారా.. అదో ఆనందం అనుకోండి
    యోగి"

    http://pustakam.net/?p=91

    ReplyDelete
  18. I posted the earlier message from a mobile device, sorry about typos :(

    ReplyDelete
  19. ఈ టపాను నేనిప్పుడు చూస్తున్నాను. ఛందస్సంభాషణం ఎలా జరిగిందో వినాలనుంది మాస్టారూ. నాకాభాగ్యముందా?

    ReplyDelete
  20. యోగి గారూ,
    ధన్యవాదములు.కామేశ్వరరావుగారి ఇంగ్లీషు లిపిలోని వాటిని తెలుగులో ఎలా చదువుకోవచ్చో తెలిపినారు. మీరు చెప్పినట్లుగా లేఖినిని ఉపయోగించి చూస్తే — వావ్! — అద్భుతం.పూర్తిగా తెలుగులో వారి పాత పోస్టులను చదవగలుగుతున్నాను.ఈ సందర్భంగా లేఖిని సృష్టికర్త అయిన వీవెన్ గారి కేమిచ్చి మనం వారి రుణం తీర్చుకోగలం? కామేశ్వరరావుగారూ, మీరు యోగిగారడిగిన అనుమతిని వెంటనే దయచేయండి.అది అందరికీ ఉపకారమౌతుంది.

    ReplyDelete
  21. యోగిగారు, నరసింహగారు,
    మీ అభిమానానికీ ఆసక్తికీ నెనరులు. నేను మరీ ఎక్కువగా ఏమీ రాయలేదండి. పద్యాలకి సంబంధించినవన్నీ, ఉపయోగకరమైనవి ఏరి, ఈ బ్లాగులో పెట్టాలనే ఆలోచన ఉంది. అయితే వాటిని నేనుకూడా ముందు వెతికి ఒక చోట సమీకరించాలి!
    అసలు అంతర్జాలంలో పద్యాలకి సంబంధించిన లంకెలన్నీ సేకరించి ఈ బ్లాగులో పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. కొంచెం బద్ధకం వదిలించుకొని, సమయం చిక్కించుకొని ఆ పని చెయ్యాలి.
    యోగిగారు,
    మీరేవైన సేకరించి ఎక్కడైనా పెడతానంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు.

    ReplyDelete
  22. పద్యాల గురించిన బ్లాగులనన్నీ ఓ చోట కూర్చిపెడితే బాగుంటుందన్న మీ ఆలోచన లోంచి తాళ్ళపాక కవుల సాహిత్యానికి సంబంధించిన బ్లాగులనన్నిటినీ కూడా ఓ చోట కూర్చిపెడితే కూడా బాగుంటుందన్న ఆలోచన కలిగింది.ఈ విషయమై dvsn sravan గారు కొంత కృషి చేసారనుకుంటాను.నేను సైతం-- అని అనిపిస్తుంది.

    ReplyDelete
  23. ఉత్పలమాల:-
    భైరవభట్ల వంశజుడ! భక్తిగ మీకు నమస్కరింతు. మీ
    ధారణ , పద్య భాషణము, తప్పక యొప్పిదమౌనటంచు, తా
    కోరి యనుంగు పృచ్ఛకుగ గుర్తుగ పిల్చె రహిపనెంచి. నే
    నేరకపోతి మీ ఘనత నిత్యుడ! మీకు శుభాభినందనల్.

    ReplyDelete