తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, November 27, 2011

కంకంటి కవిత్వం

ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్

ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించాడు పాపరాజు.

ఇంతకీ ఈ రోజు ఉత్తరరామాయణం ప్రసక్తి ఎందుకు తెచ్చానో యీపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును నేనుకూడా నిన్న శ్రీరామరాజ్యం సినిమా చూసేసాను, కుటుంబసపరివారసమేతంగా. నిక్కచ్చిగా నిర్మొహమాటంగా చెప్పాలంటే, సినిమా ఏదో ఫరవాలేదనిపించింది. జనాకర్షణ కోసం తీరి కూర్చొని సినిమాని చెడగొట్టలేదన్న తృప్తి ఒక్కటే మిగిలింది. బహుశా మొగుడులాంటి సినిమాలు రెండు మూడు చూసిన మీదట యీ సినిమా చూసుంటే యిది అద్భుతం అనిపించేదేమో! :) కాస్త బాగున్నవంటూ అనిపించినవి స్క్రీన్ ప్లే, కొన్నిచోట్ల సంభాషణలు. అంతే. మొదటి సీనులోనే ఒక చిన్న ఝలక్ - భరతుడు రాముని రంగులో లేడేమిటి అని. వాల్మీకి రామాయణంలో యిద్దరూ నీలమేఘశ్యాములే కదా! పౌరాణిక సినిమాల సంభాషణలు మామూలు వాడుక భాషకి ఎంత దగ్గరగా ఉన్నా, అవి సాంఘిక సినిమాలో సంభాషణల కన్నా చాలా తేడాగా ఉంటాయి. వాటిని పలకే ప్రత్యేక విధానమొకటి (దీన్నే "డిక్షన్" అంటారనుకుంటా ఇంగ్లీషులో) మన పాత సినిమావాళ్ళు ఏర్పరచారు. అది బాగా పట్టుబడితే కాని సినిమా రక్తికట్టదు. ఈ సినిమాలో అది పూర్తిగా లోపించింది. పాత పౌరాణికాలు చూడని యీ తరం వాళ్ళకి నచ్చి ఉంటుందేమో నాకు తెలియదు. నచ్చితే మంచిదే! లేదంటే తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన మరొక సాంస్కృతిక అంశం కాలగర్భంలో కలిసిపోయినట్టే. పౌరాణిక సినిమాలో పద్యాలు లేకపోవడమూ లోటే! అయితే ఈ సినిమాలో పద్యాలు లేవన్న బాధకన్నా, పద్యాలు పెట్టలేని స్థితి ఏర్పడిందే అని ఎక్కువ బాధగా ఉంది. ఒక్క తరంలో యింత తేడానా! ఈ కాలంలో పద్యాలు ఎవరికి అర్థమవుతాయి అని చాలామంది అంటున్నారు. కాని నా ఉద్దేశంలో సమస్య అర్థమవ్వడము కాకపోవడమూ కాదు. ఇంతకు ముందు మాత్రం సినిమాలో పద్యాలందరికీ అర్థమైపోయి ఆదరించారా? పద్యాలపైన యిష్టం అభిరుచి పోయింది. ఒక రకమైన విముఖత కూడా ఏర్పడింది. అదీ సమస్య! ఇది కాలానుగుణంగా వచ్చిన మార్పని కొందరు కొట్టిపారేస్తారు. కాలం మార్పుకి సూచకమే కాని మార్పుని తెచ్చేది కాదన్న విషయం ఎంతమంది ఆలోచిస్తున్నారు? మార్పు రెండు రకాలు. ఒకటి మనిషి ప్రమేయం లేనిది (
ప్రకృతి సహజం). రెండు మనిషి ప్రమేయమున్నది. కాలంతో జరిగే మార్పులన్నీ ప్రకృతి సహజంగా వచ్చేవి కావు. వచ్చే ప్రతి మార్పు మంచికే అన్న దురభిప్రాయమూ ఉంది. అదికూడా తప్పే. మన సంస్కృతిలో వస్తున్న యీ మార్పులు సహజమైనవా, వీటి ఫలితాలేమిటి అన్న ప్రశ్నలు వేసుకొని సమాధానం వెతుక్కోవలసిన అవసరం మనకి లేదా?

ఎక్కణ్ణుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను! మనిషి కోతినుండి పుట్టేడనడానికి యీ శాఖాచంక్రమణం ఒక బహుచక్కని తార్కాణం. :-) మళ్ళీ పాపరాజు దగ్గరకి వచ్చేద్దాం.

లక్ష్మణుడు చెప్పిన వార్త విన్న సీత పరిస్థితిని యిలా వర్ణించాడా కవి:

ఊరక వెక్కివెక్కి యేడ్చుచు, నేడుపు విడిచి మౌనంబు పూనుచు, మౌనంబు మాని తనలో దా నగుచు, నగవుడిగి తల యూచుచు, దల యూచుట విడిచి ముక్కుపై వ్రేలు గీలుగొలుపుచు, జాలిగొని హాహాకారంబు సలుపుచు, దలపని తలపులివిగో! చూచితే? లక్ష్మణా! యని యతని దిక్కు చూడ్కులు నిగిడించి యిట్లనియె:

అడలకు మన్న! నీకు వసుధాధిపునానతి దాట వచ్చునే?
యిడుముల జెందుమంచు విధి యీ ధర నన్ను సృజించి యుండగా
గడవగ నెవ్వరోపుదురు? కానల కేగిననాడె యాపదల్
గడచితి నంచు నుంటి; నెఱుగన్ దుది నిట్లగు నంచు నా మదిన్

కళవళమంది తెల్పితివొ? కాక పరాకున దప్ప వింటివో?
కల నయినన్ రఘూద్వహుడు కానలలో నను ద్రోయ బంచునే?
తెలిసి గణింపు లక్ష్మణ! మతిభ్రమ యైనదొ? హా! సహింపు మి
ప్పలుకు; లెఱుంగ కంటి; వెత బాటిలె; నీకొక భ్రాంతి యున్నదే!


కవి చిత్రించిన యీ దృశ్యానికి వ్యాఖ్యానమక్కరలేదు. కనులముందర కదలాడి కనులలో నీరు చేరక మానదు. లక్ష్మణా నీకు మతికాని భ్రమించ లేదు కదా అని, మళ్ళీ అంతలోనే, నన్ను క్షమించు, బాధలో అలా అన్నాను కాని నీకు భ్రాంతి కలగడమేమిటని మరింత శోకమగ్న అయిన జానకీదేవి యిలా అంటుంది:

ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును; నన్నిక రామచంద్రుడున్
గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణ మేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు; నాదు మే
నున్నది; చెంత గంగమడు గున్నది; యైనటు లయ్యెడున్ దుదిన్


రామునికి "చెవులారాగ" తన స్థితిని చెప్పమంది సీత. ఆమె మనసులోని ఉద్వేగమంతా ఆ ఒక్కమాటలో వ్యక్తం చేసాడు పాపరాజు! రాముడు తనని వదిలేసాడన్న బాధకన్నా, తనకి ఒక్కమాటకూడా చెప్పకుండా పంపించేసాడన్న బాధే సీత మనసుని ముక్కలుచేసింది.

ఎఱగని మూఢులాడుకొను నెగ్గులకున్ భయమంది, యప్పుడే
కఱకుమనంబుతో విభుడు కాననసీమకు బంచెగాక; య
త్తెఱ గొకసారి నన్ బిలచి, తెల్పి, మనోవ్యథ దీర్చి, నిన్ను నే
మఱనని బంపడయ్యె; నభిమానము గూర్మియు నెందుబోయెనో!



దీనికి రాముని దగ్గర సమాధానం లేదు!

కవిత్వంలో గొప్ప దర్శకత్వ ప్రతిభకి మచ్చుతునక అనిపించే పద్యమొకటి యీ సన్నివేశంలో చిత్రించాడు కంకంటి పాపరాజు. సీతని వదలి లక్ష్మణుడు రథమ్మీద తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ఆ రథాన్ని సీతాదేవి చూస్తున్న దృశ్యమది:

రమణి మఱికొంత వడిదాక రథము జూచు
దరుణి మఱికొంతసేపు కేతనము జూచు
గాంత మఱిమీద రథపరాగంబు జూచు
బడతి మఱియంతటను వట్టిబయలు సూచు



కొంతసేపలా వెళిపోతున్న రథాన్ని చూసింది సీత. ఆ తర్వాత కొంతసేపు రథంపైన ఎగురుతున్న జెండాని మాత్రమే చూడగలిగింది. ఆపైన కొంతసేపు రథం వెళ్ళేదారిలో ఎగిరిన దుమ్ము మాత్రమే చూస్తూ నిలుచుంది. ఆ తర్వాత కొంతసేపటికి వట్టి బయలుని మాత్రం చూస్తూ ఉండిపోయింది! ఉత్తమమైన కవిత్వానికి యీ పద్యమొక గొప్ప ఉదాహరణ! ఉత్తరరామాయణంలో యీ ఒక్క సన్నివేశంతో తెలుగు సాహిత్యంలో స్థిరస్థానాన్ని సంపాదించిన కవి కంకంటి పాపరాజు.

కొసమెరుపు: శ్రీరామరాజ్యం సినిమాలో ఆంగికం ఆహార్యం అన్నీ సరిగ్గా కుదిరాయని నాకనిపించిన ఒకే ఒక పాత్ర ఏమిటో చెప్పుకోండి చూద్దాం! సరే, ఒక చిన్న క్లూ.

60 comments:

  1. "ఇంతకుముందు మాత్రం పద్యాలందరికీ అర్థమయి ఆదరించారా?"
    మంచి మాట చెప్పారు. పద్యంలో పాపరాజు గారి పద్యాల్లో దృశ్యం ఆవిష్కృతమైనట్టు ఇంకోలా వస్తుందా?

    ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  2. చాలా రమణీయమైన ఘట్టాన్ని , అంతే సుందరం గా కనుల ముందు నిలిపారు . చివరి పద్యం రెండో పాదం లో మొదటి పదం ' తరుణి ' అనేమైనా ప్రారంభమవుతుందేమో - యతి కోసం !!!

    కంకంటి పాపరాజక
    లంకంబుగ కావ్యమల్లె లాక్షణికముగా ;
    పొంకముగ దద్విశేషము
    లుంకించుచు గూర్చు మీకు నొనరింతు నతుల్ !!!

    ReplyDelete
  3. :-) :-)

    నేనీ సినిమాని మొదట కొంచం తక్కువ అంచనాలతో చూశాను. రివ్యూలు చదివి మీ అంచనా పెరిగి ఉండచ్చు. మీరన్నట్టు మొగుణ్ణి చూసిన కళ్ళతో బాపు బొమ్మని చూస్తే అద్భుతం అనిపిస్తుందనుకోండి. అయినా నేను అల్పసంతోషిని కూడా. సవ్యంగా చిత్తశుద్ధితో వండిన వంటకంలో, అందులోనూ ప్రియమైన వంటకంలో, కొన్ని లోపాలున్నా పట్టించుకోను. ఒక మినిమమ్ స్టాండర్డ్ ని ఏమాత్రం దాటినా చాలా సంతోషిస్తాను.

    పద్యాలు లేకపోవడం నా మటుకు నాకు పెద్ద లోపమనిపించలేదు. బాపూ స్టైల్ లో పద్యాలకన్నా సరళమైన పాటలే ఉంటాయి. ఇక పద్యాల గురించి మీరు లేవనెత్తిన చర్చ మంచిది. దాని గురించి మీరు మరింతగా రాస్తే బాగుంటుంది.

    ఈ సినిమాలో మీరన్నట్టు చాలా సంభాషణల్లో డిక్షన్ లోపంగానే ఉంది. అసలు లోపాలంటూ లెక్కపెట్టడం మొదలుపెడితే చాలానే ఉన్నాయి, కానీ ఒక పావుగంట సినిమా అయ్యాక లోపాలన్నిటినీ పట్టించుకోడం మానేసి నేను ఆస్వాదించగలిగేను. అనేక సంవత్సరాల తర్వాత నేను చూసిన 'సవ్యమైన' తెలుగు సినిమా ఇదే కావడం ప్రధాన కారణం అనుకుంటా.

    అసలు మా కుటుంబం అంతా కలిసి హాయిగా మంచి సినిమా చూసి ఎన్నేళ్ళైంది? అని ఆలోచిస్తే నా హైస్కూలు దాటిన తర్వాత ఏమీ లేదని తేలింది. అందుకే ఈ సినిమా మాకు చాలా మధురమైన జ్ఞాపకంగా మిగిలింది.

    మీ కొసమెరుపు ప్రశ్నకి సమాధానం లక్ష్మణుడని తోస్తూంది. కాదంటే సీత కావచ్చు.

    ReplyDelete
  4. మందాకినిగారు, విష్ణునందన్ గారు, ధన్యవాదాలు.
    విష్ణునందన్‌గారు పొరపాటుని సరిదిద్దాను.

    నాగమురళిగారు, రెండు రకాల రివ్యూలూ చదవడం వల్ల నేను పెద్దగా ఆశలు పెట్టుకొని వెళ్ళలేదు.

    >> కానీ ఒక పావుగంట సినిమా అయ్యాక లోపాలన్నిటినీ పట్టించుకోడం మానేసి నేను ఆస్వాదించగలిగేను.

    మీరు అదృష్టవంతులు! :)

    కొసమెరుపు ప్రశ్నకి మీ ఊహలు సరికావు. :) అంత సులువుగా పోల్చుకోగలిగే దయితే నేనడుగుతానా! :)

    ReplyDelete
  5. బ్రహ్మానందం, ఝాన్సీల్లో ఒకరా?

    ReplyDelete
  6. వ్యంగ్యంగా కాదు, ఇవ్వాల్టికి ఉన్న నటీనటులతో తెలుగులో ఇంతకు మించి డిక్షన్ కానీ మరోటి కానీండి తెలుగు పౌరాణికం తీయగలరా? పాత తరంతో పోలిక చాలా అనవసరం ఇవ్వాల్టి తెలుగు ఉచ్ఛారణలు చూస్తే. అత్యంత కనా కష్టంగా గుడ్డిలో మెల్లగా బాపు రమణలు "ణ" లు, "ళ" లు పలిసించగలిగారు ప్రతి ఒక్కరితో. నాకు తెలిసి నేటి తెలుగు నటీనటులు ఈ అక్షరాలు పలకగలగటం ఎంతో గొప్ప.

    అయినా మీరు మరీ చిత్రంగా పద్యాల దాకా వెళ్ళిపోయారు. మీకు మరీ అత్యాశ సుమా :-) ఎంత భాష పైన మమకారం ఉన్నా నేటి తెలుగు వారిగా మీకిది తగదు :-)

    న బూతో న భవిష్యతి -- అచ్చుతప్పు కాదు, ఇదే జనాలు కోరుకునేది, నేటి తెలుగు సినిమాకి బూతు లేనిదే భవిష్యత్తు లేదు.

    ReplyDelete
  7. >>>>ఈ సినిమాలో పద్యాలు లేవన్న బాధకన్నా, పద్యాలు పెట్టలేని స్థితి ఏర్పడిందే అని ఎక్కువ బాధగా ఉంది. ఒక్క తరంలో యింత తేడానా! ఈ కాలంలో పద్యాలు ఎవరికి అర్థమవుతాయి అని చాలామంది అంటున్నారు. కాని నా ఉద్దేశంలో సమస్య అర్థమవ్వడము కాకపోవడమూ కాదు. ఇంతకు ముందు మాత్రం సినిమాలో పద్యాలందరికీ అర్థమైపోయి ఆదరించారా? పద్యాలపైన యిష్టం అభిరుచి పోయింది. ఒక రకమైన విముఖత కూడా ఏర్పడింది. అదీ సమస్య! ఇది కాలానుగుణంగా వచ్చిన మార్పని కొందరు కొట్టిపారేస్తారు. కాలం మార్పుకి సూచకమే కాని మార్పుని తెచ్చేది కాదన్న విషయం ఎంతమంది ఆలోచిస్తున్నారు? మార్పు రెండు రకాలు. ఒకటి మనిషి ప్రమేయం లేనిది (ప్రకృతి సహజం). రెండు మనిషి ప్రమేయమున్నది. కాలంతో జరిగే మార్పులన్నీ ప్రకృతి సహజంగా వచ్చేవి కావు. వచ్చే ప్రతి మార్పు మంచికే అన్న దురభిప్రాయమూ ఉంది. అదికూడా తప్పే. మన సంస్కృతిలో వస్తున్న యీ మార్పులు సహజమైనవా, వీటి ఫలితాలేమిటి అన్న ప్రశ్నలు వేసుకొని సమాధానం వెతుక్కోవలసిన అవసరం మనకి లేదా? >>>>

    సినిమా చూడగానే నాకు కలిగిన అభిప్రాయమే చెప్పారు . ధన్యవాదములు!
    మళ్లీ ఒకసారి పాత లవకుశ చూసి ఆనందించాను. ఈ ఒక్క సవరణతో ఇంకొక పౌరాణిక చిత్రం తీయకపోతారా! చక్కని ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తాం :)

    ReplyDelete
  8. నాగమురళిగారు, దటీస్ టూమచ్! :)

    విజయ్ గారు,

    >>ఇవ్వాల్టికి ఉన్న నటీనటులతో తెలుగులో ఇంతకు మించి డిక్షన్ కానీ మరోటి కానీండి తెలుగు పౌరాణికం తీయగలరా?

    ఏమో! తియ్యగలిస్తే మంచిదే కదా. తియ్యలేరేమో అనే నా బాధ కూడాను.

    >>పాత తరంతో పోలిక చాలా అనవసరం

    అవును అనవసరమే కాని దానికి అలవాటుపడ్డ నాలాంటి దురదృష్టవంతులకి పోలిక వద్దనుకున్నా వస్తుంది. అందుకే వాటికంతగా అలవాటుపడని కొత్త తరానికయినా యీ సినిమా నచ్చాలనే నేనూ కోరుకుంటున్నాను.

    >>ఎంత భాష పైన మమకారం ఉన్నా నేటి తెలుగు వారిగా మీకిది తగదు :-)

    ఏదో పాతకాలపు చాదస్తం లెద్దురూ! :-)

    ReplyDelete
  9. కొసమెరుపు : బాలకృష్ణ -- తిరుగులేదు

    ReplyDelete
  10. తెలుగు పౌరాణిక సినిమాలలో పద్యాలు లేక పోవడమా ! అందుకే సినిమాలు చూడక తెలుగు పద్యానికి వచ్చాను. ఏ మార్ప్రైనా ఒక్క తరములో వస్తుంది. మరల తెలుగు భాష పైనా పద్యాల పైన ఆదరణ పెరుగుతుంది అని ఆశిస్తున్నాను. కంకంటి పాపరాజు గారి పద్యాలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  11. నేను యీ సినిమాని చూడలేదు. కారణం? చూడలేను గనుక. బాపు తీసి యుండవచ్చు కాక. టి.విలో చూసిన క్లిప్పింగులకే నాకు చిరాకు నెత్తికెక్కింది. నా కవన్నీ పరమ నాసిరకంగా అనిపించాయి - అన్ని కోణాల్లోనించీ. మరొక పాతిక సంవత్సరాల తరువాత ఇదే కథని ఇంకెంత ఘోరంగా మన నటవారసుల వంశీకులు తీయించి జనం మీదికి వదులుతారో యింకా యెంతెంతమంది మేథావులు భళీ భళీ అని గంతులు వేయబోతారో తలుచుకోవటానికే నాకు కంపరంగా ఉంది. పాపం సీతారాముల కష్టాలకు అంతు లేదా? యిలా కలియుగంలో గొప్పగొప్ప వాళ్ళు పుట్టి వాళ్ళని యింకా చిత్రహింసలకు గురి చేయాలా?

    ReplyDelete
  12. మౌళిగారు,
    >>చక్కని ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తాం :)
    ప్రశ్న వెయ్యడం సులువే, సమాధానాలే కష్టం. ప్రశ్నంత చక్కని సమాధానం ఉందకపోవచ్చు కూడా :)

    అనానిమస్‌గారు,
    నేను అంతటి బాలకృష్ణ అభిమానిని కాదు! ఒకవేళ మీరయితే నన్ను క్షమించెయ్యండి, మీ ఊహ సరికాదు. :)

    నరసింహమూర్తిగారు,
    నిర్మాత దర్శకులు చేసిన సాహసానికి, శ్రమకి తప్పకుండా ఒకసారి చూడదగ్గ సినిమానే. పద్యాలు కావలిస్తే ఎలాగూ మన బ్లాగుండనే ఉంది కదా :)

    శ్యామలీయంగారు,
    మీకు నచ్చలేదు మీరు చూడలేదు. నచ్చినవాళ్ళు భళీ అంటే వారిపైన అసహనమెందుకు. వారిని మేధావులని ఎగతాళి చెయ్యడమెందుకు. లోకో భిన్న రుచిః అన్న సూక్తి మీకు తెలియంది కాదు కదా. మీకు పద్యాలమీద మంచి అభినివేశముంది కాబట్టి, పాపరాజు కవిత్వం గురించి మీకు తెలిసిన మరిన్ని విశేషాలు మాతో పంచుకోండి. అందరూ ఆనందిస్తారు.

    ReplyDelete
  13. కామేశ్వరరావు గారన్నది నిజమే. నచ్చినవారికి నచ్చనిద్దాం. నాకు నచ్చకపోతే పోనియ్యండి. అయితే, బాపు తీసారు కాబట్టి కొందరు వెంటబడి పొగడుతున్నారేమోనన్న అసహనం / అనుమానం వల్ల కాబోలు చిరాకు పడుతున్నాను.

    కంకంటి పాపరాజుగారి పద్యభాగం 'సీతాపరిత్యాగం' పేరుతో కాబోలు మా పాఠ్యాంశంగా ఉండేది. అప్పుడే ఆయన పద్యాల పైన మంచి అభిమానం యేర్పడింది. లవకుశ సినిమావాళ్ళు ఆయన పేరు చెప్పకుండానే ఆయన పద్యాలు వాడుకున్నట్లు నాకు గుర్తు.

    ReplyDelete
  14. >>లవకుశ సినిమావాళ్ళు ఆయన పేరు చెప్పకుండానే ఆయన పద్యాలు వాడుకున్నట్లు నాకు గుర్తు.
    లేదండి. కంకంటి పాపరాజు, దువ్వూరిరామిరెడ్డి గార్ల పద్యాలు ఉపయోగించుకున్నట్టు టైటిల్సులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

    ReplyDelete
  15. *మరొక పాతిక సంవత్సరాల తరువాత ఇదే కథని ఇంకెంత ఘోరంగా మన నటవారసుల వంశీకులు తీయించి జనం మీదికి వదులుతారో*

    భవిషత్ గురించి మీరంత భయపడవలసిన అవసరంలేదండి. ఇప్పటికే సినేమా థియేటర్లు అన్ని ఊర్లలో మాయ మౌతున్నాయి! అప్పటికి సినేమా అనేది ఉంట్టుందని కూడ చెప్పలేము. ఒక వేళ ఉండి నట వారసులు ఉన్నా, తీయటానికి దర్శకులు ఉండరని తెలుసుకోండి.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. పోస్టుకి సంబంధం లేదని నాకనిపించిన వ్యాఖ్యలని తొలగిస్తాను. పై వ్యాఖ్య అలా అనిపించి తొలగించాను.

    ReplyDelete
  18. కటకట లక్ష్మణా పిడుగు కంటెను బెట్టిద మైన మాట....
    ఈ పైపద్యం కూడా అప్పటి రోజుల్లో కంఠోపాఠంగా ఉండేది. ఇప్పుడు సరిగా గుర్తుకు రావటంలేదు. కంకంటివారి రచన హైదరాబాదులో ఎక్కడ లభిస్తుందో యెవరికైనా తెలిస్తే చెప్పవలసిందిగా విన్నపం.

    ReplyDelete
  19. కొసమెరుపు: శ్రీరామరాజ్యం సినిమాలో ఆంగికం ఆహార్యం అన్నీ సరిగ్గా కుదిరాయని నాకనిపించిన ఒకే ఒక పాత్ర ఏమిటో చెప్పుకోండి చూద్దాం! సరే, ఒక చిన్న క్లూ.
    ===
    ఆంజనేయస్వామి పాత్రే అయ్యుంటుంది. కరెక్టేనా కామేశ్వరరావు గారు.

    ReplyDelete
  20. కామేశ్వర రావుగారు,

    మంచి కవినీ, మంచి పద్యాలనీ పరిచయం చేశారు, ధన్యవాదాలు.

    షాపులో ఎన్నో గ్రీటింగు కార్డులుండగా ఒక్కటే మాత్రమే మనకి బాగా నచ్చుతుంది. మన మనసులోని మాటనే చెప్పినట్టుగా ఉన్న కార్డుచూస్తే... హా.. ఇదేకదా మన భావం .. ఎంతబాగా చెప్పాడో కదా అని అనిపిస్తుంది ఈ పద్యాలు చదువుతున్నప్పుడు నాక్కలిగిన భావన కూడా అట్లానే ఉన్నది.

    లవకుశ సినిమా అప్పటి నుండీ ఇప్పటి శ్రీరామ రాజ్యం తో కలిపి ఆ ప్రశ్నకి సమాధానం దొరకనట్టే ఉంది. కామేశ్వర రావుగారు కూడా తెలివిగా రాముడి దగ్గర సమాధానం లేదు అని రాసేశారు. సీత అగ్నిప్రవేశంలో ఉన్న ధర్మ సందేహాలే ఉత్తర రామచరితంలోనూ కొనసాగాయనిపిస్తుంది.

    ఉత్తర రామాయణం లోని రహస్యాలని, రాముడి అంతర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నా ఈ ప్రశ్నలు

    (1)రాముడు చాకలివాని మాటలకు బాధనొంది సీతాదేవిని పరిత్యజించ తలచినచో సీతకావిషయం ఎందువలన తెలియజేయలేదు? చివరిగా ఒక్క మాటైనా మాటాకుండా లక్ష్మణునితో పంపించవలసిన రాజధర్మమేమున్నది? తాను రాజైనందు తన ధర్మ పత్నికి దండనా? అదీ న్యాయాన్యాయాలు, విచారణ లేకుండా శాసనమేనా? అదేనా రాముడు స్థాపించదలచుకున్న రాజ ధర్మం? పోనీ విచారణలేదనుకొందము. కనీసం తప్పొనరించినవానికి ధర్మమూర్తి తానిచ్చిన తీర్పు తెలియజేయవలసిన బాధ్యత యున్నది కదా...దానినుండి విముఖతనొందుటకు కారణమేమయి ఉండవచ్చును? అంతటి బాధాకరమైన విషయము చెప్పుటకు ధైర్యము చాలకుండెనా? తాను జెప్పక తన తమ్ముని జెప్పమనుట ఏమి భావ్యము?

    (2) పరాయి ఇంటనున్న సీతను తెచ్చుకొనినాడన్న చాకలివాని అపవాదు రామునిపైననే. సీతను పరిత్యజించుటవలన, అప్పుడు తెచ్చియుండచ్చుగాక, కనీసం ఇప్పుడు కనులు తెరచికొని వదలివేసినాడనిపించుకొనుటకా ? ఆ అపవాదుకు ఈ ప్రతిక్రియ గుడ్డిలో మెల్ల అన్నచందముగా పరిగణింపబడుటకా?

    (3) ఆడుదానిజంపరాదని ఎఱిగినవాడు విశ్వామిత్రుడు సూచించగా తాటకిని వధించుసమయమున లోకకంటకులు స్తీపురుషులలో ఎవరైనానూ వధ్యులే అని నిర్ణయించుకోగలిగినవాడు లోకులేమన్ననూ తన ధర్మము తాను నిష్కల్మషముగా నిర్వర్తిచుచుంటినను నిర్ణయమేల తేసికొనలేదు? అగ్నిపునీతాయిన సీతపై అపవాదురాగా ఆమెను, అందునా నిండు గర్భీణిని ఏల పరిత్యజించెను? తన రాజ్యమందు తన ధర్మపత్ని ప్రజలలో ఒకరుగాదా? ధర్మపరిపాలన రాజుగానేగానీ భర్తగా కాదా?

    (2) తాగిన మైకంలో చాకలివాడన్న మాటలకే రాముడు సీతాదేవిని త్యజించాడా? ఆ చాకలివాడే ఇంకోసారి తాగిన మైకంలో నేనన్న మాటలకే రాముడు సీతాదేవిని వదిలేశాడు. రాజ్యాన్ని పాలించే రాజు ఏ మాటలకు, ఎప్పుడు, ఎంత ప్రాధాన్యత నివ్వాలో తెలియని వాడా? రాజ్యంలో ఆయనకు ఉచితానుచితాలు సూచించ గలిగే వశిష్ఠాది ఋషులు లేరా? వారి అందరి సువాక్యాలకన్నా నావంటి మత్తుగొన్న వాని మాటలు రామునికి మిన్న అయినవా? అని అడిగి ఉంటే ఏమయ్యుండేది? (కాల్పనిక ప్రశ్నే. కాదనను. సమాధానం తెలియజేయగలరా..)

    ReplyDelete
  21. చాలా చక్కటిపద్యాలను పరిచయం చేసారు.కృతజ్ఞతలు.బాపూ రమణల అభిమానినే ఐనా రామరాజ్యం ఇంకా చూడలేదు.వారు తీసిన సినిమాలలో చాలా వాటిని వారు తీసి ఉండక పోయుంటే బాగుండేదనిపిస్తుంది.శ్రీ నాధుడు వాటిల్లో ఒకటి.
    మంచి మంచి పద్యాలను మరిన్నిటిని పరిచయం చేయండి.

    ReplyDelete
  22. అనానిమస్ గారూ !!

    >>ఒక వేళ ఉండి నట వారసులు ఉన్నా, తీయటానికి దర్శకులు ఉండరని తెలుసుకోండి.
    ఒకవేళ దర్శకులు ధైర్యంచేసి ముందుకు వచ్చినా నిర్మాతలు మాత్రం దుర్భిణి వేసినా దొరకనే దొరకరు. ఎందుకంటే అటువంటి పౌరాణిక చిత్రాలు చూసే ప్రేక్షకులూ, కొనే బయ్యర్లూ, ఆడించటానికి థియేటర్లు దొరకనప్పుడు ఏ నిర్మాత మాత్రం డభ్భు పెట్టి సినిమాను నిర్మించి చేతులు కాల్చుకుంటాడు (దూకుడు లో కనీసం 2 శాతం కూడా కలెక్షన్లు లేవీ సినిమాకి)

    ReplyDelete
  23. అసలు ఉత్తర రామాయణమే కాల్పనికమంటారు. ఇక, దాని ఆధారంగా సీతారాముల గుణగణాలు బేరీజు వేసుకోవటం ఏమిటి. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడో విషయం. మనకు పరిచయం ఉన్న ఉత్తర రామాయణంలో చాకలివాడు అన్న మాటకి రాముడు సీతను వదిలేసినట్లుగా కధ ఉంటుంది. కొన్ని జైన కధల ప్రకారం, పట్టాభిషేకానంతరం ఓసారి శూర్పణఖ (మరి కొన్ని కధల్లో మంధర మాటలు విని కైకేయి కుమార్తెలు) మారువేషంలొ అయోధ్యకు వచ్చి సీతను రావణాసురుడి బొమ్మ వేయమంటుంది. దానికి సీతాదేవి తాను రావనుడిని తండ్రిగానే భావించానని, పాదలను మాత్రమే వేయగలనని చెప్పి పాద చిత్రీకరణ చేస్తుంది. తన మాయాజాలంతో శూర్పణఖ ఆ చిత్రాన్ని పూర్తిచేసి సీతారాముల శయ్యాగారంలో ఉంచుతుంది. ఆ చిత్రాన్ని చూసి రాముడు సీతాదేవిని అనుమానిస్తాడట! ఈ కధ ఆరుద్రగారు వ్రాసిన "సీత రాముడికి ఏమౌతుంది" అన్న పుస్తకంలో చదివినట్లు గుర్తు.

    ReplyDelete
  24. సాయికిరణ్ గారూ, యీకథ నేనూ చదివాను. తమాషా జానపద కథ.
    మనం సాంప్రదాయికంగా రామాయణభారతాలను ఇతిహాసములని పిలుస్తాము. ఆ మాటకు అర్ధం. నిజంగా జరిగిని వృత్తాంతము అని. వాల్మీకి వ్యాసులు వీటిలో వ్యక్తులు. మనం వీరిని పాత్రలు అనరాదు. ఆ వృత్తాంతాలు జరిగినప్పుడు వారు వాటి యందు ప్రత్యక్షసాక్షులైన వ్యక్తులు. వారు లిఖించినది మాత్రమే ప్రామాణికమైనది. ఆ తరువాత కాలాల్లో కొందరు దురుద్దేశాలతో సొంతకల్పనలు చేసి ఇతిహాసాలకు రంగులు పులిమితే మనం గందరగోళ పడటం అనవసరం. కాదూ, ఇతిహాసాలు కాల్పనిక సాహిత్యం అంటారా? శాంతం పాపం. పోనీ, వాదన కోసం చూసినా, కాల్పనిక సాహిత్యం అయితే ఒకరు వ్రాసినది మరొకరు మార్చి నాదే సరయినది అని వాదించటం కేవలం పిచ్చిపని. అలాంటి అధికారం యెలా వస్తుంది ? ఎక్కడి నుండి వస్తుంది?

    ReplyDelete
  25. సాయి కిరణ్ గారూ !

    ఉత్తరరామ చరితం కాల్పనిక కథే అయ్యుండచ్చుగాక.. రాముడి గుణగణాలను దానిద్వారా బేరీజు వేద్దామనుకోవటంలేదు. ఆ కథాపరంగా రాముడి ఆంతర్యం ఏమిటన్నది కథా చిత్రీకరణనుండీ తెలుసుకోగలమా అన్నది నా ప్రశ్న. భవభూతి అంతటివాడు కథను పకడ్బందీగా రచించకుండా వదిలి ఉండడుకదా... గ్రంథ గ్రంథులు తెలిస్తేనే కవి ఆంతర్యం బోధపడుతుంది కదా... (reading in between lines). అందుకే అగ్ని ప్రవేశమైనా సీతా పరిత్యాగమైనా అని నా వ్యాఖ్యలోనన్నది.

    ReplyDelete
  26. భవభూతి ఉత్తరరామచరత్రను వ్రాసి 'ఏకో రసః కరుణ ఏవ' అని నిరూపించాడంటారు. అది చదువుతూ కంట తడి పెట్టుకోకపోవటం అసాధ్యం. నేను ఈ పుస్తకాన్ని చాలా చిన్నప్పుడే చదివాను. మహమ్మదు ఖాసింఖాన్ అని ఒకాయన చిన్నపిల్లలకోసం యీ నాటకాన్ని తెలుగులో అనువదించారు. గుండెలకు హత్తుకు పోయేలా సరళసుందరమైన తెలుగులో. భవభూతి కథలో వాల్మీకీ ఉంటాడు. భవభూతి రామాయణ పాత్రలచిత్రణలో వాల్మీకానికి అపచారం కలగకుండా జాగ్రత్తపడ్డాడు. లవకుశ సినిమా కథ వాల్లీకానికి దగ్గర - భవభూతి కథకు కాదు. శ్రీపతి గారి ప్రశ్నలు చూద్దాం.

    రాముడికి రాజధర్మం, పతిధర్మం వగైరా తెలియవనుకుంటే చేయగలిగినది లేదు. తెలుసుననుకుంటే ఆయన అలా యెందుకు చేయవలసి వచ్చినదో ఆలోచించాలి. సీత అయోధ్యను వదలి పోవలసిన పరిస్థితి. ఆమెకి ముందే తెలిసి గుండె ఆగి మరణించితే, జానపదులకు రాముడు చెప్పే ఆమాట మాత్రం నమ్మకం కలిగిస్తుందా? అపవాదుకు భయపడి రాజు భార్యను కడతేర్చాడంటారా? మీరే చెప్పండి? తీర్పు చెప్పినది రాజుగా. సీత భర్తగా కాదు. రాజాజ్ఞను నిందితులకు రాజే చెప్పాలని లేదు. శ్రీరాముడు 60వేల సంవత్సరాలు రాజ్యం చేసాడు. వాల్మీకం ప్రకారం. సీతాపహరణం సీతకు 40ఏళ్ళ ప్రాయంలో జరిగిన కథ. ఎన్నడో 60వేల ఏళ్ళ క్రిందటి సంగతి, అదీ వేరెక్కడో జరిగిన సంగతిని ప్రజలలో ఆనాటి కొత్త తరాలవాళ్ళకు నమ్మశక్యం కాకపోతే వింతలేదు. పైగా సీతమ్మవారి అగ్నిప్రవేశఘట్టం కూడా జరగింది లంకలో - అయోధ్యలో కాదు. రావణుడిని రాముడు చంపాడంటే సీతనెత్తుక పోయినందుకు చంపాడు. వాడి బలపరాక్రమాలగురించి రామాయణకావ్యం తప్ప అయోధ్యావాసులకు కూడా యేమీ తెలియదు. తెలిసిన దశరధుడు లేడు కదా యీ నాడు?

    క్రమంగా చెవులు కొరుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగి ఉండవచ్చు. రాజభయం - రాముడెంత సరసుడైనా సరే - వాళ్ళని నోరెత్త నీయలేదు. అందుకే అది చివరకు ఒక తాగిన వాడి మాటలలో బయటపడింది. ప్రజల మనస్సులలోంచి 'తమ రాజు రాముడు విమోహి' అన్న శంకను తొలగించటం ఆ సింహాసనంపైనున్న రాజుగా రాముని ధర్మం. కళంకం రాముడనే వ్యక్తకి వచ్చిందనుకోకండి. అది రాజ పదానికే, రాజవంశానికే కళంకం. అందుచేత రాముడికి వ్యక్తిగా కాక రాజుగానే నిర్ణయం తీసుకొనవలసిన పరిస్థితి. తన ధర్మపత్ని ప్రజలలో ఒకతె. కాని నిందితురాలు. స్వజనం అని శిక్షించకుండా రాజు ఉపేక్షించరాదు కదా? ఇది జరిగాక సీతారాముడి జీవితం క్షణక్షణనరకం. పరమదయనీయం. కేవలం యాంత్రికంగా జీవింవినాడు.

    ఎవడో తాగిన వాని మాట పాటిచేసేదేమిటి? సుమంత వశిష్ఠాది మహనీయులను రావించి కర్తవ్యం అడుగవచ్చుకదా? ఇక్కడ ధర్మసంశయం మనకు మాత్రమే ఉంది, కర్తవ్యం రాజారాముని ముందు సుస్పష్టంగానే ఉంది. పోనీ వారేమి చెప్పియుండేవారు? వంకపెట్టి నిందను ప్రక్కకు నెట్టి యేమీ జరుగలేదనుకోమనేవారా? చాకలి వాడిని శిక్షిస్తే - ఇప్పుడు జనం బాహాటంగానే అంటారు తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికా అని. పోనీ వాడిని వదిలిపెట్టి వషయం ఉపేక్షిస్తే, జనం మళ్ళీ బాహాటంగానే అంటారు - ఇప్పుడు ధైర్యంగా- సీత మీద అనుమానం మాకని. అప్పడు రాముడు యేమి చేయాలండి? రాజుకి రాజపదవీప్రతిష్ట, రాజ్యప్రతిష్ట, రాజవంశప్రతిష్ట తరువాతే మరేదయినా. కాదంటారా? సీతను వదలి పెట్టాలి. లేదా సీతతోడిదే జీవితం అని రాజ్యం వదలి పెట్టాలి. సీత అతని సొత్తు. రాజ్యం అతని సొత్తు కాదు. సీతను వదలగలడు తప్పో ఒప్పో. రాజ్యాన్ని వదిలేందుకు రాజారాముడిక యేమీ అధికారం లేదు. అతడు అయోధ్యా రాజ్య సింహాసనానికి బధ్ధుడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన బాధ్యతను నెరవేర్చి తరువాతి తరానికి అందించటం అనేదానిలో నాడు బాధ్యతే కాని హక్కు లేనేలేదు. మరొక దారిలేక సీతను పోగొట్టుకొని మరొక వేయేళ్ళు అంతులేని దుఃఖంతో గడిపాడు. లవకుశులు త్వరలోనే లభించారు. కాని సీతలేదు. సీతలేని రాముడు కేవలం ప్రాణమున్నబొమ్మ.

    ReplyDelete
  27. మరొక ముఖ్యమైన మాట వ్రాయ మరచాను. శ్రీమద్రామాయణంలో ఒకచోట వాల్మీకి మహర్షి అంటాడు "సీతాయా శ్చరితం మహత్" అని. అంటే రామాయణం అనేది "సీతాదేవి యొక్క మహత్తరమైన చరిత్ర సుమా" అని. ఆయనకు రాముడిమీద గొప్ప గౌరవం కావచ్చు. కాని సీతమ్మకు ఆయన సంపూర్ణభక్తుడు.

    మనం రామాయణాన్ని సరిగా చదవటానికి ప్రయత్నించాలని నా అభిప్రాయం. రావణవధానంతరం తనముందుకు తోడ్కొని రాబడిన సీతతో రాముడేమన్నాడో వినండి: "ఓ సీతా, నేత్రరోగి వెలుగును చూడలేకపోతున్నట్లు, నిన్ను నేను చూడలేకుండా ఉన్నాను" సీత గురించి మనం రాముడికంటే యెక్కువ తెలిసిన వారమా?

    ReplyDelete
  28. శ్యామలీయం గారూ !!

    >> తన ధర్మపత్ని ప్రజలలో ఒకతె. కాని నిందితురాలు. స్వజనం అని శిక్షించకుండా రాజు ఉపేక్షించరాదు కదా?
    (1) సీత అభియోగం మోపబడినదే గానీ నిందితురాలు కాదేమో?
    (2) అపహరించినది రావణుడు. సీత తనంత తానుగా లంకకు వెళ్ళలేదు.
    (3) అగ్నిప్రవేశం సమయానికి రాముడన్నది (నాకు తెలిసినంత వరకూ) "నీవిక స్వేచ్చాజీవివి. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి జీవించవచ్చు" అని.

    >> రాజపదవీప్రతిష్ట, రాజ్యప్రతిష్ట, రాజవంశప్రతిష్ట తరువాతే మరేదయినా. కాదంటారా? నాదృష్టి లో రాముడికి ధర్మం తరువాతే వంశమూ, రాజ్యమూ, పరువూ, ప్రతిష్ఠ. ఎక్కడికో అపహరింపబడిన స్త్రీ (తన ధర్మ పత్ని కాకపోయినా) విషయంలో ఎత్తుకెళ్ళబడడం తప్పు అని నా దృష్టిలో రాముడు భావించను గాక భావించడు. ఆవిడ ఎక్కడున్నదీ తెలుసుకొని, అక్కడనుండీ విడిపించటానికి సర్వ శక్తి సమర్థుడైన తనకే దాదాపు సంవత్సరం పట్టేస్తే ఆ ఎత్తుకెళ్ళబడిన అబల తనంత తానుగా బంధవిమోచన కలిగించుకుని వచ్చేయాలన్నది అతని అభిమతమూ కాదు. ఇన్నాళ్ళు విడిగా జీవించిన తరువాత , రావణుడి భోగభాగ్యాలపై కించిత్తైనా మోహం గనుక ఏ మూలనో కలిగి ఉన్నట్టైతే ఆమెకి తనతో బలవంతముగా రావలసిన అవసరం కలగకూడదు, ఆమె స్వేచ్చగా నిర్ణయం తీసుకొనచ్చు అన్నది అతని ఆలోచన. ఆ మాటను భరించలేక సీత ప్రాయోపవేశాన్ని కోరుకున్నది. విధి వశాత్తు భార్యాభర్తలిరువురూ విడివిడిగా ఒక సంవత్సర కాలం గడపవలసి వచ్చింది. దానికి సీతని నిందితురాలిని చేయటమేమిటి? అందులో ఆవిడ నేరమేమిటి? ఈ సన్నివేశంలో నిజానికి నేరం అని దేనినైనా పరిగణించాలంటే అది రావణుని చెఱలోనున్న సీతను తీసుకుని రావడం అనే నేరం రాముడిదే. నన్ను తీసుకెళ్ళి ఏలుకో అని సీత ప్రాధేయ పడలేదు. నీవు అనుమానించిన, అవమానించిన బ్రతుకు నాకు వద్దు, ప్రాయోపవేశం చేస్తానని అన్నంతపనీ చేస్తే అగ్నిదేవుడొచ్చి సీత అగ్నిపునీత అన్నాడు. రాముడు అగ్నిపునీతవుకమ్మని తన రాజ్యంలోని స్త్రీగా గానీ, తన భార్యగా గానీ భావించి సీతను ఆదేశించలేదు. అది రాముడి ధర్మ స్వరూపం. తప్పుచేయని వారిని రాముడు శిక్షించే అవకాశమే లేదు.

    అట్లాంటి రాముడు ఉత్తర రామ చరితంలో అట్లా ఎందుకు చేయవలసి వచ్చింది అన్నది జిజ్ఞాసతో కూడిన ప్రశ్న

    >>సీత గురించి మనం రాముడికంటే యెక్కువ తెలిసిన వారమా?
    చర్చించేది తెలియనిదానిని కొంచం కొంచముగా తెలుసుకుందామనే గానీ ఎదో తెలిసెసిందన్న ఉద్దేశంతో కాదు. ఎంత తెలిసినా తెలియవలసింది ఇంకా ఎంతో ఉంటూనేఉంటుంది. బిందువు బిందువును జేర్చి సిందువును అర్థం చేసుకునే ప్రయత్నమే.

    ReplyDelete
  29. చాలా బాగుందండీ వ్యాసం.
    కొసమెరుపు ప్రశ్నకు : మాటలాడేందుకు అవకాశమే ఇవ్వబడని ఋష్యశృంగుడు కాదు కదా! :)

    ReplyDelete
  30. నిందితురాలు అన్నమాటకు నిందమోపబడిన స్త్రీ అనే అర్ధం. తప్పు చేసిన స్త్రీ అని కాదు. అపహరించినది రావణుడే, తనంత లంకకు వెళ్ళినది అని నేననలేదే! రాముడు, సీతతో, మీరన్నట్లు నీవు స్వేఛ్ఛగా యిచ్చవచ్చిన చోటికి పోవచ్చును అన్నది నిజమే. అలాగే నేను ముందు చెప్పినట్లుగా తాను నేత్రరోగి వెలుగునువలె సీతను చూడలేకపోతున్నానన్నది కూడా నిజమే. సీత నేరం చేసిందని లేదా చేసిఉంటుందేమోనని నేనంటున్నానా? లేదే! 60వేల సం. కాలం తరువాత, కొత్త తరాలప్రజలలో కొందరు సంశయాత్ములు బయలుదేరినారన్నదే నా మాట. రానణచెరనుండి సీతను విడిపించిన రాముడుదోషి అనే వాళ్ళతో నేను వాదించను. వారికి రామాయణంతో పనిలేదు - తప్పులు వెదకటమే పని. వారికో నమస్కారం. సీతకు రావణవైభవం పూచికపుల్లకన్నా హీనం అన్నసంగతి రాముడికి తెలుసు, హనుమ దానిని స్వయంగా చూచి సర్వులకూ విశదపరచాడు కూడా. మీరన్నట్లు అగ్నిప్రవేశనిర్ణయం స్వయంగా సీతదే. రాముడు రుద్దినది కాదు. రాముడు సీతను త్యజించవలసిన దుఃస్థతికి కారణం ముందే వివరించాను, నాకు తెలిసినంత వరకు. సీతారాములకి అభేదం. ఒకరిగురించి ఒకరికి క్షుణ్క్షంగా తెలుసు. సీత పరిత్యాగానికి గురియైనందుకు హృదయవిదారకంగా వగచినదే కాని, రాముడు చేసిన నిర్ణయం తప్పు అని అనలేదని గమనించాలి. కాలప్రభావం వలన గలిగిన ఆపదగానే గ్రహించినది కాని, రాముడి కేదో దురుద్దేశ్యం ఉందనో, రాముడికి ధర్మనిర్ణయం చేయటం చేతకాలేదనో ఆక్షేపించలేదు. చివరికి దీనిని గ్రంధస్తం చేసిన వాల్మీకి కూడా అలాంటి మాట అనలేదు.

    ReplyDelete
  31. ఈ వాదోప వాదాలు చిన్నప్పటి నుంచి వింటున్నవే.సీతారాములను లక్ష్మీ నారాయణుల అవతారంగా భావించని వాళ్ళకి రామాయణపరమార్థం అర్థం కాదు.మేరీమాత కన్యాత్వం నమ్మని వారు క్రైస్తవులు కాలేరు.అలాగే ఇదీ.ఇక
    సినిమా గురించి;ఈ రోజుల్లో తీసే సాహసాన్ని అభినందించాలి.పాత సినిమా తో పోల్చకుండా చూస్తే పరవాలెదనిపించింది.సినిమా కి బాధ్యులైన వాళ్ళ ని ప్రోత్స హిద్దాము. ఇంకొక మాట.వేల సంవత్సరాల క్రితం జరిగిందన్న కథ ని ఇప్పటి దృక్ పథంతో norms and valuestoe పరిశీలించడం కష్టం.

    ReplyDelete
  32. టపాకి సంబంధించి కాక వ్యాఖ్యలలో వాదనకి సపందిస్తున్నాను మన్నించగలరు. నా ఆలోచనకు పదును పెట్టుకుంటున్నాను. కరుణ రస ప్రధానమైన ఈ కథ గురించి ఆలోచిస్తూ సమాజంలో పాతుకుపోయిన ఆలోచనా ధోరణులు, వాదనన్లలో స్పష్టం కాని విషయాలూ, రెండు వైపులా ఎవరి ధోరణులను వారే బలపరుచుకుంటూ వాదించడం సాగుతూ ఉంటుంది ఎప్పుడూ అనిపించి, నా ఆలోచనలో ఐనా కాస్త స్పష్టత ఏర్పడుతుందేమో అన్న ఆశతో అప్పుడప్పుడూ ఇలా వ్రాస్తుంటాను.
    ఇది నిజమే. నేనూ ఈ మాటే అంటూ ఉన్నా, శ్రీ రాముడికి సీతాదేవి మీద ఉన్న అనురాగాన్ని గురించి నాకు అర్థమైనంతలో అనుమానం లేకున్నా, నన్ను లవకుశల కథ విషయంలో బాధ పెట్టేది ఏమిటా అన్నది ఇప్పటికి వ్యక్తీకరించగలనేమో అని ఒక ప్రయత్నం. ముందుగా ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన కథే ఐనా, ఎవరైనా ఎందుకు అనే ప్రశ్న అడిగితే ఆ విషయం మాట్లాడుతారు కానీ అదే విషయాన్ని స్త్రీల ధర్మాల గురించి నొక్కి వక్కాణించేటప్పుడు ఎందుకు అర్థం చేసుకోరు అని. శ్రీ రాముడి ఏకపత్నీ వ్రతానికి లవకుశల కథ ఒక నిదర్శనం. ఆయన సీతను అడవులకు పంపినా మళ్ళీ వేద ధర్మం కోసం కూడా ఇంకో పెళ్ళి చేసుకోలేదు. ఆ నిబద్ధతను గురించి కాకుండా ఆయన వదిలి వెయ్యడాన్ని గురించే మాట్ళాడతాము. ఎందువలన? చాకలి వాడు భార్యను ఇంటికి రానివ్వకపోవడం, సీతాదేవి గురించి అచవాకులు వాగడం, శ్రీరాముడు సీతాదేవిని అడవికి పంపడం. అంటే ఏమిటి? స్త్రీ నిస్సహాయ స్థితిలో ఇంకొకరి ఇంట్లో ఉండవలసి వస్తే అది తప్పా? దానిని శ్రీ రాముడు సమర్థించాడా? సరే సమర్థించాడు. ఆ తర్వాత ఆయన విలాసంగా జీవించాడా? లేదు కదా? అది highlight చెయ్యం మనం. ధర్మ పన్నాలు స్త్రీల ప్రవర్తన గురించే మాట్లాడతాము. స్వయంగా దేవుడే ఆచరించినా ఆ విలువలని మగవారికి అన్వయించం. ఎందు వలన? అది ఇక్కడ ప్రశ్న. ఈ తరం వారు అడిగే ప్రశ్న. అది అడగగానే శ్రీ రాముడంటే తక్కువ చెసినట్టు అర్థం చేసుకుంటారు. సీతా దేవి ఎందుకు శ్రీరాముడి వద్దకు వెళ్ళలేదు? దాని గురించి మాట్ళాడం మనం. సీతా దేవిని త్యాగం చెయ్యడం శ్రీ రాముడికి ఎందుకు కష్టం అయ్యింది? అదీ ఎక్కువ వాదననలలోకి రాదు. ఆమెని ఎంతగా ప్రేమించాడో కనుక ఆయనకి కష్టం. కానీ ఆయన పేరు, పురాణ పురుషుల గాథలు, ధర్మ శాస్త్రాల అపేరుతో స్త్రీలని అవమానించే వారికి ఆ శ్రీరాముని ప్రేమ అర్థమయ్యే ఉంటుందా? ఆ చాకలి వాడినే ఆ కాలంలోనే తీసుకుంటే అతనికి అర్థం అయ్యి ఉంటుందా? ఇదంతా శ్రీ రాముడు సీతాదేవిని వదిలెయ్యడానికైనా లవకుశులను తన పుత్రులుగా స్వీకరించినా ఏ వివరణ లేకపోవడమే. శ్రీ రాముడు లవకుశులని కొడుకులుగా ఒప్పుకున్న వాడు సీతా దేవిని బేషరతుగా ఎందుకు తిరిగి అంగీకరించలేదు? అసలు గ్రంథంలో ఉందా? తెలియదు. తెలిసిన వారు చెప్తారా? లేదు. చాకలి వాడి మాటలకు సమాధానం చెప్పడం అంటే సీతను అడవులకు పంపడంలో కాదు, సీతా వియోగాన్ని భరించడంలో, అది ఆదర్శమని చూపడంలో ఉండి ఉండవచ్చు కదా. కానీ మనం మనకి నచ్చిన అంశాన్నే తీసుకుంటు, మహనీయుల త్యాగాలని సైతం మాటలతో తూట్లు పొడుస్తాం. చాకలి వాడు అన్న మాటలు ఏ విధంగా కళంకితం చేస్తాయి? సీతా దేవిని అడవికి పంపడం ఆ కళంకాన్ని ఎలా దూరం చేస్తుంది? ఇదండీ ప్రశ్న. దీనికి వివరణ దొరకదు. అదీ బాధ.

    "ఇంకొక మాట.వేల సంవత్సరాల క్రితం జరిగిందన్న కథ ని ఇప్పటి దృక్ పథంతో norms and valuestoe పరిశీలించడం కష్టం. "

    ReplyDelete
  33. Sorry republishing comment after editing a mistake.
    టపాకి సంబంధించి కాక వ్యాఖ్యలలో వాదనకి సపందిస్తున్నాను మన్నించగలరు. నా ఆలోచనకు పదును పెట్టుకుంటున్నాను. కరుణ రస ప్రధానమైన ఈ కథ గురించి ఆలోచిస్తూ సమాజంలో పాతుకుపోయిన ఆలోచనా ధోరణులు, వాదనన్లలో స్పష్టం కాని విషయాలూ, రెండు వైపులా ఎవరి ధోరణులను వారే బలపరుచుకుంటూ వాదించడం సాగుతూ ఉంటుంది ఎప్పుడూ అనిపించి, నా ఆలోచనలో ఐనా కాస్త స్పష్టత ఏర్పడుతుందేమో అన్న ఆశతో అప్పుడప్పుడూ ఇలా వ్రాస్తుంటాను.
    ""ఇంకొక మాట.వేల సంవత్సరాల క్రితం జరిగిందన్న కథ ని ఇప్పటి దృక్ పథంతో norms and valuestoe పరిశీలించడం కష్టం. "
    ఇది నిజమే. నేనూ ఈ మాటే అంటూ ఉన్నా, శ్రీ రాముడికి సీతాదేవి మీద ఉన్న అనురాగాన్ని గురించి నాకు అర్థమైనంతలో అనుమానం లేకున్నా, నన్ను లవకుశల కథ విషయంలో బాధ పెట్టేది ఏమిటా అన్నది ఇప్పటికి వ్యక్తీకరించగలనేమో అని ఒక ప్రయత్నం. ముందుగా ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన కథే ఐనా, ఎవరైనా ఎందుకు అనే ప్రశ్న అడిగితే ఆ విషయం మాట్లాడుతారు కానీ అదే విషయాన్ని స్త్రీల ధర్మాల గురించి నొక్కి వక్కాణించేటప్పుడు ఎందుకు అర్థం చేసుకోరు అని. శ్రీ రాముడి ఏకపత్నీ వ్రతానికి లవకుశల కథ ఒక నిదర్శనం. ఆయన సీతను అడవులకు పంపినా మళ్ళీ వేద ధర్మం కోసం కూడా ఇంకో పెళ్ళి చేసుకోలేదు. ఆ నిబద్ధతను గురించి కాకుండా ఆయన వదిలి వెయ్యడాన్ని గురించే మాట్ళాడతాము. ఎందువలన? చాకలి వాడు భార్యను ఇంటికి రానివ్వకపోవడం, సీతాదేవి గురించి అచవాకులు వాగడం, శ్రీరాముడు సీతాదేవిని అడవికి పంపడం. అంటే ఏమిటి? స్త్రీ నిస్సహాయ స్థితిలో ఇంకొకరి ఇంట్లో ఉండవలసి వస్తే అది తప్పా? దానిని శ్రీ రాముడు సమర్థించాడా? సరే సమర్థించాడు. ఆ తర్వాత ఆయన విలాసంగా జీవించాడా? లేదు కదా? అది highlight చెయ్యం మనం. ధర్మ పన్నాలు స్త్రీల ప్రవర్తన గురించే మాట్లాడతాము. స్వయంగా దేవుడే ఆచరించినా ఆ విలువలని మగవారికి అన్వయించం. ఎందు వలన? అది ఇక్కడ ప్రశ్న. ఈ తరం వారు అడిగే ప్రశ్న. అది అడగగానే శ్రీ రాముడంటే తక్కువ చెసినట్టు అర్థం చేసుకుంటారు. సీతా దేవి ఎందుకు శ్రీరాముడి వద్దకు వెళ్ళలేదు? దాని గురించి మాట్ళాడం మనం. సీతా దేవిని త్యాగం చెయ్యడం శ్రీ రాముడికి ఎందుకు కష్టం అయ్యింది? అదీ ఎక్కువ వాదననలలోకి రాదు. ఆమెని ఎంతగా ప్రేమించాడో కనుక ఆయనకి కష్టం. కానీ ఆయన పేరు, పురాణ పురుషుల గాథలు, ధర్మ శాస్త్రాల అపేరుతో స్త్రీలని అవమానించే వారికి ఆ శ్రీరాముని ప్రేమ అర్థమయ్యే ఉంటుందా? ఆ చాకలి వాడినే ఆ కాలంలోనే తీసుకుంటే అతనికి అర్థం అయ్యి ఉంటుందా? ఇదంతా శ్రీ రాముడు సీతాదేవిని వదిలెయ్యడానికైనా లవకుశులను తన పుత్రులుగా స్వీకరించినా ఏ వివరణ లేకపోవడమే. శ్రీ రాముడు లవకుశులని కొడుకులుగా ఒప్పుకున్న వాడు సీతా దేవిని బేషరతుగా ఎందుకు తిరిగి అంగీకరించలేదు? అసలు గ్రంథంలో ఉందా? తెలియదు. తెలిసిన వారు చెప్తారా? లేదు. చాకలి వాడి మాటలకు సమాధానం చెప్పడం అంటే సీతను అడవులకు పంపడంలో కాదు, సీతా వియోగాన్ని భరించడంలో, అది ఆదర్శమని చూపడంలో ఉండి ఉండవచ్చు కదా. కానీ మనం మనకి నచ్చిన అంశాన్నే తీసుకుంటు, మహనీయుల త్యాగాలని సైతం మాటలతో తూట్లు పొడుస్తాం. చాకలి వాడు అన్న మాటలు ఏ విధంగా కళంకితం చేస్తాయి? సీతా దేవిని అడవికి పంపడం ఆ కళంకాన్ని ఎలా దూరం చేస్తుంది? ఇదండీ ప్రశ్న. దీనికి వివరణ దొరకదు. అదీ బాధ.

    ReplyDelete
  34. రాముడు సీతారాముడిగా తమ ఆలుమగల అన్యోన్యతనీ, రాజారాముడిగా పాలకుడిగా తన నిబధ్ధతనీ రెండింటినీ సమన్వయంతో చక్కగా తన జీవితం ద్వారానే మనకు ప్రకటించాడు. ఒక రజకుని మాటలు సీతకు కళంకం అంటగట్టటం అనేది తమపరోక్షంలో, అదీ చాలాకాలంక్రిందట అంటే ఎప్పుడో 60వేలసం. క్రిందట జరిగిన సంఘటనలను కొత్తతరాల ప్రజలకు అర్ధంకావటం అనేదానిలోని క్లిష్టతగా మాత్రమే మనం చూడగలం. తాను వ్యామోహితుడనైతే సీతను వదలుకుంటానా అన్న ఎదురుప్రశ్నతో రాముడు తనను విహితమైన ధర్మాచరణం తప్ప మరేదీ శాసించలేదని నిరూపించదలచుకున్నాడు. వేరే రకంగా చేసి ఉంటే నిందకు సమాజంలో బలంచేకూరేదేమో! ఈ విషయాన్ని సీతమ్మకూడా అర్దం చేసుకున్నది. మరికొంచెం లోతుగా ఆలోచిద్దాం. సరే, రాముడి యీ చర్య వలన రాముడి ప్రతిష్ట యినుమడించింది. మరి సీత సంగతి యేమిటి? రాముడు విహితకర్మాచరణనిష్టుడూ సీత వేరే వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే మనిషీ అనుకోలేము. అలాగయితే వారి అన్యోన్యత యుగాలను జయించేది కాదు. సీతకు మిగిలిన దారి రాముడి బిడ్డలను రాముడికి అప్పగించి తాను రాముడికి దూరంగానే ఉండిపోవటం ద్వారా తమమధ్య సామాన్యుల స్థాయి బంధంకాదని అది కేవలం ఆత్మీయం అని నిరూపించటం. ఆ తల్లి చేసినది అదే. ఈ సారి స్వప్రజ అంటే అయోధ్యా సైన్యం సమక్షంలోనే తనతల్లి భూదేవిలో ఆ అయోనిజ ఐక్యం అయిపోయింది. సామాన్యురాలు అగ్నిప్రవేశం చేయగలదా? చేసే ఉండాలి, మరి భూప్రవేశం చేసింది కదా! ప్రజలకు సమాధానం దొరికింది. అయితే అది వాళ్ళకు తెలిపేందుకు సీతారాములు బిడ్డలకోసం తలిదండ్రులవలె యెంతో త్యాగం చేయవలసి వచ్చింది.

    ReplyDelete
  35. సీతారాముల జీవితాలు కష్టాల కడలులే. రామావతార సమాప్తి కథలో కూడా ఇది నిరూపితమౌతుంది. యమధర్మరాజు మునిరూపున వచ్చి రాముడి యేకాంత దర్శనం కోరుతాడు. ఆ ముని సూచన మేరకు రాముడు తమ యేకాంతానికి భంగం కలిగించిన వారికి మరణశిక్ష అని ప్రకటిస్తాడు. అటు పిమ్మట యేకాంతంలో యముడు నిజరూపం ప్రదర్శించి స్వామీ అవతారకార్యక్రమం పూర్తిచేసారు తాము వైకుంఠానికి విచ్చేయవలసినది అంటూ ప్రసంగిస్తున్నాడు. ఈ లోగా దూర్వాస ఋషి వచ్చి తక్షణం రామదర్శనం కావాలనీ లేకుంటే రాజ్యాన్నీ, రాజవంశాన్ని శపించి రూపుమాపుతానని హఠం చేస్తాడు - ద్వారం వద్ద స్వయంగా కాపున్న లక్ష్మణుడితో. విధిలేక లక్ష్మణుడు రాముడి యేకాంతాన్ని భంగపరచవలసి వస్తుంది. అలాగే విధిలేక రాముడూ లక్ష్మణుడికి మరణశిక్ష విధిస్తాడు. నమ్ముతారా? వశిష్టమహర్షి కలిగించుకుని లక్ష్మణుడిని విసర్జించటం వధాసమానమేనని లక్ష్మణువిసర్జన చేయిస్తాడు. యావజ్జీవమూ యే అన్నగారికైతే భక్తుడై నీడలా మెదిలాడో ఆ అన్న స్వయంగా, లక్ష్మణా నిన్ను బహిష్కరిస్తున్నాను మరి కనబడకు పో అన్నాడు! ఆ అన్నదమ్ముల మనస్థితులను ఊహించ గలరా? ఆ లక్ష్మణుడి సరయూ నదీ ప్రవేశాన్ని ఆదర్శంగా గ్రహించి మిగిలిన సోదరులతో రాముడూ దానినే ఆచరించి అవతారం విడుస్తాడు. వారి పార్ధివదేహాలు లభించ లేదు. వారు సరయులో ఐక్యం అయారని భావించే ప్రజ యీనాటికి ఆనదిని రామస్వరూపంగా పవిత్రంగా కొలుస్తుంది.

    ReplyDelete
  36. ఈ మధ్య నామీద నాకు నియంత్రణ తప్పి, వ్యాఖ్యలు రాయడం మానుకున్నాను. అయినా సనత్ వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తున్నాను.స్పామ్ అయితే నిర్దాక్షిణ్యంగా తొలగించండి. :)

    సనత్ గారూ, మీరు వేసిన ప్రశ్నను రెండు విధాలుగా అనుకుందాం.౧. వాల్మీకి (ఉత్తర)రామాయణంలో ఎందుకలా వ్రాసి ఉన్నది? ౨. "రాముడు" ఎందుకలా చేశాడు.

    మొదటి ప్రశ్నకు సమాధానం వెతికితే దొరకుతుంది. ఉత్తర రామాయణం మొత్తం ప్రక్షిప్తం - ఇది ఉత్తమమైన సమాధానం.

    రెండవప్రశ్న - ఈ ప్రశ్నను అడిగి ప్రయోజనం లేదు. అసలు మౌలికంగా "ధర్మం" అంటే ఏమిటి? ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి రాకుండా ఆలోచిస్తూ ఉండండి. భారతంలో ఒక ధర్మం, రాముడిది ఒకధర్మం, ధర్మకీర్తిది ఒకధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం, అశోకుడి ధర్మం, సైన్సులో ఒక ధర్మం..ఇలా ధర్మం తాలూకు నిర్వచనం మారుతూనే ఉంది. సో, అసలు ధర్మం అని ఒక constant framework ను నిర్వచించడం సాధ్యమేనా? రాముడు చేసినది అధర్మం అనుకున్నా, అందుకు వ్యతిరేకంగా ఆచరించిన ధర్మం కూడా "ఏదో" విధంగా ధర్మం అవడం సాధ్యమే. కాబట్టి ప్రశ్న రాముడు కాదు, ఆయన ఆచరణ కాదు. ప్రశ్న రామాయణంలో కాక మరెక్కడో ఉంది. ఆ ప్రశ్న ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకుందుకు ఎవరికి వారు ప్రయత్నించడం మంచిది.

    ReplyDelete
  37. రవి గారూ ! నిజం ఒప్పుకోవాలి. సంస్కృత భాషా ప్రచార సమితి వారు నిర్వహించిన ఒక వర్క్ షాపు పుణ్యమా అని నాకు వచన సంస్కృతమే వచ్చు, అదీ కొంచం కొంచం గానే వచ్చు. కావ్యాలను అర్థం చేసుకోగలిగిన స్థాయి నాకు లేదు. ఆమాటకొస్తే వ్యావహారిక తెలుగే గానీ గ్రాంథికమూ, కావ్యగత తెలుగు కూడా అర్థం కూడబలుక్కునో, ఎవరి సహాయంతోనో, వ్యాఖ్యానాలతోనో చదువుకోవాలి/ అర్థం చేసుకోవాలి.

    అలాంటప్పుడు ఏమీ రానివాణ్ణి ఓ మూల కూర్చోక తెలిసీ తెలియని (వచ్చీరాని) జ్ఞానంతో ఎందుకొచ్చిన ఈ కుస్తీలంటారా? నిజమే... తెలిసినవాళ్ళు చర్చ చేసుకుంటూంటే మనక్కూడా తెలిసిపోతుందేమో అన్న దురాశ. :-)

    మీరన్నదాన్ని కూడా ఒప్పుకుంటా... ఎవరికి వారు శోధనచేసుకుని సమాధానాలు వెతుక్కోవాలి. అందుకేనేమో ఎంత కవ్విస్తున్నా కామేశ్వర రావుగారు మాత్రం సమాధానం రాయలేదు.. ;)

    అవునూ, ఒక సందేహం: వాల్మీకి ఉత్తర రామచరితం వ్రాశారా?

    ReplyDelete
  38. సనత్, 'సాంప్రదాయం' ప్రకారం చూస్తే ఉత్తరకాండ వాల్మీకి కృతమే. కొంచం చారిత్రిక దృక్పథం ఉన్నవాళ్ళు ప్రక్షిప్తమని అంటారు.

    నేను బ్లాగుల్లో నేర్చుకున్న ఒక నీతి ఏంటంటే, ఏ విధమైన సీరియస్ చర్చనీ పబ్లిక్ ఫోరమ్సులో చెయ్యకూడదు అని. ఇలాంటివి ప్రైవేటు గ్రూపుల్లో (అంటే బాగా పరిచయం ఉన్న వ్యక్తులతో మాత్రమే) చర్చించడం మంచిది. కామేశ్వరరావు గారిని వీలైతే ఓసారి వ్యక్తిగతంగా కలవమని నా సలహా. (నాకా అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు. :-) )

    ReplyDelete
  39. This comment has been removed by the author.

    ReplyDelete
  40. రెండ్రోజులిటి రాకపోయేసరికి చాలా చర్చే జరిగిందే! ఒకొక్కరిదీ ఒకో దృక్కోణం!

    సనత్‌గారు,

    ఏదో పనిమీద ఊర్లు తిరుగుతూ ఇంటర్నెట్టుకి దూరమయ్యాను కాని, కవ్వించినా కదలని నిగ్రహం నాకెక్కడిది!:) మీ ప్రశ్నల దగ్గరకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు ముచ్చటించుకోవాలి. ఒకటి - రామాయణం వ్రాసిన వాల్మీకే ఉత్తరరామాయణం వ్రాసాడని నేను నమ్మను. రెండు - ఉత్తరరామాయణం కథకీ, లవకుశ సినిమా (ఇప్పటి శ్రీరామరాజ్యం) కథకీ చాలా వ్యత్యాసముంది. సంస్కృత మూలం నేను చదవలేదు కాని, తిక్కన నిర్వచనోత్తరరామాయణం, కంకంటిపాపరాజు ఉత్తరరామాయణం చదివాను. అవి మూలాన్ని అనుసరించినవే. మూల కథకి, సినిమా కథకి మధ్యనున్న తేడాలేమిటో చెప్తాను, గుండె చిక్కబట్టుకొని వినండి! :)

    1. మూలంలో చాకలివాని ప్రసక్తే లేదు. రావణుడి చెరలో ఏడాదున్న సీతని కేవలం కామమోహితుడై రాముడు తెచ్చి ఏలుకుంటున్నాడన్న మాట చాలామంది ప్రజలు అనుకుంటున్నారని భద్రుడు రామభద్రునితో చెపుతాడు.
    2. రాముడు తన తమ్ములని రాజ్యం చెయ్యమని వేడుకోవడం లేదు. సీతని విడిచిపెట్టే నిర్ణయం నేరుగా తీసుకుంటాడు రాముడు.
    3. అశ్వమేధయాగం చేయాలని ఎవరో చెప్పడం కాదు, రాముడే స్వయంగా యాగం చెయ్యాలని అనుకొని ఏది చేస్తే బాగుంటుందని తమ్ములనడిగి అశ్వమేధం చెయ్యాలని నిర్ణయిస్తాడు. స్వర్ణసీత ప్రసక్తే లేదు. సీత లేకుండా యాగం చెయ్యగలడా లేడా అన్న విషయమూ ఎక్కడా ప్రస్తావించబడలేదు. అయితే యాగం కోసం మరొక వివాహం చేసుకున్నాడన్న ప్రస్తావన కూడా లేదు కాబట్టి ఒక్కడే ఎలాగో యాగాన్ని నిర్వహించాడనే అనుకోవాలి.
    4. గుఱ్ఱాన్ని కుశలవులు పట్టుకోడం, వాళ్ళతో యుద్ధం - ఇలాంటి కథ అసలే లేదు. అశ్వమేధయాగం ముగిసిన తర్వాత వాల్మీకే స్వయంగా లవకుశులని రాముని సభకి తీసుకువస్తాడు. సభలో అందరిముందు వారు రామాయణం గానం చేస్తారు. వారిని చూసి రామునికి ముచ్చట వేస్తుంది. సీత వాల్మీకి ఆశ్రమంలో కవలలకి జన్మనిచ్చిన విషయం చూచాయగా రామునికి తెలుసు. అంచేత వీరు వారేనా అనే అనుమానం కూడా వస్తుంది. అదే వాల్మీకిని అడుగుతాడు. వాల్మీకి వారు రాముని కుమారులే అని చెప్పి, వారిని పరిగ్రహించమని, సీతకూడా పరమ సాధ్వి అనీ, ఆమె గురించి ఎవ్వరూ చెడుగా ఆలోచించనే కూడదని బుద్ధి చెప్పి, ఆమెనికూడా పరిగ్రహించమని చెప్తాడు. దానికి రాముడు సరేనని, కాకపోతే అప్పటి ధర్మం ప్రకారం సీత సభలో తన సౌశీల్యం గురించిన శపథం చెయ్యాలని కోరుకుంటాడు. దానికి అంగీకరించిన వాల్మీకి మునిపత్నులతోడుగా సీతని సభలోకి పిలిపిస్తాడు. అప్పుడు సీత, తాను పతివ్రతనయితే భూదేవి వచ్చి తనని తనలోకి చేర్చుకోవాలని శపథం చేస్తుంది. ఆమె మాట మేరకు భూదేవి వచ్చి ఆమెని తన అంకసీమపై కూర్చోపెట్టుకొని తనలో కలుపుకుంటుంది.

    అదీ అసలు కథ!

    ఇక మీ ప్రశ్నల విషయానికి వస్తే:

    1. రాముడు సీతని పరిత్యజించడం న్యాయమా, ధర్మమా అన్న ప్రశ్నలకి అప్పటి(ఎప్పటి?) న్యాయ ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా చదివిన పండితులు జవాబు చెప్పాలి. నాకు ఈ కాలపు మన రాజ్యాంగం గురించే సరిగా తెలియదు, ఇక అప్పటి ధర్మశాస్త్రాల సంగతెందుకడుగుతారు!:) అసలు పరిత్యజించడమంటే ఏమిటి? అప్పటిలో ఇప్పటిలా విడాకులున్నాయా? భార్యాభర్తలు విడిగా ఉన్నంత మాత్రాన వారు భార్యాభర్తలు కాకుండా పోతారా? అగ్నిప్రవేశ సన్నివేశంలో రాముడు సీతకి వేరే వారిని వివాహం చేసుకొనే స్వేఛ్చనిస్తాడు. అడవిలో విడిచిపెట్టేప్పుడు అలాంటిదేమీ లేదు, ఎందుకని? ఈ రెండిటి మధ్యనా ఏమిటి తేడా? ఇలా అనేకమైన ధర్మసూక్ష్మాలని శాస్త్రం బాగా చదువుకున్న పండితులు మాత్రమే చెప్పగలరు. వాటిని సరిగ్గా తెలియకుండా ఆలోచించడం వలన ప్రయోజనమేమీ లేదు.

    2. రాముని పాత్ర దృష్టితో చూసినట్లయితే తాను చేసినది ధర్మం అని పరిపూర్ణంగా నమ్మే చేసాడు. సీతకూడా రాముడు తనని అడవులకి పంపడం అధర్మమని ఎక్కడా అనలేదు (అనుకున్నదో లేదో మనకి తెలీదు!). తనకా విషయం చెప్పలేదే అన్నదే సీత బాధ.

    3. నాకు అర్థమైనంతవరకూ, సీతని తాను కామమోహితుడై ఏలుకుంటున్నానన్న అపవాదును పోగొట్టుకోడానికి మాత్రమే సీతని తనకి దూరంగా అడవులకి పంపాడు కాని, అది సీత చేసిన అపరాధానికి శిక్షగా కాదు. భర్తగా తనకా అధికారముందనే భావించాడు.

    4. సీతకి ఎందుకు చెప్పలేదు అన్నదానికి స్పష్టమైన సమాధానం లేదు. (రాముని దగ్గరే లేదన్నాను కదా, ఇక నా దగ్గర ఎక్కడుంటుంది! :)

    ReplyDelete
  41. అలాగే భవభూతి ఉత్తరరామచరిత్రమ్ లోని కల్పన వేరుగా ఉంటుంది. అందులో కూడా చాకలివాని ప్రసక్తి ఉండదు. కానీ ఆ కథ చివరికి సుఖాంతమై సీతారాములు కలిసి జీవిస్తారు. అందులో సీత వాల్మీకి ఆశ్రమంలో నివసించదు. పాతాళంలో తన తల్లిదగ్గర ఉంటుంది. లవకుశుల్ని మాత్రం వాల్మీకి పెంచుతాడు. రాముణ్ణి పంచవటి దగ్గర సీత రహస్యంగా చూసి, ఆయన విరహవ్యధని చూసి బాధపడుతుంది.

    ఇందులో అశ్వమేధయాగ ఘట్టంలో లవకుశులతో తలపడేది ఎవరో తెలుసా? లక్ష్మణుడి కొడుకైన చంద్రకేతువు. మొత్తం కథ రాయాలంటే నేనూ ఓసారి రిఫర్ చెయ్యాలి. ఎప్పుడేనా వీలు కుదిరినప్పుడు రాస్తాను.

    ReplyDelete
  42. కొసమెరుపు ప్రశ్నకు : నారదుడు -- ఎ. వి. ఎస్ ??

    ReplyDelete
  43. కామేశ్వర రావు గారూ !!

    చాలా థ్యాంక్స్ !! మీరు గమనించారో లేదో నేను శ్రీరామ రాజ్యం సినిమా గురించి ఎక్కడా పేర్కొనలేదు.(ఎందుకంటే ఇంకా చూడడానికి టైము కుదరటం లేదు) పాత లవకుశ మాత్రం లెక్కగుర్తులేనన్నిసార్లు చూశా... రాముడి మీద నేనేర్పరచుకున్న అభిప్రాయానికి విరుధ్ధంగా ఉన్నవాటి పట్ల నాకు తక్కువభావం ఏమీలేదు అలాగని వాటిని నమ్మేంత సీను కూడా లేదు. మనీ సినిమాలో నేనూ , మా రేణు, మా ముసలోడు అన్నట్టు, నా దృష్టిలోనున్న రాముడు నాకు నచ్చుతాడుకాబట్టి వాడిగురించి ఆలోచించుకోవటంలో కొంత తృప్తి ఉంది కనుక అందులోనూ శ్రీ భాష్యం అప్పలాచార్యులవారి ఎదో ఉపన్యాసం లో విన్నా రామోవిగ్రహవాన్ ధర్మః అన్నది ఏ ఋషో, దేవతలో కాదు, శుర్పణఖ అన్నది అని. రాక్షసులే అంతలాగ పొగిడారంటే రాముడి గురించి, ధర్మ స్వరూపం గురించి రాముడి స్వభావాన్ని, రాముడి ఆలోచనా దృక్పథాన్ని తెలుసుకుందామనే ఆసక్తే. కనుక మీరు చెప్పిన అసలు కథను చదివి ఆహ్లాదంగా/ హాయిగా ఫీలయ్యానే కానీ గుండెలమీదకి తెచ్చుకో లేదు. :-)

    ముందే చెప్పినట్టు రామాయణం నేను చదువుకోలేదు కానీ ఉత్తర రామ చరితం ఎందుకో రాముణ్ణి చిత్రించిన విధానాన్ని బట్టి వాల్మీకి రచితం కాదేమో అని అనుకునేవాణ్ణి. అది వాల్మీరచితమా కదా అని నేనడగ్టానికి కూడా కారణం అదే...భవభూతి రచన అని స్కూల్లో చదువుకున్న సన్స్కృతం క్లాసులో గానీ ఆ రచనలో ఉన్నదేమిటో తెలీదు కనుక కూడా కథ పైన , అందులో న్యాయాన్యాలాపైన తర్కం లేదు.

    మీ 1,2,3,4 సమాధానాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీ రచనల ద్వారా మిమ్మల్నెఱుగున్నంతలో మీ సమాధానాలవే ఔతాయని ఎందుకో అనుకున్నాను. (మీరు అన్నాక ఇప్పుడు ఈ మాట చెప్పటం సుళువే అనుకోండి...)

    లవకుశ నాకు నచ్చటానికి కారణం ఆ సినిమాలోని పాటలు మాత్రమే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన, ఆహార్యం ఇవేవీ కావు. ఆ సినిమా చిరస్థాయి గా నిలబడడానికి కారణం కూడా ఆ పాటలే అని నా నమ్మిక. (ఉన్లికె మాయా బజార్). మాయా బజార్ ఆణిముత్యమే కానీ చూసి ఆనందించవలసిన సినిమా. లవకుశ విని ఆనందించేయవచ్చు ఇప్పటికి కూడా... శ్రీ రామరాజ్యం పాటలు విన్నప్పుడు నాలో అటువంటి స్పందన ఎదీ కలుగలేదు కనుక ఈ సినిమా ఆణిముత్యమౌతుందన్న నమ్మకం కలగలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సినిమా చూసొచ్చాక మారచ్చునేమో.

    ఇంతకీ కవ్వింత గురించి నేనన్నది ఒకటి, మీరు తీసుకున్నది ఇంకొకటి. క్లూ ఇస్తాననో ఇవ్వను అనో చెప్పాలి. ఇస్తానని ఇవ్వకపోవడమేమిటి అన్నది నా కవ్వింపు. (మీ గుండె చిక్కబట్టుకొనమన్న సలహా నాకిక్కడ అన్వించుకుంటున్నా ఎందుకంటే చూసినవాడికన్నా చూడని వాడికి ఆత్రం ఎక్కువ కదా, సస్పెన్సు తట్టుకోలేకపోతున్నా).

    దానిని కవ్వింపు అని అనడానికి కారణం మీలో విశ్వనాథ రచన తాలూకు సస్పెన్సు నడిపే నేర్పు ఉంది, చెబుతానంటారు చెప్పరు... ఆ చెప్పేదాక మాకు ఇక్కడ ఆత్రం ఆగదు... నేనెప్పటి సంగతిని ఉటంకిస్తున్నానో గుర్తుకు వచ్చిందా???? మీరు ఆడిన మాట తప్పారు... చెబుతానన్న సంగతి ఒకటి చెప్పకుండా ఇన్నాళ్ళు దాటవేస్తున్నారు. ఇప్పటికైనా అది చెబుతారా? ఇంతకీ అదలు అదేమిటో అయినా గుర్తుకు వచ్చిందా? లేక నేను మీకు దానిగురించి ఒక చిన్న క్లూ ఇవ్వలా ???

    ReplyDelete
  44. మీకు దానిగురించి ఒక చిన్న క్లూ ఇవ్వాలా ??

    ReplyDelete
  45. రామోవిగ్రహవాన్ ధర్మః అన్నది మారీచుడు.

    ReplyDelete
  46. కొసమెరుపు సమాధానం చెప్పకపోతే, నేననుకున్న పాత్ర తప్పించి సినిమాలో అన్ని పాత్రలనీ అందరూ చెప్పేలా ఉన్నారు! ఎందుకొచ్చిన గొడవ, చెప్పేస్తాను. దానికి ముంది, క్లూ విషయం. "సరే, ఒక చిన్న క్లూ." అనే వాక్యంలోనే ఆ క్లూ ఉంది.:) అది చిన్నపాత్ర అని. అందరికన్నా సాయికిరణ్‌గారు దగ్గరగా వచ్చారు. హనుమంతుని పాత్రకూడా బాగానే అనిపించింది. కాని నాకు అన్నిటికన్నా నచ్చినది భూదేవి పాత్ర, రోజా వేసింది. ఆంగికం, ఆహార్యం, అభినయం, వాచికం (ఇది ఆవిడదో కాదో తెలియదు!) అన్నీ చక్కగా కుదిరినట్టు అనిపించింది నాకు. మా అమ్మాయయితే లవకుశలో కన్నా ఇందులో భూదేవికే ఎక్కువ మార్కులిచ్చేసింది కూడా!

    చెబుతానని చెప్పకుండా దాటవేస్తున్న సంగతేమిటో అసలు గుర్తుకు రావడం లేదు! ఏమిటది? అయినా దానికి టైంలిమిట్ అంటూ ఇచ్చుండను, కాబట్టి మాట తప్పినట్టు అవ్వదు :)

    ReplyDelete
  47. మురళీ, థాంక్స్!! సారీ మారీచుడే అనుకుంట... శూర్పణఖ అని పొరబడ్డా.. చిన్నప్పుడు 1984/85 లో విన్నది కదా సరిగ్గ గుర్తు లేదు (ఆ.. ఎవరైతేనేం .. ఇద్దరూ రాక్షసులే కదా అని సర్దుకుపోతా.... ;) )

    అయినా నేను క్లూ అడిగితే మీరు సమాధానం కూడా ఇచ్చేశారు. కనీసం "చిన్న" అని అయినా అనుంటే క్లూ అక్కడ ఉందని తెలుస్తుంది కానీ చెప్పకపోతే ఇప్పుడు చెబుతారు ఇప్పుడు చెబుతారు అనుకుంటూ 40 వ్యాఖ్యలు చదువుకోవడమే అయ్యింది కానీ క్లూ మాత్రం బయటపడలా.... ఏమయితేనేం... నేను చూసినప్పుడు దానిని పరిశిలనగా చూసి ఏకీభవిస్తున్నానో లేదో చెబుతా...

    మీరు మాట తప్పలేదు. అయినా హనుమంతుడి లాగా ఆచితూచి పదాలు వాడ్తారు కాబట్టి అన్వయించుకునేవాళ్ళు ఏమని అడిగినా మీరు మీకు కుదిరిన సమాధానం రాసేస్తారన్న అనుమానమూ ఉంది.

    నాకు మీ అంత సస్పెన్సు మయింటెయిన్ చెయ్యడం రాదండోయ్...

    ఇంతకీ నేను ఉటంకిస్తున్నది సుమారు రెండేళ్ళ క్రితం దాదాపు ఇదే సమయం లోది... ఈ చిన్న క్లూ తో నేను తప్పో ఒప్పో చెప్పి సమర్ధించేసుకోగలరని తెలిసినా చెప్పేస్తున్నా..

    ReplyDelete
  48. నాక్కూడా భూదేవిగా రోజా నటనా, ఆహార్యం చాలా నచ్చాయి. ముఖ్యంగా సీత వేడుకోడానికి దగ్గరకి వెళ్ళినప్పుడు తల పక్కకి తిప్పుకోవడం. :-)

    అయితే 'ఇష్టపది' రివ్యూలో ఈ భూదేవి గురించి జయదేవ్ గారు రాసిన వాక్యం.

    'అయితే, గర్భవతిగా ఉన్న సీతాదేవిని, భూదేవి ఓదార్చే సన్నివేశంలో భూదేవి పాత్రలో రోజాను చూస్తుంటే, గర్భవతిగా ఉన్నది సీతా, లేక భూదేవా అని అనుమానం కలిగితే ఆశ్చర్యం లేదు.'

    De gustibus non est disputandum. :-)

    ReplyDelete
  49. మీ 'చిన్న' క్లూ నారదులవారికి అందరికన్నా బాగా వర్తిస్తుంది. :‍) ఒక 'భారీ' క్లూ ఇచ్చి ఉంటే బాగుండేది.

    ReplyDelete
  50. నాగమురళిగారు,
    :) నేను ఇష్టపది రివ్యూ చదవలేదు. అయినా భూదేవి నిత్య గర్భవతి కదా, అంచేత అందులో తప్పేం లెదు! :)

    సనత్ గారు,
    రెండేళ్ళై చెప్పలేదంటే, నేను చెప్పలేనిదేమోనండీ! ఎంతాలోచించినా గుర్తుకురావడం లేదు. :(

    ReplyDelete
  51. కామేశ్వర రావు గారూ !!

    రెండేళ్ళ క్రితందే గుర్తులేదన్నారంటే రెండున్నరేళ్ళది ఖచ్చితంగా మర్చిపోయే ఉంటారు...గుర్తుండే అవకాశం లేదు.. చెన్నపురిలో ఉంటున్నారు కదా !!కొంపదీసి 'గజనీ'శ్వరులవ్వలేదు కదా...??

    అయినా పడ్డవాడికే తెలుస్తుందండీ కష్టమంతానూ.. మీకేం మహారాజులా, భేషుగ్గా చక్కా క్వొస్చనేసిపోతారు... మా బోటి వాళ్ళు శివాజీ సినిమాలో పాస్వర్డ్ దొరకక తలపట్టుకున్న వాళ్ళలాగా అయిపోతాము మీరా గుట్టు విప్పకపోతే...

    సర్లెండి మొదటిదానికి క్లూ: మనసు కవి ఆత్రేయ రచన కీ, ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతానికీ, బాలు పాటకీ తెలుగుపద్యానికీ గల లింకు.. ;)

    (చూడండి క్లూ అంటే ఇంత పేద్దగా తేలిగ్గా ఉండాలి...)

    ReplyDelete
  52. సరే ఇంక నేనే మొదటిది చెప్పేస్తా.... తననా తననా అన్నా తానా అన్నా తాళం ఒకటే కదా... అనడంలో ఆంతర్యం ఏమిటి ??

    ReplyDelete
  53. సర్లెండి రెండోది (రెండున్నరేళ్ళ ముందుది) కూడా చెప్పేస్తున్నా..

    రాముడికి తెలిసినదీ దశరథుడికి తెలియనిదీ అయిన ఆ చిదంబర రహస్యం ఏమిటి?? కైకేయ దేవతలకోరిక మేరనే అరణ్యాలకి పంపింది అన్నారు ఏమాకథ?

    ReplyDelete
  54. సందేహమంటే ముందు ఈ రెండోదే అనుకున్నాను. కాని మీరిచ్చిన క్లూ బట్టి ఆ పాట గుర్తుకొచ్చింది. ఆ పాటకి సంబంధించి అక్కడ వ్యాఖ్యలో చెప్పినదే నాకర్థమైనది. అంతకుమించి వివీరణ నాకూ తెలియదు! ఇక రెండవ సందేహం గురించి, దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. :)

    http://magazine.maalika.org/2011/11/06/%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%B5%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%88%E0%B0%95-gospel-of-judas/

    ReplyDelete
  55. కామేశ్వర రావుగారు, మాలిక లో మీ వ్యాసం చాలా బాగున్నది. ఇన్నేళ్ళుగా సమాధానం కోసం ఎదురు చూస్తూంటే కనీసం అడ్రస్ మార్చాము, అక్కడెక్కడో వెదుక్కోగలరు అని మాటవరసకైనా చెప్పారు కాదు.. :-(

    మాలిక పరిచయం కలగటం కూడా ఇదే ప్రథమం. ధన్యవాదాలు.

    ReplyDelete
  56. అనును భూదేవిగా రోజా చాలా చక్కగా నప్పింది. ఆ ఠీవి, కోపం అన్నీనూ. అసలామె మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆర్భాటం అంతా చాలా బాగా చిత్రించారు. దురదృష్టవశాత్తు గొంతు ఆమెది కాదు. ఆమె తనగొంతుతో మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం. నిత్య గర్భవతి .. కామేశ్వర్రావుగారు, మీరు సామాన్యులు కాదు!! :)

    ReplyDelete
  57. తననా = తానా = నాలుగు మాత్రలు, అంచేత తాళం ఒకటేనని అర్ధం కావచ్చు.
    ఇట్లు మౌని

    ReplyDelete
  58. అసలు రాముడు కెవలం తాను కామమోహితుడను కానని నిరూపించడానికె ఐతె సీతను అడవికె పంపాల్సిన అవసరం ఏముంది పుట్టినింటికె పంపించి ఉండవచ్చు కదా? ఎలాగూ సీత తప్పెం లెదని ఐతె రాముణికె నిర్ధారణ ఐంది కదా? ఎంత క్రూరంగా ప్రవర్తిస్తె అంత రాజధర్మమనుకున్నట్టున్నాడు రాముడు. ఎంత సెపటికి రాముడు ఇంకొ పెళ్ళి చెసుకొలెదు తాను కూడా బాధ పడుతూనె ఉన్నాడు అంటారు కానీ కనీసం పాత లవకుశ లొ లవుదు చెప్పినట్టు " సమయానికి ఇంత తింటున్నాడు - నీడ పట్టున ఉంటున్నాడు కదా!

    ReplyDelete
  59. వీరు వ్రాసిన శీతాకాల పద్యాలు ఎవరివద్దనైనా ఉన్న పోస్ట్ చేయగలరు

    ReplyDelete