తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, March 11, 2011

దిగిరావా దాశరథీ!

దిగిరావా దాశరథీ!
నువ్వు కురిపించిన అగ్నిధార, నువ్వు వినిపించిన రుద్రవీణ, నువ్వు ఆశించిన మహాంధ్రోదయం పిచ్చెక్కిన మా మనస్సులకి, మొద్దుబారిన మా హృదయాలకి, చచ్చిపోయిన మా ఆత్మలకి మళ్ళీ అవసరం.

నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి
ఆకాశమంత ఎత్తరచినాను
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను
నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు
తోట నాటి సుమాల దూసినాను

కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నలను గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోటుల నొక్కటే ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి !

అని ఆ రోజెప్పుడో నువ్వు గొంతెత్తి పాడావుట!
ఇవాళ మా గుండెలే రాక్షసమయ్యాయి దాశరథీ! మా చేతులతో మేమే మహాంధ్ర సౌభాగ్యాన్ని చెరిపేసాము. చేవ చచ్చిన తెలుగు జాతికి, నీతి చచ్చిన తెలుగు జాతికి, బుద్ధి పుచ్చిన తెలుగు జాతికి, గుండెల్ని కుదిపేసి బూజు దులిపేసే నీ కవిత్వం కావాలి. దయచేసి మరొక్కసారి నీ గొంతు సవరించుకొని ఆకాశమంత యెత్తు అరవ్వూ!

చచ్చిపోయె చేవ, చచ్చె సంస్కారము
చచ్చిపోయె సిగ్గు, చచ్చె తెలివి
పెచ్చరిల్లిపోయె పిచ్చి విద్వేషము
చచ్చిపోయె తెలుగుజాతి పరువు

పగలగొట్టిరి విగ్రహమ్ములు
పగలగొట్టిరి నిగ్రహమ్మును
తగలబెట్టిరి తెలుగు సంస్కృతి
పగలగొట్టిరి గుండెలన్

ఛీ! యిది యేమి జాతి! మన చేతులతో మన కొమ్మలే తెగన్
గోయుచునుంటి మస్థికలు కుళ్ళెనొ నెత్తురు చల్లబడ్డదో!
పోయెను జాతి గౌరవము బుద్ధుని సాక్షిగ పుణ్యభూమిలో
గాయము శాశ్వతమ్మిది వికారపు మచ్చిది మాసిపోవునా?!

24 comments:

  1. నిజమే! దాశరథి రావాలి!!

    ఇన్ని స్పందనల్లో బుద్ధి వికసించని జనం పండిస్తున్న మెలోడ్రామాల్లో మీ ఈ టపా, ఇంకా ఆలోచించే జనం మిగిలి ఉన్నారన్న నా నమ్మకానికి చేయూత!

    "ఛీ! యిది యేమి జాతి! మన చేతులతో మన కొమ్మలే తెగన్
    గోయుచునుంటి మస్థికలు కుళ్ళెనొ నెత్తురు చల్లబడ్డదో!"

    "మన చేతులతో మన కొమ్మలే..." - ఇదీ! దీని గురించి ఆలోచించాలి. *ఎవడో* వచ్చి 'తెలుగు ఆత్మను" ధ్వంసం చెయ్యలేదు. చేసినదీ తెలుగోడే, తెలంగాణా వాడూ తెలుగోడే. తెలుగు తనం గోదారినుంచో, గుంటూరు నుంచో వచ్చిన ఏ కులపిశాచి అబ్బడి సొత్తో, కడపనుంచొచ్చిన నాసొత్తో కాదు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సగం సమస్యలు తీరతాయి!

    ReplyDelete
  2. నిజమే ఇది అక్షరాలా కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. మన ఇంటి పునాదులను మనమే పెకలించుకొని వికటాట్టహాసాలు చేయడమే.
    ఈ ఘటన విని సి.నా.రె కన్నీరు మున్నీరయ్యారట. దాశరధే ఉంటే గుండె పగిలి చనిపోయేవారేమో

    ReplyDelete
  3. నిన్న చదువరి గారి బజ్ లో "మన వేలితో మన కంటిని మనమే పొడుచుకోవడం నాకు మింగుడుపడట్లేదు అని" అనిపించింది రాసా. పోతే RK అన్నట్లుగా ఉన్న సమస్య లకి ఆజ్యం పోస్తున్నవి ఎకసెక్కపు, అహంకారపు, ఆధిపత్య ధోరణుల మాటలు కూడా. పక్క వాని కల్చర్ ని, వాడి మాట తీరునీ, వాడి ఆహార్యాన్నీ ఎల్ల వేళలా తక్కువ చేసి మాట్లడితే, వాడెప్పుడో తిరగబడి నానా బూతులు తిడతాడు. అసలే కోతి, కల్లు తాగి ఉండి పరిస్థితి ఉద్రిక్తంగా ఉందిరా బాబో అంటే, కొంత మంది దాన్నింకా జఠిలం చేస్తూ అవమానకరమయిన రీతిలో మాట్లాట్టం నాకు బాధ కలిగిస్తోంది, అదేదో "సంస్కారం, సంస్కృతి, తెలుగుతనం" వీళ్ళ లాస్ట్ నేం అయినట్లు, అవతలి వాళ్ళు ఆ పదాలకి అర్హులు కానట్లు. సాడ్. క్షమించాలి I guess I am venting out. Will stop

    ReplyDelete
  4. I had a question why andhra people watch telugu serials even there is no story nothing. yesterday i got answer .. with that experience only all andhra people reacting over.. some people are not eating ... some are not not sleeping.. some are not walking .. no talking.... just bacause of some stones.. i don't know why these people did not say this dialogues when polices were attacked on OU Students.. when 600 people are suicide for telangana .. i can understand this one because those are telangana people. but i did not understand what happen in sompatea police fire..

    ReplyDelete
  5. హుస్సేన్సాగర్ మీది విగ్రహాలు మీవి ,అందులే తేలే శవాలన్నీ మావా ?అన్న కవి ప్రశ్న ఉదయించి పదేండ్లు అయ్యింది .మరి ఆ వాక్కు వట్టిగనే పొతదా?మహనీయుల విగ్రహాల మీద ఎవలకు రెండో రకం అభిప్రాయం లేదు.అవి పెట్టిచిన వాళ్ళ మీదనే మంట.ఇది సమైక్య రాష్ట్రమే అయితే హుస్సేన్సాగర్ కట్ట మీద మూడో నాలుగో విగ్రహాలు తెలంగాణ మహానీయులయి ఎందుకుంటాయి ?తక్కిన ఇరువై ముప్పై అంద్రాయి ఎందుకుంటాయి .మాకు బందగి,ఇలమ్మ షోయబుల్ల ఖాన్ ,తుర్రెబాజ్ ఖాన్ బద్దం ఎల్ల రెడ్డి ,వట్టికోట ఆళ్వారు స్వామి ,దాశరథి ,పాల్కురికి సోమన్న ,కాలోజి ,కొమురం భీమ్ ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు .పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా ? విశాఖ బీచ్ దగ్గర ఉన్న విగ్రహాలలో ఒక్కటైనా ఉన్నదా ?అగో అందుకే ఎక్కన్నో కాల్సుక వస్తది.కోపం రేశం వస్తది. విగ్రహ ఆగ్రహం వస్తది.నిజానికి తెలంగాణ ప్రజలకు ఎంత వోపిక ఉన్నదంటే తమ తమ పట్టణాల్లో ఉన్న తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలను ఇంకా ముట్టుకుంట లేరు .

    ReplyDelete
  6. @తెలుగు

    ఔ మల్ల...

    బిర్లా మందిర్ల రాయలసీమ దేవుడు ఉండు..చిల్కూర్ ల భి ఆయనే ఉండు....ఎత్తేద్దం పట్టు మల్ల...గా రాయలసీమ దేవున్ని...

    Airport భి మనది గాదన్న...రాయలసీమోడు కట్టిచిండు...దీన్ తల్లి..దాన్ని గూడ లెపేద్దం దా...

    Hitech city భి రయలసీమోడు గట్టిచిండు...దాన్ని గూడా...

    అన్నా....ఆఖిర్ల ఏం ఉంటదన్న గీడ....చార్మినార్...దాని చుట్టు ఖబర్స్థాన్ ...గది చాలు అన్నా మనకు...

    ఇంకో doubt అన్నా....MIM ఓడు జై సమైఖ్యంధ్ర అంటుండు....ఆని గడ్డంల ఎంటికలన్న పీకగలమా??

    షిర్డీ సాయి బాబా మనోడు గాదు.....మహారష్ట్ర ఓడు...
    గాడ తెలంగణ దేవుల్ల గుళ్ళు గెన్ని ఉన్నై అన్నా....మనమెందుకు పూజించాల్నే గా దేవున్ని...మనకు లేరా దేవుళ్ళు??
    గా దేవుని అన్ని గుళ్ళని ఎత్తేద్దాం పట్టు...


    అన్నా....మన చుట్టూ ఎన్ని "ఇందిరమ్మల" ఇగ్రహాలు, ఎన్ని "రాజీవుని" ఇగ్రహాలు ఎన్ని "గాంధి" ఇగ్రహాలు ఉన్నై....దంట్ల ఎవడన్న తెలంగాణోడు?? ఇందిరమ్మనే కద మొదట్ల ఒద్దు అన్నది తెలంగాణని...గాంధి ఖాందానే గసొంటిది అన్న...

    వాటిని పీకే దమ్ము ఉందా అన్నా??

    ReplyDelete
    Replies
    1. manchiga chappinave.... mana lekka andru.....rade..... andaru..........pagal nakodukulu......

      MIM vallani..... adiganduku....diram ladu ganeeee..... vigrahaly pagalagodatare........idandi mental...malla supoort.....onkati.....

      Delete
  7. @chaitu said...
    నువ్ శెప్పినవాట్లల్ల ఆంధ్రోడు కట్టిచ్చినయ్ ముద్దుగ ఓ లిస్ట్ రాసివ్వు. వాటికీ పనిచెప్తం... నెక్స్ట్ హైదరాబాద్ల తిష్టేసిన ఆంధ్రోళ్ళే టార్గెట్టు. డౌటా? అరె ఆ లిస్ట్ కూడాచెప్తె మాక్కొద్దిగ పనిదగ్గుతదిబై! :)

    ReplyDelete
  8. అయ్యా తెలుగు గారూ,
    మీరు చెప్పిందంతా నిజమే అనుకుందాం. అయినప్పటికీ, నాకు ఒకటే కన్ను ఉంది, పక్కవాడికి రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి, వాడిది ఒకటి పెరికిపడేసి సమానత్వం తీసుకొస్తా అనడం ఏం లాజిక్ సోదరా?

    కొంపతీసి మీరు కమ్యూనిస్టా? వాళ్ళు మాత్రమే ఇలాంటి లాజిక్ లు మాట్లాడగలరు.

    పోరాడండి బ్రదర్, ఎక్కడెక్కడైతే రాయబడిన, చెక్కబడిన చరిత్ర ఒక్క వైపే ఎక్కువగా తూగి ఉందనిపిస్తే, దాన్ని కరక్టు చెయ్యండి. విగ్రహాలో, నిధులో, ప్రాజుక్టులో, సరైన ప్రాతినిధ్యాలో అన్నీ తెచ్చుకోండి, అంతే కానీ, ఈ మతిలేని, భావ దారిద్ర్యాన్ని సమర్ధించకండి, వెర్రి మొర్రి లాజిక్కులతో.

    ReplyDelete
  9. panic or scared? :)
    అద్గదిగో రాజమండ్రి రైలుకూతెట్టింది. బెజవాడ బస్సెళ్ళిపోతాంది మరి.

    ఇక తిష్టలేసి పెట్టే బేడె సర్దుకుని బయల్దేరండ్రా. అయ్యయ్యో మిస్సయిపోయిందా మరి నెక్స్ట్ బండొచ్చేదాకా జర బద్రంగుండున్రి బై.

    ReplyDelete
  10. సంఘంలో పుస్తకాలని నిషేదించి, అన్నీ ఒకే భావ జాలంతో ఉండే పుస్తకాలతో లైబ్రరీలన్నీ నింపడాలూ, కల్చలర్ ఐకాన్స్ విగ్రహాలనీ కూల్చడాలూ, రచయతల్ని కొట్టడాలూ, తగలేయడాలూ, ఒక ethnicity ni టార్గెట్ చేసి వాళ్ళని తప్పుడు కేసులతో జైళ్ళలో తోయడాలూ, ఇట్లాంటివన్నీ సంఘ పరిణతి గురించి, collectively evolved conscience గురించీ బిగ్గరగా మాట్లాడతాయి సోదరా, మన మాటల కన్నా. తెలంగాణా ని ఇట్లాంటి చర్యలతో అవమానించాలనుకుంటున్నారా మీరు?

    ReplyDelete
  11. @ తెలుగు

    .పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా ?
    ఉంది. నెల్లూరు లో కొమరం భీమ్ విగ్రహం ఉంది. అది కూడా ఈ మధ్య పెట్టినది కాదు.
    ఇప్పుడు చెప్పండి, తెలంగాణాలో ఎన్ని కొమరం భీమ్ విగ్రహాలు ఉన్నాయి? (ఈ మధ్య ఆయన గుర్తొచ్చినప్పుడు ఆదరా బాదరాగా పెట్టినవి కాదు). ఎన్ని చాకలి ఐలమ్మల విగ్రహాలు ఉన్నాయి? గుర్తు తెచ్చుకోండి. రాత్రంతా ఆలోచించినా సింగిల్ డిజిట్ దాటుతుందా ఆ సంఖ్య?

    ఏంటీ "నెక్స్ట్ హైదరాబాద్ల తిష్టేసిన ఆంధ్రోళ్ళే టార్గెట్టా"?
    పిచ్చి కుక్కా ఈ దేశం నీ అబ్బ సొత్తా? నువ్వేవడ్రా మమ్మల్ని టార్గెట్ చేయడానికి? ఒక మూర్ఖ ప్రొఫెసర్ పిచ్చెక్కి ఏదో కూస్తే వాడి వెనక తోకూపుకుంటూ మొరిగే నీలాంటి వాళ్ళని కుక్కల వాన్ లో వేసి దేశం పొలిమేరల దాకా తరిమి కొడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

    ReplyDelete
  12. @telugu

    >>నువ్ శెప్పినవాట్లల్ల ఆంధ్రోడు కట్టిచ్చినయ్ ముద్దుగ ఓ లిస్ట్ రాసివ్వు. వాటికీ పనిచెప్తం...

    meeda cheppina list ke ...em chestavo cheppaledu bidda...malla adgtunav list ani....em peekaneeki?

    Inko doubt buddy...Pingali "Andhrodu" kada...mari aayana design chesina Indian flag ni maatram enduku eskoni tirgutundru???? daanni kuda tagala bettundri!!

    Do u hv answer for that???


    Sarle Malli neekosam...extended list...

    Gods:-
    ----
    - Venkateshwara - Rayalaseema devudu.
    - Ramudu, krishnudu - North Indian Devullu
    - Narasimha swamy - Rayalaseema devudu.
    - Mallanna - Rayalaseema ne malla.
    - Sai baba - Maharashtra
    - Durga - Vijayawada/Andhra

    pina cheppina list lo nenu miss aithe nuvve add chesko...andari gudi gopuralu lepeyaala malla....

    lepaledante...mooskoni chesindi tappani oppukoni lempaleskuntava??

    inkaa..."andhrollu" kattinchina kattadaalu...

    - Hitech City and IT park -> CBN and YSR..both from rayalaseema
    - Airport - YSR -> again, rayalaseema
    - Gachibowli stadium -> CBN
    - Rajeev Gandhi Cricket Stadium -> YSR
    - Flyovers in Hyd...ALL of them!!
    - Development happened in Hyd for the last 35-40 Years.

    just to name a few on the top of my head...

    meedivanni aina tarvata raa bidda andhrolla deggariki...


    btw....nenu andhrodini kaadu bhai...telangana vodini kuda kaadu.."Telugu" vaadini...Gurtu telisinappati nunchi Hyderabad lo untunna vaadini...anthe...

    ReplyDelete
  13. స్పందించిన వాళ్ళందరికీ నెనరులు. ఇన్నాళ్ళూ తెలంగాణా సమస్య మీద నేను ఎప్పుడూ పెదవి విప్పలేదు. దాని గురించిన తగినంత అవగాహన నాకు లేదు కాబట్టి. ఇప్పుడుకూడా నేను దాని గురించి మాట్లాడలేను. అది నా అశక్తతే. నేనొక ప్రవాసాంధుడిని. ఇక్కడ కూర్చుని అక్కడి ప్రజల స్థితిగతులని అంచనా వెయ్యడం అర్థం లేని పని. కాని నన్నింకా తెలుగుజాతితో గట్టిగా ముడివేసి ఉంచిన బంధాలలో కొన్ని, టాంక్ బండ్ మీద విగ్రహాల రూపంలో ఉన్న వ్యక్తులు మనకిచ్చి పోయినవి. అందుకే అంత ఆవేదన.

    నేను ప్రత్యేక తెలంగాణాకి వ్యతిరేకినీ కాదు, సమైక్యాంధ్రాని ద్వేషించేవాడిని కాదు. ఇది గోడమీద పిల్లి వ్యవహారమని అనిపించవచ్చు. ఒక విషయాన్ని గూర్చి సరైన అవగాహన లేకుండా స్థిరాభిప్రాయాన్ని ఏర్పరుచుకోలేని నా అశక్తతే అది. ఒక్కటి మాత్రం దృఢంగా విశ్వసిస్తాను. ఒకటే రాష్ట్రంగా ఉన్నా, రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా అందరం తెలుగువాళ్ళమే. అందరికీ విడదీయలేనంతగా ఒక చరిత్ర, ఒక భాష, ఒక సంస్కృతి ఉన్నది. నాది విజయనగరమైనా, గురజాడ శ్రీశ్రీలకన్నా ఎక్కువగా విశ్వనాథని నేను ఆరాధిస్తాను. దాశరథిని, శేషేంద్రని, కృష్ణశాస్త్రిని ఒకేలా అభిమానిస్తాను. అన్నమ్మయ్యని, రామదాసుని, త్యాగరాజుని ఒకేలా గౌరవిస్తాను. ఈ అభిమానంలో, ఈ గౌరవంలో ప్రాంతీయ ప్రసక్తి ముమ్మాటికీ లేదు. ఎవ్వరిని తలచుకున్నా నా గుండె ఒకేలా ఉప్పొంగుతుంది.

    ఇప్పుడు జరిగిన దారుణానికికూడా నేను తెలంగాణావాదులనో, సమైక్యాంధ్రవాదులనో తప్పుబట్టడం లేదు. ఇది తెలుగుజాతి మొత్తంగా చేసుకున్న దౌర్భాగ్యం. ఒకరిపై ఒకరు నిష్కారణంగా విషం జల్లుకుంటూ ఉంటే ఏమీ చెయ్యలేని అశక్తతతో ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకున్న నేనుకూడా దానికి బాధ్యుణ్ణే. ఈ టపా వ్యాఖ్యల్లో కూడా అలాంటిది మొదలయ్యింది. ఇకపై దాన్ని అంగీకరించను. తెలంగాణా/సమైక్యాంధ్రకి సంబంధించిన వ్యాఖ్యలు ఇకపై తొలగిస్తాను.

    ReplyDelete
  14. మేడ్‌మేక్స్ ఇన్స్టి్‌ట్యూట్లో రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసామని చంకలు కొట్టుకునే పోర్టారికో మూర్ఖులకు, నానో ఎదవలకు ఇది కనువిప్పు కావాలి.

    ReplyDelete
  15. పెదవి విప్పాలి సార్ విప్పాలి. నిలువుగా పదాలు రాసి కవిత్వమని మురిసిపోయే ఎదవలకు మీలాంటి సుకవులు బుద్ధిచెప్పాలి. ఫ్రశాంతంగా ధ్యానం చేసుకునే శివుడైనా, ప్రళయ కాలంలో రుద్రుడిగా మారలి.

    ReplyDelete
  16. "ఒకరిపై ఒకరు నిష్కారణంగా విషం జల్లుకుంటూ ఉంటే ఏమీ చెయ్యలేని అశక్తతతో ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకున్న నేనుకూడా దానికి బాధ్యుణ్ణే"..నిజం బాగా చెప్పారు. మనం అందరం దీనికి బాధ్యులమే!
    తెలుగువాళ్ల మధ్య ఇన్ని వైషమ్యాలు..తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది.
    ఈ తెలంగాణా గొడవలొచ్చేదాకా ఆంధ్రా వేరు..రాయలసీమ వేరు..తెలంగాణా వేరు అన్న ఆలోచనే చాలా మందిలో లేదు. అందరూ మన తెలుగు వాళ్లే అనుకున్నాం. రేపు రాష్ట్రం రెండుగా అయినా అక్కడా ఇక్కడా ఉన్నది..ఉండేది తెలుగువాళ్లే!
    వీలయితే ఇది ఒకసారి చూడండి.http://vareesh.blogspot.com/2011/03/blog-post_10.html

    ReplyDelete
  17. దయచేసి ఆవేశాన్ని మాటల్లో ఒలికించేప్పుడు కొంచెం సంయమనం పాటించాలని (ముఖ్యంగా అనానిమస్సులను) కోరుతున్నాను. అలా లేదనిపించిన వ్యాఖ్యలు కూడా తొలగిస్తాను.

    సిరిసిరిమువ్వగారు, తెలుగునాడులో ఏ ప్రాంతం వాళ్ళకి వాళ్ళవాళ్ళ ప్రత్యేక అస్తిత్వాలు ఎప్పుడూ ఉన్నాయి. అందులో సమస్య లేదు. ఇవన్నీ కలిసి తెలుగుజాతి అనే మరొక పెద్ద అస్తిత్వంలో భాగాలన్న స్పృహ అందరికీ ఉండాలి. అది పోయినప్పుడు, మరొకళ్ళ మీద ఆధిపత్యమో, విద్వేషమో చెలరేగి, ఇలాంటి దారుణాలకి దారితీస్తాయి. తమ అస్తిత్వానికి ప్రమాదం వస్తే ఎవరైనా పోరాడతారు. అయితే, ఇది వేరొకరి అస్తిత్వంపై ద్వేషంగాను, తమ సమష్టి అస్తిత్వాన్ని కూలదోసేదిగాను పరిణమించడం దురదృష్టకరం. దీనికి అందరూ బాధ్యత తీసుకోవలసినదే.

    ReplyDelete
  18. >>ఇది తెలుగుజాతి మొత్తంగా చేసుకున్న దౌర్భాగ్యం. ఒకరిపై ఒకరు నిష్కారణంగా విషం జల్లుకుంటూ ఉంటే ఏమీ చెయ్యలేని అశక్తతతో ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకున్న నేనుకూడా దానికి బాధ్యుణ్ణే.

    అవును. మనం కూడా గళం విప్పాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం సి.నా.రె. గారు అన్న కింద పంక్తులు గుర్తుకొచ్చాయి.

    గుండెలను కలిపి కుట్టే భాషా సూత్రంతో
    గొంతులకు ఉరులు పేనుతున్నారు
    సంప్రతింపులు విరిసే నీతి మండపాన్ని
    సంతలోకి దించేస్తున్నారు
    ఈ కొండ గోలలో – ఈ మొండి గోలలో
    సంగీతానికి చరమ స్థాయి
    గంగిరెద్దులవాని సన్నాయి
    వినేదెవ్వడు ఓహో అనేదెవ్వడు
    సంపాదక మహాశయా క్షమించాలి
    కలంలో కలకలం పెరిగింది
    జాతి గళం లో హాలాహలం మరిగింది
    అది ఉద్గీర్ణమైతే శ్మశానం రగులుతుంది
    జీర్ణమైతే కళ్యాణం మిగులుతుంది .

    How true?

    ReplyDelete
  19. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  20. చాలా బాగా చెప్పారండి.

    ఉరికే నాయకులను దుమ్మెత్తిపోసే మన బ్లాగర్లు, మనమెంతవరకు సహనం పాటిస్తున్నామో చూసుకోరు. చదువుకున్న మనమే ఇలా ఉంటే సాధారణ పౌరుల పరిస్థితేంటి? అందుకే ఈ విపరీతాలు.

    ReplyDelete
  21. ఆవేదన చక్కగా ధ్వనించిందండీ పద్యాలలో.

    ReplyDelete
  22. Good discussions. But please remember no telangana leader has ever preached hatred. Unity, togetherness, brotherhood have always been preached along with seperate telangana. Ilanti (vigraha dhwamsam) cheduru moduru samghatanu (thuntari valla) to jarugoo vuntaii...Anta matramu na chedda vaaramu kaadu.

    ReplyDelete