తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, December 29, 2008

కొండ-గోదారి, నేను

నదికి కొండకి స్నేహ మేనాటిదో కదా!
ఉరకలెత్తు నది నిరంతరము చెప్పు ఊసులెన్నొ.
వాటికి తలయూచలేదు కొండ,
కాని ఆగదు నది.
గొప్ప చెలిమి!

కొండపైనున్న ఓ చెట్టుకొమ్మ మీంచి
ఎగురుకొని వచ్చి,
నదికి ఊసేదొ చెప్పి
ఎగిరిపోయింది ఒక పిట్ట.
ఏమి కబురు
చెప్పి పంపించెనో?
ఎంత చిత్ర మైత్రి!

ఆ నిరంతర స్నేహాని కడ్డు తగిలి
వాటి ఏకాంత స్వేఛ్చని భంగపరిచి
ఇంగితము లేక అట విహరించుచున్న
వెఱ్ఱి స్వార్థము రూపైన వింత పశువు
నేను!

8 comments:

  1. ఆ గోదారమ్మలానే చల్లగా, ఒద్దికగా, అందంగా ఉంది.

    ReplyDelete
  2. రవి గారి మాటే నాదీనూ!

    ReplyDelete
  3. బాగు బ్లాగు ! కవిత బహు బాగు!
    ఏమి తెలివి!
    ఇది పద్యమే!! మన తేట గీతి!
    వచనమని ఒక నిమిషము భ్రమ పడితిని.
    ఇందులో కూడ.. "నేను" .. కాస్తెక్కువయ్యె ??!!

    ReplyDelete
  4. అందమైన ఊహ, మరింత అందమైన పదాలలో ఒదిగి మంచి లాండ్ స్కేప్ పైంటింగ్ లా అనిపించింది మీ కవిత.


    మీ చివరి లైనుతో నేను ఏకీభవించను. :-)

    నేనైతే వాటితో పాటూ కలిసిపోతాను.

    ఒక వేళ మీరు స్వార్ధ మానవుడు, ప్రకృతిని నాశనము చేస్తున్నాడు అనే అర్ధంలోచెప్పినట్లయితే వెంటనే ఏకీభవించేసి, హాట్సాఫ్ చెపుతున్నాను.

    ReplyDelete