తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, October 22, 2014

తెలుగు యతి - తిరుగు మతి!

"మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"

నాకింకా పళ్ళు ఊడలేదు కానీ ఉన్నవాటిని ఊడగొట్టుకొనేందుకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ బ్లాగులో పోస్టు పెడదామనే దురాలోచన వచ్చింది. :-)  దీనికి స్ఫూర్తినిచ్చిన పంతుల గోపాలకృష్ణగారికి ముందుగా కృతజ్ఞతలు. వారు ఛందస్సు ఫేసుబుక్కు గ్రూపులో యతి గురించి పెట్టిన చర్చ దీనికి కారణం. కొన్ని కారణాలుగా FBని read-only మాత్రమే చేసాను కాబట్టి, దీని గురించి అక్కడ కాకుండా యిక్కడ నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను. దీనికి వారికి అభ్యంతరం ఉండదని ఆశిస్తున్నాను. గోపాలకృష్ణగారు సంస్కృత తెలుగు యతుల మధ్య చెప్పిన భేదాలతో నాకు భేదాభిప్రాయమేదీ లేదు కాబట్టి, దాన్ని ఇక్కడ తిరిగి ఉట్టంకించడం లేదు. వారు లేవదీసిన ముఖ్యాంశం గురించి వారు చెప్పిన విషయాలు మాత్రం యథాతథంగా యిక్కడ పెడుతున్నాను, ఈ బ్లాగు చదివేవాళ్ళకు వీలుగా:

===
పాద ప్రథమాక్షరమే ఏ మార్పు లేకుండా తిరిగి యతి స్థానంలో ప్రయోగింపబడడమే తెలుగులో యతి చెల్లించడమంటే. ఇది ప్రాచీనమైన పద్ధతి. ఆ విధంగా సంస్కృతంలో యతి స్థానంలో విశ్రాంతి తీసుకుంటుండగా తెలుగులో అదే అక్షరాన్నితిరిగి ప్రయోగించడం ద్వారా ఒక కొత్త అందాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామన్న మాట. ఈ ప్రయోజనం అక్కడ పద విఛ్ఛేదనం జరిగి కొత్త పదం అదే అక్షరంతో తిరిగి ప్రారంభమయితేనే ఒనగూరుతుంది. అయితే సంస్కృతంలో లాగా పద విఛ్ఛేదనం జరగడం దానితో పాటు సరూపాక్షర యతిచెల్లించడం రెండూ కావాలంటే అవి పద్య రచనకు గుదిబండలవుతాయనే ఉద్దేశంతో మన వారు సరూపాక్షర యతితో సరిపెట్టుకుని పద విఛ్ఛేదనమనే నియమానికి మంగళం పాడేరు. ఇంతటితో ఆగలేదు.పాదాద్యక్షరాన్నే తిరిగి యతిస్థానంలో అలాగే ప్రయోగించాలంటే కష్టమని భావించి ఆ అక్షరంతో మైత్రిగల ( అంటే ఉచ్చారణలో సారూప్యం గల) అక్షరాన్ని వేసుకున్నా సరిపోతుందని సరిపెట్టుకున్నారు. నిజానికి ఇది సరిపెట్టుకోవడమే గాని అదే అక్షరాన్ని యతిగా చెల్లించడం లోని అందాన్ని తీసుకు రాదు. అలాగే పదమధ్యంలో ఉన్న అక్షరంతో యతి చెల్లించడం వలన ఒక నియమాన్ని పాటించడం జరుగుతోందే తప్ప పద్యానికి ఏ విదమైన శోభనీ చేకూర్చడం లేదు. ఇది మన మహా కవులకు తెలియదని కాదు. కాని పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలల్లుతున్నప్పుడు యతి స్థానంలో పద విఛ్ఛేదనం జరగాలంటే కుదరదు. సంస్కృత సమాసాల్ని యథా తథంగా దించేసుకుంటూ పద్యాలు వ్రాసుకున్న మన వారికి అసలు కుదరదు. అందుకే పద మధ్యం లోని అక్షరంతో సరూపాక్షర యతి మొక్కుబడిగా చెల్లిస్తూ వచ్చారు. సరూపాక్షర యతి ఉండడం మంచిదే. కాని దాని ప్రయోజనం యతిస్థానంలో పద విఛ్ఛేదనం కూడా జరిగితేనే ఒనగూరుతుంది . నియమాలూ కట్టబాట్లూ సంఘానికి మేలు చేసేవిగా ఉండాలి. అలానే ఛందో నియమాలు పద్యానికి అందం చేకూర్చేవిగా ఉండాలి. నిష్ప్రయోజనంగా ఉండ కూడదు. ఒక జాతి స్త్రీలు అందమైన మెడ కోసం జీవితంలో చాలా భాగం మెడ చుట్టూ బరువైన రింగులు దిగేసుకుని సంచరిస్తారు. పెరుగుతున్నకొద్దీ మరికొన్ని రింగులు చేరుస్తూ ఉంటారు. వారు సాధించుకునే అందమేమిటో గాని ఆ స్త్రీల జీవితాలకవి నిశ్చయంగా గుదిబండలే. తరతరాలుగా వచ్చినంత మాత్రాన అన్నీ మంచివే కాదు. వాటి ప్రయోజనాన్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చర్చలో మన మహాకవులు ఛందో నియమాల్ని అవలీలగా పాటించారనీ ఇప్పుడు అది చేతగాక యతి నియమం వద్దంటున్నాననీ ఏదేదో వ్రాసేరు. నేను యతి నియమం వద్దన లేదు. యతి ప్రయోజనం ఒనగూరాలంటే పద మధ్యంలో కాకుండా పదారంభంలో యతి చెల్లిస్తే అక్కడ పద విచ్ఛేదం జరిగి పద్యానికి ఒక కొత్త అందం వస్తుందన్నదే నా అబిప్రాయం. పెద్ద పెద్ద వృత్తాలలో పద మధ్యంలో మొక్కుబడి గా యతి చెల్లించిన పద్యాలూ, పద విఛ్చేదనంతో పాటు యతి చెల్లించిన వేమన పద్యాలూ కంద పద్యాలూ గమనిస్తే ఈ సంగతి స్పష్టంగా బోధ పడుతుంది. ఎంతటి మహా కవులకైనా ఈ నియమాలు ఎలా ఇబ్బంది పెడతాయో చూపిస్తాను చూడండి.
సిరి గల వానికి చెల్లును
తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
శ్రీనాధ మహా కవిది- ఎంత చక్కటి పద్యం. అయినా చూడండి-సిరిగల వానికి పదహారువేలమందిని
పెండ్లాడడం చెల్లుతుంది, చెల్లును- అంటే తగును అనే కదా అర్థం? మరి మళ్ళా తగ పెండ్లాడన్ ఏమిటి? ఇది యతి చెల్లించడానికి పడ్డ తిప్పలు. ఇలా బయటకు స్పష్టంగా కనిపించక పోయినా, పద్యాల్లో యతి చెల్లించడానికి ముందో వెనకో అక్కర్లేని పదాలో విశేషణాలో వేయడమో లేక పోతే చక్కగా భావయుక్తంగా ఉండే పదాల్ని వదులుకుని ఏదోఒక పదం వేసి సరిపెట్టుకోవడమో జరుగుతూనే ఉంటుంది. పద్యం హృద్యంగా ఉండాలంటే యతి చెల్లించడంతో పాటు అక్కడ పద విఛ్ఛేదనం కూడా జరిగితేనే అందమన్నది నా అభిప్రాయం.అలాజరగనప్పుడు అది మొక్కుబడి
చెల్లింపే. లేదు దాని వన ఫలానా ప్రయోజనం ఒనగూరుతున్నాదని ఎవరైనా చూపిస్తే చాలా సంతోషం. చర్చ పదమధ్యంలో అక్షరంతో యతి చెల్లించడం- దాని ప్రయోజనం-గురించి మాత్రమే జరపాలని నా విన్నపం.
============

ఇది గోపాలకృష్ణగారు లేవదీసిన చర్చ. వారితో నేను ఏకీభవించే విషయాలను ముందుగా ప్రస్తావించి, ఆ తర్వాత విభేదించే అంశాలూ, వాటిపై నా ఆలోచనలూ పంచుకుంటాను. నేను ఏకీభవించే అంశాలు:

1. పదవిచ్ఛేదన జరిగే విశ్రాంత యతి పద్యానికి ఒక స్పష్టమైన లయని చేకూరుస్తుంది. తెలుగులో యతి (విరామాన్ని పాటించవలసిన అవసరం లేనందువల్ల) అలాంటి ప్రయోజనాన్ని యివ్వదు.
2. పద విరామంతో కూడిన అక్షరసామ్య యతి, ఆ అక్షరసామ్యాన్ని మరింత ప్రస్ఫుటం చేసి అక్షరసామ్యంలో గల శ్రావ్యతను చక్కగా ఆవిష్కరిస్తుంది. అలా లేనప్పుడు ఆ అక్షరసామ్యం అంతగా చెవులకి యింపు కలిగించదు.

యతికి యీ రెండు ప్రయోజనాలూ తప్ప మరేమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి అన్నది గోపాలకృష్ణగారి ప్రశ్న. దాన్ని గురించి వివరించే ముందు, ఆ ప్రశ్నలో భాగంగా వారు ప్రస్తావించిన మరికొన్ని అంశాలు, నాకు ఇబ్బందికరంగా తోచిన వాటిని ముందుగా చర్చిస్తాను.

"అయితే సంస్కృతంలో లాగా పద విఛ్ఛేదనం జరగడం దానితో పాటు సరూపాక్షర యతిచెల్లించడం రెండూ కావాలంటే అవి పద్య రచనకు గుదిబండలవుతాయనే ఉద్దేశంతో మన వారు సరూపాక్షర యతితో సరిపెట్టుకుని పద విఛ్ఛేదనమనే నియమానికి మంగళం పాడేరు. "

ఇక్కడ పదవిచ్ఛేదన నియమానికి "మంగళం పాడడం" అనే విషయం గురించి వారు ఒక ఊహ చేసారు. అది వారి ఊహ మాత్రమే. కాని అది "ఊహ" అని ధ్వనించకుండా, కచ్చితమైన విషయంగా వారు ప్రస్తావించడం నాకు అభ్యంతరకరంగా అనిపించింది. పద విచ్ఛేదన యతికి మన పూర్వకవులు ఎందుకు "మంగళం పాడేరో" మనకిప్పుడు కచ్చితంగా తెలిసే అవకాశం లేదు. దాని గురించి ఎవరు ఏమనినా అది కేవలం ఊహ మాత్రమే అవ్వగలదు. దీని గురించి నా ఊహలు ఇలా ఉన్నాయి. పదవిచ్ఛేదన పద్యపాదానికి ప్రస్ఫుటమైన లయని చేకూర్చడం ప్రధానంగా రెండు సందర్భాలలో మాత్రమే జరుగుతుంది - ఒకటి, పద్యపాదం మరీ పెద్దది కాకపోవడం. దీనికి మంచి ఉదాహరణ కందం రెండవ పాదం. "ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ!" కందం కదను తొక్కే గుఱ్ఱంలా పరిగుపెట్టడానికి దాని చతుర్మాత్రా గణాలూ, జగణంతో పాటు, యతిస్థానంలో విరామం చక్కని లయని చేకూరుస్తుంది. అలాగే తేటగీతి పాదం కూడా.
"ఇనకరంబులలో వెల్గు ఎందుకొరకు?
ఇందుకిరణంబులను చల్వ ఎందుకొరకు?
ఋక్షసంతతిలో మిన్కు లెందు కొరకు?
ప్రేమ కొరకు ప్రేమ కొరకు ప్రేమ కొరకు"

తేటగీతికి ఆటవెలది వంటి విలక్షణమైన లయ లేదు. కాని యతి స్థానంలో విరామం ఒక లయని కలిగిస్తుంది.
ఇక విరామయతి పద్యానికి చక్కని లయని చేకూర్చే మరొక సందర్భం - పద్య ఛందస్సులోనే ఒక విలక్షణమైన లయ ఉండడం. ఆటవెలది, మత్తకోకిలా, తరలం, భుజంగప్రయాతం - ఇలాంటి ఛందస్సులన్నీ వీటికి ఉదాహరణలు. మాత్రాఛందస్సులు కూడా లయప్రధానమైనవే కాబట్టి వాటిలో కూడా విరామయతి ఆ లయ చెడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. అయితే ఇక్కడ గమనించ వలసిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఆయా పద్యాలలో యతిస్థానంలోనే కాక, వాటి సహజలయని అనుసరించి పదాలు విరిగితేనే వాటిలో ఆ లయసౌందర్యం కనిపిస్తుంది.

ఈ రెండూ కాని చోట్ల విరామయతికి ప్రయోజనం ఏమిటి? ఉదాహరణకు శిఖరిణి వంటి వృత్తంలో స్పష్టమైన లయ కనిపించదు. "స్పష్టమైన లయ" అంటే ఒకే పాదంలో ఒకే రకమైన గురులఘుక్రమం లేదా మాత్రల ఆవృత్తి. ఉదాహరణకి ఆటవెలదిలో మూడు మాత్రలు మూడుమార్లు వరసగా వస్తాయి. మత్తకోకిలలో మూడు, నాలుగు మాత్రల గణాలు తిరిగి తిరిగి వస్తాయి. ఇలాంటి ఆవృత్తి "స్పష్టమైన లయ"ని ఇస్తుంది. శిఖరిణి వంటి వృత్తాలలో అది లేదు. అలాగే మాలా విక్రీడిత వృత్తాలు కూడా. ఒకే మాత్రలు/గురులఘుక్రమం కలిగిన (కనీసం మూడక్షరాల)గణాలు రెంటికి మించి వరసగా వాటిల్లో రావు. కాబట్టి వాటికి పైన ఉదాహరించిన యితర వృత్తాలలో మాదిరి స్పష్టమైన లయ లేదు. కాబట్టి యీ పద్యాలలో పాదవిరామం ప్రత్యేకంగా ఒక చక్కని లయని సాధిస్తుందని అనడం సరికాదు.
పద్యానికి లయని చేకూర్చడంతో పాటు, విరామయతికి  ఉన్న మరొక ప్రయోజనం, పద్యానికి పఠనసౌలభాన్ని కల్పించడం. అంటే చదివే వాళ్ళకి కాస్త విరామం, విశ్రాంతి కలిగించడం.
"దాసీభూతసమస్తదేవ వనితాం!" అని ఒక పెద్ద సమాసం చదివేవారు, ఒక్కసారి ఊపిరిపీల్చుకొని "లోకైకదీపాంకురాం" అని చదివే వెసలుబాటు అక్కడ విరామయతి కలిగిస్తోంది. ఇది స్తోత్రాలు చదివే వారికి చాలా అవసరం.

బాగుంది. ఇప్పుడు మరి తెలుగు పద్యాలకి యీ మూడు ప్రయోజనాలూ అవసరం లేకుండా పోయాయా? పోయాయి అన్నదే నా ఊహ. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి. తెలుగు కవులు, నన్నయ్యాగారితో మొదలుపెట్టి - చెప్పే విషయానికీ, పద్యపు నడకకూ ఒక సంబంధాన్ని కలిగించే ప్రయత్నం చేసారు - అన్ని చోట్లా కాకపోయినా, కొన్ని విశేష సందర్భాలలో. అంటే, పద్యపు నడకను, ఆ పద్యంలోని భావాన్ని ఉద్దీపింప జేసేందుకు ఉపయోగించడం అన్నమాట. మనకి ఎక్కువ చంపూ కావ్యాలు రావడం వెనకకూడా బహుశా ఇదే కారణం అని నేననుకుంటున్నాను. ఇది నాకు తెలిసి సంస్కృత కవిత్వంలో పెద్దగా కనిపించదు. రామాయణ మహాభారతాలు చాలావరకూ అనుష్టుప్ ఛందస్సులోనే సాగుతాయి. తర్వాత కావ్యాలు కూడా ఒకో సర్గా మొత్తం ఒకే వృత్తంలో సాగేవే ఎక్కువగా కనిపిస్తాయి. క్షేమేంద్రుడు వృత్తౌచిత్యాన్ని గురించి ఫలానా ఛందస్సు ఫాలానా భావాన్ని వ్యక్తపరచడానికి ఎక్కువగా ఉచితమని చెప్పాడు. అయితే అతను దానికి కారణం అందులో ఉండే గురు లఘు సంఖ్య ఆధారంగా చేసినదే కాని, పద్యపు నడకని నాకు తెలిసి ప్రస్తావించ లేదు. తెలుగు ఆలంకారికులు కూడా ఎక్కువగా సంస్కృతాలంకారశాస్త్రాన్నే అనుసరించారు కాబట్టి, వారు కూడా దీని గురించి విశ్లేషించినట్టు నాకు తెలియదు. దీని గురించి ఆధునికకాలంలో కొంతమంది కొన్ని విశ్లేషణలు చేసారు. వాటన్నిటినీ పూర్తిగా నేను ఒప్పుకోకపోయినా, పద్యపు నడకని (నడక అంటే ఒక ప్రత్యేకమైన "లయ" కాదు, పద్యం సాగే తీరు మాత్రమే) తెలుగు కవులు ప్రత్యేకంగా వాడుకొన్నారని నేను బలంగా నమ్ముతాను. దీని గురించి ఇంతకు ముందు కొన్నిచోట్ల (ఈ బ్లాగులోనూ, ఇతరత్రా వ్యాసాలలో) నేను ప్రస్తావించి కొన్ని ఉదాహరణలు ఇచ్చిన గుర్తు.
పై కారణాలవల్ల లయప్రాధాన్యం కాక, పద్యపు నడకలో స్వేచ్ఛకే పూర్వకవులు ఎక్కువ మొగ్గుచూపడం వల్ల, ఆ స్వేచ్ఛకి అడ్డంకి అయిన కారణంగా విరామయతిని పాటించ లేదన్నది నా ఊహ.

"సంస్కృత సమాసాల్ని యథా తథంగా దించేసుకుంటూ పద్యాలు వ్రాసుకున్న మన వారికి అసలు కుదరదు."
గోపాలకృష్ణగారు నన్ను క్షమించాలి, నేననుకున్నది చెపుతున్నాను. ఈ మాట నాకు కాస్త దురుసుగా అనిపించింది. ఇది పూర్వకవుల పట్ల నాకున్న వీరాభిమానం వల్ల కాదు. తార్కికంగా ఆలోచిస్తే, ఎంతశాతం అలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి కవులు ఎక్కువగా ఆపని చేసారు మొదలైన విషయాలని పరిశీలిస్తే, ఇలాంటి "generic statements" (సర్వకవులకూ ఆపాదించే మాటలు) అనడం కుదరదు. విరామయతిని కాదన్న నన్నయ్యగారి విషయంలో కాని, వారిని అనుసరించిన తిక్కనగారి విషయంలో కాని అసలు కుదరదు.

ఇక తెలుగులో ఉన్న అక్షరసామ్య యతికి అసలు ప్రయోజనం ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. అక్షరసామ్యం అనేది తెలుగు భాషకి ఒక సహజమైన అందాన్ని యిచ్చే అంశమని మన సామెతలూ, జానపదగేయాలు మొదలైనవి స్పష్టంగా రుజువు చేస్తాయి. బహుశా ఆ దృష్టితోనే పూర్వకవులు ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు అని ఊహించడంలో నాకు అభ్యంతరం లేదు. అది పద్యాలలో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా సాధించలేదు అన్న విషయమూ స్పష్టమే (పైన నేను ఏకీభవించిన రెండో అంశం ఇది). మరి దీనికి వేరే ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని అడిగితే, ఉందని నా స్వానుభవం. ఇది ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అయినా మళ్ళి చెపుతున్నాను. ఈ ప్రయోజనం ఏమిటో మీరు సొంతంగా తెలుసుకోవాలంటే, మన కావ్యాలలోనుండి ఒక వంద పద్యాలు (పెద్ద వృత్తాలు) కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక యాభై సంస్కృత శ్లోకాలు (పెద్ద వృత్తాలు) కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. ఏది సులువో మీకు మీరు తెలుసుకోండి. నా విషయంలో తెలుగు పద్యాల కంఠస్థం సులువయింది. దీనికి తెలుగు భాషలో పద్యాలు సులువుగా అర్థమవడం, ఆ పదాలు ఎక్కువగా తెలియడం ఒక కారణం. అయితే నేను గమనించిన మరొక ముఖ్యకారణం అక్షరసామ్య యతి. అలాగే ప్రాస కూడానూ. ఒక పద్యంలో పదాలు గుర్తు పెట్టుకొనేటప్పుడు యతిస్థానంలో ఉండే అక్షరం మొదటి అక్షరంతో సామ్యం కలిగి ఉండడం వల్ల, అక్కడ వచ్చే పదమేమిటో సులువుగా గుర్తుంటుంది. ఇది నాకు చాలాసార్లు అనుభవంలోకి వచ్చిన సంగతి. ఇది కొంత తర్కసహంగానే అనిపించింది కాబట్టి, ఇతరుల విషయంలో కూడా యిది వర్తిస్తుందని నేను అనుకొంటున్నాను.
ఇంకొక విషయం - కొన్ని సందర్భాలలో పూర్వకవులు, చెప్పే విషయానికి ఒక ఉద్దీపన కలిగించడానికి కూడా యతిస్థానాన్ని వాడుకొన్నారని పండిత విమర్శకులు కొందరు విశ్లేషించారు. దీనిని కూడా నేను ఇంతకుముందు కొన్ని వ్యాసాలలో ఉదాహరించడం జరిగింది. ఇలాంటి విశ్లేషణతో అందరూ ఒప్పుకోవాలని లేదు కాని, యిది కూడా యతి ప్రయోజన విషయమై తప్పక ఆలోచించాల్సిన అంశమే.

చివరిగా, ఈ అక్షరసామ్య యతి పద్యరచనకు ఒక ప్రతిబంధకం, "గుదిబండ" అని గోపాలకృష్ణగారు అభిప్రాయపడ్డారు. అది వారి వ్యక్తిగత అనుభవం అంటే ఇబ్బంది లేదు. చాలామందికి అది గుదిబండ అయ్యే అవకాశం ఉంది అన్నా ఒప్పుకోవచ్చు. కాని పూర్వకవుల పద్యరచనకి యిది యించుమించు అంతటా గుదిబండగా మారింది అనే ధ్వని వారి మాటల్లో ఉంది. ఇది కచ్చితంగా తేల్చగలిగే అంశం కాదు. ఒక పద్యంలో యతిస్థానం వచ్చే పదానికి ప్రయోజనం ఉందా, కేవలం యతి కోసమే వేసారా అనే చర్చ ఎటూ తేలని చర్చ. ఒకోరికి ఒకో పదం వ్యర్థంగా తోచవచ్చు. మరొకరికి అందులో మహార్థమేదో గోచరించ వచ్చు, అది మొదటి వారికి రుచించక పోవచ్చు! పైగా మొత్తం కావ్యంలో, కావ్యసర్వస్వంలో అలాంటి వ్యర్థపదాలు యతిస్థానంలో ఉన్న పద్యాలశాతం ఎంత అనే లెక్క తెలియకుండా అది పద్యరచనలో మనకవులకు "గుదిబండ" అయింది అనే సర్వసామాన్య సిద్ధాంతాలు చేయడం సాధ్యం కాదు. ఈ యతి ఎలా ఇబ్బంది పెడుతుందో చూపిస్తాను చూడండి అని గోపాలకృష్ణగారు ఒక ఉదాహరణ ఇచ్చారు. దాని గూర్చి ముచ్చటించడం అసందర్భం కాదనుకుంటాను. వారిచ్చిన ఉదాహరణలో "తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్" అనే పాదంలో "తగ" అనేది వ్యర్థ పదం. సరే అది వ్యర్థపదమా కాదా అనే చర్చలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పైన చెప్పినట్టుగా అది తేగే చర్చకాదు. మరొక ముఖ్యమైన అంశాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ పద్యం ఒక చాటువు. చాటుపద్యాలలో ప్రతి పదం సార్థకంగా వాడడం అనేది మనకి చాలా అరుదుగా మాత్రమే కనిపించే అంశం. మంచి నడకతో, ఝటితిస్ఫూర్తి కలిగించే భావంతో ఉండడమే చాటుపద్యాల ముఖ్య లక్షణం. కాబట్టి వాటిలో వ్యర్థపదాలు కేవలం యతి వల్లనే ఉంటాయని భావించడం పొరపాటు. చాటుకవిత్వపు సహజమైన లక్షణాలలోనే వ్యర్థపదాలు భాగాలు. నిజానికి అక్కడ వాటిని "వ్యర్థ" పదాలని అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ "వ్యర్థం" అనే తూనికని మార్గకవిత్వపు లక్షణాన్ని బట్టి నిర్వచిస్తున్నాం కాబట్టి. దాన్ని మరొక రకమైన కవిత్వానికి వర్తింప చెయ్యడం సరికాదు కదా!

అయ్యలారా, అమ్మలారా! ఇవీ యతి గురించి నా మతికి తోచిన కొన్ని ఆలోచనలు. మీమీ సులోచనాలను బట్టి వీటిని ఆమోదిస్తారో తిరస్కరిస్తారో (ఏదో ఒకటి చెయ్యాలని రూలేమీ లేదు!) మీ యిష్టం. 


మళ్ళీ ఎప్ప్పుడైనా ఎందుకైనా మరోసారి కలుసుకొనేదాకా స్వస్తి! అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

74 comments:

  1. మంచి విషయాలు చెప్పారు . ఎక్కువ గద్యాన్ని ఇష్ట పాడేవాళ్ళు పద్యం వ్రాయటానికి కష్ట పడేవారు

    పద్యంలో లోటు పాట్లని ఎత్తి చూపడానికి యతి ని పరిగణించడం సహజమే. విధేయుడు

    శంకర్ భళ్ళముడి

    ReplyDelete
  2. మీరు వ్రాసిన వ్యాసం, మీ అభిప్రాయాలూ పూర్తిగా నచ్చినాయి. దీనిని ఛందస్సు గ్రూప్ లో పంచుకుంటే మీకు అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను.

    ReplyDelete
  3. శ్రీ భైరవ భట్ల వారికి కృతజ్ఞతలతో-నేను చెప్పుకోవాల్సినవి రెండు ముక్కలు. ఛందస్సు విషయంలో మీరేం చెప్పినా అది నాకు శిరోధార్యమే. కారణం ఆ విషయంలో మీకున్న అవగాహన లో నాకు వెయ్యో వంతు కూడా లేదన్న స్పృహ కలిగిన వాడిని కావడమే. నేను చర్చా విషయంగా లేవ దీసిన దానిని ఏదో పిచ్చి రాతగా పరిగణించకుండా దానికి మీరు స్పందించడమే నాకు మహదానందకరం. నేను పద మధ్యంలోే చెల్లిస్తున్న యతి గురించి వ్యక్త పరచిన రెండు అబిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నానని చెప్పడం సంతోషంగా ఉంది. అసలు నేను అక్టోబరు రెండున లేవనెత్తినదీ మళ్ళా నిన్న ఇంకొంచెం వివరంగా చెప్పినదానిలోని ముఖ్యమైన విషయం ఇదే కదా? ఈ విషయంలో మీరూ మోహన గారూ నాతోే ఏకీభవించడంతోే నా పోేస్టు ప్రయోజనం చేకూరినట్లే భావిస్తున్నాను. ఒక్క విషయంలో మీరు పోరబడ్డారనిపిస్తోంది. నేను ఎక్క్డడా అక్షర సామ్య యతి గుదిబండగా తయారైందని అన లేదు .పైగా దీని వల్ల మనం పద్యానికి కొత్త అందాల్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామనే చెప్పాను.మరోసారి చూడండి. ( నేను ఇంత వరకూ యతి చెల్లించకుండా ఒక్క పద్యమూ వ్రాయ లేదు) ఈ అక్షర సామ్య యతి పదారంభంలో వస్తేనే దాని ప్రయోజనం ఒనగూరుతుందని మాత్రమే నేను చెప్పాను.ఇక - పద విఛ్ఛేదమూ అక్షరసామ్య యతీ రెండూ పాటించడం కష్టమని చెప్పి మన వారు పరవిఛ్చేద యతికి మంగళం పాడేరన్నాను.ఇది కొంచెం Casual గాచెప్పినట్టలు ధవ్నిస్తున్నా జరిగినది అదే.మన వాళ్ళు పదవిఛ్ఛేదయతి స్థానం లో అక్షర సామ్య యతిని తెచ్చుకున్నారు. నియమం వదులు కున్నారనడానికి బదులు మంగళం పాడేరని అన్నాను. అంతే కదా? జరిగిందదే. అది తప్పనే భావంతో నేనన లేదు. ఈ రెండు నియమాలూ పెట్టుకుంటే వృత్తాల్లో పెద్ద పెద్ద సమాసాలతో రచన చేసే వారికి కుదరదు కదా? అందరూ అలా సమాస భూయిష్టమైన రచనలే చేసారని నా భావం కాదు కాని మన పూర్వ కవులు చాలా మంది ఇలాంటి సమాసభూయిష్టమైన ప్రౌఢ రచనల వైపు మొగ్గుచూపే వారన్నది తెలిసినదేకదా.పద మధ్యంలోనైనా అక్షర సామ్య యతి చెల్లిస్తే చాలని విరామం అక్కర లేదనీ మన వారు భావించడానికి ఈ సుదీర్ఘ సమాస రచనల్లో వారికి వచ్చిన ఇబ్బందే కారణం కావచ్చన్నది నా ఊహ మాత్రమే.వేరే కారణలూ ఉండవచ్చు. పద్యాలు కంఠస్థం చేయడానికి అక్షర సామ్య యతి ఉపయోగ పడుతుందని మీరన్నది అక్షర సత్యమే. అది పదం మొదటి అక్షరంతో యతి వేసినప్పుడే కుదురుతుందని నేను చెప్పినది. ఇంక శ్రీ నాథుని పద్యం గురించి.అది చాటువే కనుక అక్కర లేని పదాలు వస్తూనే ఉంటాయని మీరు చెప్పినదీ సత్యమే. ఈ పద్యంలో తగన్ అన్నది ఉన్నా లేక పోేయినా ఫరవా లేని పదం కాదు. ముందు పాదంలో చెల్లును అని ఉన్న తర్వాత ఇక్కడ తగన్ అని మళ్ళా ఉండడం సరైనది కాదనే నాకు అనిపించింది.ఇది ఒక మహా కవి రచనను తప్పుపట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత మాత్రం కాదు.అటువంటి అర్హత నాకే కాదు ఎవరికీ లేదు.అయితే ఈ పద్యంలో తగన్ అనే పదం కేవలం యతి చెల్లించడం తప్ప పద్యం సొగసుని ఏ మాత్రం పెంచని వ్యర్థ పదమేనన్నది నా భావన.నేను అక్షర సామ్య యతని గుదిబండ అన లేదని మరో సారి మనవి చేసుకుంటూ వినమ్రతతోే నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను

    ReplyDelete
  4. గోపాలకృష్ణగారూ,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. నలుగురినీ ఆలోచింపజేసేవి నాలుగు విషయాలు వస్తాయి కాబట్టి, ఇలాంటి చర్చలు ఆ విధంఆ ఉపయోగకరమే! ఈ ప్రజాస్వామ్య యుగంలో అందరూ ప్రజలే, అందరూ పాలకులే. అందరూ పండితులే, అందరూ విద్యార్థులే! అంచేత నా మాటలు ఎవరూ శిరోధార్యంగా పాటించనక్కర లేదు, అలా పాటించడం నాకు పెద్ద యిష్టమైన విషయమూ కాదు. మీరు చెప్పలేదన్న ఒకటి రెండు విషయాలు మీ మాటల ద్వారా నాకు అన్నారు అనిపించింది కాబట్టి వాటిని చర్చించాను (ఆ మాటలని కోట్ చేస్తూ). నాలా ఇంకెవరైనా అలా అర్థం చేసుకున్నవాళ్ళకి నేను చేసిన చర్చ, మీరు వ్యాఖ్యలో ఇచ్చిన వివరణ ఉపయోగపడతాయి.

    >>"పద్యాలు కంఠస్థం చేయడానికి అక్షర సామ్య యతి ఉపయోగ పడుతుందని మీరన్నది అక్షర సత్యమే. అది పదం మొదటి అక్షరంతో యతి వేసినప్పుడే కుదురుతుందని నేను చెప్పినది."

    పదం మొదటి అక్షరంతో కాకుండా, పద మధ్యంలో యతి వేసినా అక్షరసామ్య యతి అక్కడి పదాన్ని గుర్తుపెట్టుకోడానికి ఉపకరిస్తుందని నా అనుభవం. ఉదాహరణకి కరుణశ్రీగారి యీ పద్యం చివరిపాదం చూడండి:

    నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీ రవమ్ములో
    నిద్దురపోయినట్లు శయనించె సమస్తము సద్దులేని యీ
    అద్దమరేయి ఒంటిగ రహస్యముగా తపియుంచు గుండెపై
    నద్దుకొనంగ వచ్చితి దయామయ నీ చరణారుణాబ్జముల్

    చివరిపాదంలో ఒకోసారి "దయామయ" అనే పదం బదులు "కృపామయ" అనే పదం స్ఫురిస్తూ ఉంటుంది నాకు. కాని వెంటనే అది "కృపామయ" కాదు "దయామయ" అని యత్యక్షర సాంయం ద్వారా నిర్ధారించుకుంటాను.

    ReplyDelete
  5. లక్ష్మీదేవిగారూ, దీన్ని ఛందస్సు గ్రూపులో పంచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. నిజానికి ఇది అక్కడ మొదలయ్యిందే కదా!
    వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  6. ఒక మంచి చర్చ జరిగింది. చదివినందుకు నాకు సంతోషం‌ కలిగింది. అభిప్రాయాలు వ్యక్తపరచిన కామేశ్వరరావుగారు, గోపాలకృష్ణారావగార్లు ఆలోవననీయాంశాలు లేవనెత్తారు. కామేశ్వరరావుగారు ప్రజాస్వామ్యయుగంలో అందరూ‌ పండితులే అన్నప్పట్టికీ అపండితుడనన్న స్పృహగల నా లాటి వాళ్ళం కూడా ఉన్నాం‌ కాబట్టి మాకీ చర్చ అవశ్యం ఉపయుక్తమైనదే.

    వ్యర్థపదాలు రాకుంటే పద్యం‌మరింత శోభిస్తుందన్న మాట వాస్తవమే కాని కావ్యనిర్మాణం చేసే టప్పుడు ప్రతిపద్యాన్నీ అలా నడిపించలేం. సంస్కృతకవులు తుచలతో బండి నడిపించినట్లు తెలుగులో అటువంటీ సౌలభ్యం లేక కవులు వ్యర్థపదాలను ఆశ్రయించవలసి వస్తుంది. తమాషా ఏమిటంటే వ్యర్థపదం తీసి పకడ్బందీగా తిరిగి వ్రాస్తే తరచు పద్యం ధార దెబ్బతినటమో‌ అనవసరంగా మరింత కృతకం కావటమో‌ జరిగే‌ ప్రమాదం హెచ్చు. అందుచేత చదువరులం సంస్కృతంలో తుచలను సహిస్తూ తెలుగులో వ్యర్థపదాల గురించి బెంగపడలేం అనుకుంటాను.

    యతులవిషయంలో‌తెలుగులో‌సారూప్యయతిగా బహుకాలం క్రిందటే ఏర్పడ్ద నియమం, సంస్కృతఛందంలో నియమంతో మనకు పనిలేదు. కన్నడంలో కూడా సంస్కృతంలో వలెనే పదవిఛ్చేదయతి అని విన్నాను. మంచిదే. ఇప్పుడు తెలుగు నియమాలను మార్చుకో నవసరం కనిపించదు. అలవాటుపడితే తెలుగు యతిప్రాసలు మరీ‌కష్టం‌ కాదని నా అభిప్రాయం. యతిప్రాసలో‌ గురులఘుక్రమమో చీకాకు అనుకునే వారికి ఎలాగూ ఆధునిక కవిత్వం ఉండనే ఉంది. ప్రస్తుతం ఇంకొంచెం ముందుకు పోయినట్లే ఉన్నాం. ఎవరేది వ్రాసినా అది కవిత్వం అని వ్రాసిన వారు అంటే అది కవిత్వమే ఆన్నమాట,

    ReplyDelete
  7. భైరవభట్ల వారికి కృతజ్ఞతలు.నేను విరామ యతిని మన వాళ్లు వదులు కోవడం గాని అక్షర సామ్య యతిని పెట్టుకోవడం కాని తప్పని ఎక్కడా అన లేదువిరామ యతిని వదిలేశారనడానికి మంగళం పాడేరన్నానంతే. ఈ పని మంచిది కాదనీ నేనన లేదు. అక్షర సామ్య యతి మంచిదే కాని రెండూ పాటించడం కష్టం కనుక విరామ యతిని వదులుకున్నారని(మంగళం పాడేరని) నేన్నాను. దానికి సమాస భూయిష్టమైన రచనలో విరామం కష్టమనే కారణంగా దానిని వదులుకున్నారని నా ఊహ. పద్యపు నడకలోే స్వేఛ్ఛకే పూర్వకవులు మొగ్గు చూపడం వల్ల ఆస్వేఛ్చకి అడ్డంకి అయిన విరామ టతి వదులుకున్నారన్నది భైరవభట్ల వారు తమ ఊహగా చెప్పారు.విరామ యతిని మనవాళ్ళు వదలి పెట్ట్డానికి రెండు కారణాలు వెతుక్కున్నామంతే.అక్షర సామ్యయతిని నేను గుదిబండగా తలచనూ లేదు ఆవిధంగా నా వ్యాసంలో ఎక్కడా చెప్పనూ లేదు.దివిటీ పట్టుకు వెతికినా నా వ్యాసంలో ఆ భావం కనిపించదు. అయితే ఆ అక్షరసామ్య యతి రదారంభంలో రాణించి నట్లు పదమధ్యంలో ఉంటే రాణించదేమో నన్నది నా భా భావన. దానికుండే ప్రయోజనం ఎవరైనా తెలియజేస్తారోమోననే నేను చర్చ లేవదీసినది. భైరవభట్ల వారు అది పద్యాన్ని కంఠస్థం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. యతి పదమధ్యంలో ఉన్నా అక్కడి పదాన్ని అవసరమైతే గుర్తుకు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందంటే నాకైనా ఎవరికైనా ఏ అభ్యంతరమూ ఉండదు.ఇది కాక మన పూర్వ కవులు చెప్పే విషయానికి ఉద్దీపన కలిగించడానికి కూడా వాడుకున్నారని కొందరు పండిత విశ్లేషకులన్నారని అది అందరికీ ఆమోదయోగ్యం అయినా కాకపోేయినా ఆలోచించాల్సిన విషయమే నన్నారు. అదేమిటో వివరించలేదు కనుక నాకు తెలియదు. అటువంటి ప్రయోజనం ఏదయినా ఉంటే అది మంచిదే.నేను అక్షర సామ్య యతిని గుదిబండ అని అన లేదు కనుక నాతో శ్రీ భైరవభట్ల వారికి భేదాభి ప్రాయం లేదనే భావిస్తున్నాను..పైగా నాకు ముఖ్యమనిపించిన విషయాలలో వారూ శ్రీ మోహన గారూ ( Face Book) లో- నాతో ఏకీభవించడం నా పోస్టుకు ప్రయోజనం సిధ్ధించింది. వారి భావాలతో నాకే పేచీ లేదు.శ్రీ భైరవభట్ల వారికి దన్య వాదాలతో.

    ReplyDelete
  8. >>"ఇది కాక మన పూర్వ కవులు చెప్పే విషయానికి ఉద్దీపన కలిగించడానికి కూడా వాడుకున్నారని కొందరు పండిత విశ్లేషకులన్నారని అది అందరికీ ఆమోదయోగ్యం అయినా కాకపోేయినా ఆలోచించాల్సిన విషయమే నన్నారు. అదేమిటో వివరించలేదు కనుక నాకు తెలియదు."

    ఆధునికకాలంలో వచ్చిన విమర్శ మార్గాలలో "శిల్పానుశీలన" ఒక పంథా. అందులో భాగంగా పద్యశిల్పాన్ని గురించి విమర్శకులు విశ్లేషించి చెప్పారు. అందులోనే పద్యపు నడక, యతి ప్రాసలూ ఎలా భావస్ఫూర్తికి ఉపయోగపడతాయీ అన్న అంశలు విశ్లేషించారు. ఈ తరహా విమర్శ ఎక్కువగా విశ్వనాథవారు చేసారు. గుంటూర్ శేషేంద్రశర్మగారూ, సంపత్కుమారాచార్యగారూ మొదలైన వాళ్ళు కూడా దీని గురించి వ్రాసారు. మీకు ఆసక్తి ఉంటే వారి విమర్శవ్యాసాలు చదవండి. ఈమాటలో నా యీ వ్యాసంలో దీని గురించి కొంత వివరించాను:
    http://eemaata.com/em/issues/200211/1323.html

    విరామయతి ప్రయోజనాలూ పరిమితుల గురించి మరింత వివరణ అవసరం. వీలుచిక్కునప్పుడు దాని గురించి సోహారణంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

    ReplyDelete
  9. ఈ వ్యాసం చదివి ఎంత సంతోషించినానో చెప్పడం కష్టం. ఇంతవరకూ సీసంలో వర్ణనాసౌకర్యాన్ని, కందంలో శబ్దాలంకారాలు పొదిగే వీలును, శార్దూలంలో శౌర్యాన్ని పరాక్రమాన్ని వర్ణించే అద్భుతాలను గురించి ఆలోచిస్తూ ఈ విధంగా పద్యపునడకలు, విషయంతో వాటికున్న సంబంధాన్ని గురించి ఆలోచిస్తూ అటువంటి పుస్తకాలు వెదికే దాన్ని.
    నాకు దొరకలేదు. పద్యాలను పైపైన స్ఫృశించిన కొన్ని వాక్యాలు తప్ప ఏ విమర్శ పుస్తకాల్లోనూ దొరకలేదు.
    మీ వ్యాసం ఆ కొరత తీర్చింది. మీరు అప్పుడప్పుడూ వ్రాసేబ్లాగు వ్యాసాలు తెలుగుపద్యాలను గురించే ఉంటాయి కాబట్టి వీటన్నిటిని బుక్కుగానో ఈబుక్కుగానో తెస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. లక్ష్మీదేవిగారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. పుస్తకం తెచ్చే ఆలోచన ఇంతవరకూ రాలేదండీ, అంత సరుకింకా ఉందని కూడా అనుకోడం లేదు. పైగా దానికి ఒక మంచి ఎడిటరు ఉండాలి. నేను చెప్పే విషయాలు చాలావరకూ పాతవే. కాస్త కొత్తరకంగా చెప్పే ప్రయత్నమే నాది. అవి పుస్తక రూపంగా తెస్తే ఉపయోగపడుతుందని ఎవరైనా భావించి తగిన విధంగా ఎడిట్ చేసి ప్రచురించే వాళ్ళు ఉంటే అప్పుడు తప్పక ఆలోచిస్తాను!

    ReplyDelete
  11. కామేశ్వర రావుగారూ, ఎమ్.ఏ రెండవ సంవత్సరం పరీక్షలను బాగా వ్రాసారని తలుస్తాను.నేను ఫ్రథమ సంవత్సరం పరీక్షలు వ్రాసాను. పాసు మార్కులు రావచ్చనుకుంటున్నాను. ఒకటి రెండింట్లో ఫెయిల్ అయినా దానికీ సిద్ధపడే ఉన్నాను.రెండవ సంవత్సరం పుస్తకాలు తెప్పించుకొనే ప్రయత్నం లో ఉన్నాను.

    ReplyDelete
  12. http://padyam.wordpress.com/2014/12/17/sri-annamayya/

    ReplyDelete
  13. 64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai).
    http://goo.gl/FNmtFq

    ReplyDelete
  14. very nice

    Looking for Employment in Abroad?
    Submit your resume and get job offers directly from reputed companies
    For More Details Visit www.kuwaitnris.com

    ReplyDelete
  15. Very nice poetry.....Can't able to express.....Thanks to online blogging NW also we can read like this poetry through online......Plz visit our blog also www.teluguvaramandi.net leave Ur feedback plzz

    ReplyDelete
  16. nice poetry
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/garamchai

    ReplyDelete
  17. ఇ లాoటి వి బహు వ్యా ఖ్యా నా లు రా వాలని కో ర డ మై నది.

    ReplyDelete
  18. మoచి పద్యాల పై పoడితుల వ్యాఖ్యలు పద్యం వ్రాయా లనే నా లాంటి వారికి ప్రేరణ. ధన్యవాదాలు
    ఇట్లు భవదీయుడు
    పంచరత్నం వెంకట నారాయణ రావు

    ReplyDelete
  19. మీ ఆధార్ కార్డు ని మీ మొబైల్ నెంబర్ తో లింక్ చేయండి ఎలా.
    ఒక్క కాల్ తో మే అధర్ వెరిఫికేషన్ పూర్తి అవ్తుంది https://youtu.be/wNCFZUXPr0U

    మీ మొబైల్ నెంబర్ తో మీ అదార్ కార్డు ని ఒక్క కాల్ ద్వార లింక్ చేయండి.
    #ఆధారకార్డ్
    #simverification
    #aadharcard
    now click on link

    ReplyDelete
  20. Nice! thanks therefore much! thanks for sharing.
    Your dairy posts area unit a lot of interesting and informative.
    your writing is too good..
    I think there are many people like and visit it regularly, including me.

    ReplyDelete
  21. great story
    https://goo.gl/Ag4XhH
    plz watch our channel

    ReplyDelete
  22. Your work is time-consuming but you know that it is well done!

    ReplyDelete



  23. Nice Blog, It's Useful for Everyone. More Information Visit Our Website ..

    TeluguVilas

    Thanks..,

    ReplyDelete
  24. Thanks for writing such a good article, I stumbled onto your blog and read a few post. I like your style of writing...

    vastu solution Website:

    Vastu Consultant in Delhi
    Vastu Consultant
    Vastu Consultant Service
    Vastu Shastra
    Vastu Consultant in Delhi


    ReplyDelete
  25. nice post, it's long and informative. thanks for the time invested in this article. risecredit.com invitation

    ReplyDelete
  26. Watch Latest short films in our blog.

    https://luckeyshortfilms.blogspot.com/

    ReplyDelete
  27. The energy of the space you live in is affecting you more than you think. Our health and well-being are affected by five elements, heat and sunlight, weather conditions, Earth's magnetic fields, planets and other subtle energies. Get Advised by a vastu consultant in delhi, Dr. Anand Bhardwaj. Visit:- https://www.vaidicvaastu.com or call 9999256700

    ReplyDelete
  28. very interesting , good job and thanks for sharing such a good blog.
    Telugu News Updates

    ReplyDelete
  29. పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి మా తెలుగరీడ్స్ https://telugureads.com/vijnanam-telugureads-knowledge-book-reading/

    ReplyDelete
  30. http://lqnt.blogspot.com/2015/05/her-king-in-march-2008-knowingly.html

    ReplyDelete
  31. Allow us to visit the dream universe of yours and let it stew for some time the universe of dreams and even the lost initiation of your most significant needs. The thing is people who are escorts in chennai social associations, they get depleted with a comparable woman again and again and this is the gnawing truth people. This is the place , i come in light of the fact that I guarantee everyone acknowledges the be me without affecting the bona fide association you have.



    Question : Chennai Escorts More Details |

    Question : Chennai Escorts More Details |

    Question : Services Chennai Escorts More Details |

    Question : Chennai Escorts Model More Details |

    Question : Best Rates Escorts in Chennai More Details |

    Question : Contact Chennai Escort More Details |

    Question : Top Class Escorts More Details |

    Question : Blog Chennai Escorts More Details |




    THE BEST WOW CHENNAI ESCORTS

    SANA KHAN BEST OFFER 20% dISCOUNTst time with

    ReplyDelete

  32. Get Solution of Famous k.M Sinha Astrologer in Delhi. He provide online services astrologer in india. Get Consults with famous astrologer in mumbai.

    ReplyDelete
  33. IZSPA, is the heaven in form of spa we are best body massage service provider in Bangalore.We offer our customers massages like Female to Male,Body to Body Massage, Thai Massage and many more modern and traditional types massages provided by IZSPA in best prices.

    For more information visit Body To Body Spa Near Me

    ReplyDelete
  34. I specialize in customer service and massage therapy for the following areas: foot reflexology, pregnancy massage (prenatal), post-surgical recovery, sports massage, and remedial/deep tissue massages. I offer a wide range of therapeutic techniques including Swedish techniques such as effleurage and petrissage; deep tissue work to release chronic tension or knots; lymphatic drainage techniques that encourage the natural circulation of fluids around the body; acupressure points to help balance energy flow in your body. B2B spa near me

    ReplyDelete
  35. If you are looking for a new escort service in Chennai, then ohescorts is the best place to find what you need. We provide all of your needs from massage to companionship and more. Contact us today if you would like to know more information about our services or visit our website at Escorts Chennai

    ReplyDelete
  36. A massage centre is the one that has well designed interior with international standard and most importantly privacy. We have kept all this in mind at Sweety spa and that is why it is rated as the top B2b spa near me.

    ReplyDelete
  37. We are a Body Massage Spa Near me, so if you're looking for the best massages in your area, we want to be your go-to spot. We offer an array of services that will leave you feeling refreshed and rejuvenated! Our professional staff is highly trained and ready to help make your day great. Come experience what makes us different today!

    ReplyDelete
  38. Gayatri is the owner of Body Massage Spa Near Me. She has been in business for over 10 years and counting, and she loves what she does! Gayatri believes that every person deserves to feel refreshed, relaxed, and rejuvenated. Body To Body Spa Near Me

    ReplyDelete
  39. The majority of companies showcase gorgeous models on their websites, but they actually serve their clients with inexpensive slum females.

    ReplyDelete
  40. Thanks for the sharing such a great post!!

    ReplyDelete
    Replies
    1. You have shared the awesome information, Thank you team.

      Delete
    2. You put really very helpful information

      Delete
  41. Hi there, I found your website via Google while searching for a related topic, your website came up, it looks great. I have bookmarked it in my google bookmarks.

    ReplyDelete
  42. This comment has been removed by the author.

    ReplyDelete
  43. Thank you for sharing the awesome article with us. that’s very useful. Provides much-needed knowledge.
    Latest News Updates

    ReplyDelete
  44. Thank you for such a wonderful content .It was really helpful to me.

    Latest Tollywood News Updates

    ReplyDelete
  45. SEO Services in Delhi – Seo Service Delhi offers quality SEO and SMO services to help you boost the ranking of your corporate website.

    ReplyDelete
  46. Thanks for the sharing post..!

    ReplyDelete
  47. I have been searching in the online for long time for this type of wonderful post. In case, if you to know more on female to male body massage in chennai never hesitate to reach out at goodwill spa. You will feel stress free and completely relaxed with our body massage services.

    ReplyDelete
  48. This is an awesome motivating article. I am practically satisfied with your great work. Indore Party Girls

    ReplyDelete
  49. https://padanisa.org/blog
    కథలంటే ఆసక్తి ఉన్నవారికి కథలు చెప్పటం. కథలలో ఉన్నటువంటి ఔనాత్యన్ని తెలుసుకోవటం కోసం మా పదనిస ఒక చక్కని ఉత్తమ వేదిక. కథలను చదవటం ద్వారా మన సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకుంటాము.

    ReplyDelete
  50. రుక్మిణీ కళ్యాణం


    విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది. రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలే దిన దిన ప్రవర్థమానమై యవ్వన వయస్సుకు వస్తుంది. వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు. అదే విధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురుంచి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది.

    రుక్మిణీ దేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్ళి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరిని శిశుపాలుడికిచ్చి పెళ్ళి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీ దేవి చాలా చింతిస్తుంది.

    కొద్ది సేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకపురమునకు వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీ దేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు.

    అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీ దేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచన ఈ విధంగా చెబుతాడు. "యదువంశ నందనా! రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములో యదువంశ నందనా, నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు." శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశము వైపు బయలు దేరుతారు.

    అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు, శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరపొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీథులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీ దేవిని తిసుకొని వెళ్ళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి

    ReplyDelete